MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు.

5 Min read
Author : ramya Sridhar
Published : Dec 17 2021, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు.  కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అకాల భోజనం, స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి తప్పకపోవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313


మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ప్రముఖుల సాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  

513

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది.  ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు ఎదురుకావచ్చు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

613


కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఊహించని ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గతాన్ని నెమరువేసుకుంటారు. గృహనిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు.  కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

713

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఎదురుచూడని ఆహ్వానాలు రాగలవు. నిరుద్యోగుల∙శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకుని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.  వారం చివరిలో చికాకులు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండి రుణబాధలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ముఖ్య వేడుకలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు.  కళారంగం వారికి సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

913


ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి పొందుతారు. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం ప్రారంభంలో భూవివాదాలు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలలో ఆటంకాలు తొలగుతాయి. రుణాలు తీరే సమయం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం రాగలదు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1113

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. లేనిపోని ఖర్చులు మీదపడవచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కోర్టు వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం పనులు సజావుగా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని  వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో మీపై  గౌరవం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.  వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved