Zodiac signs:ఈ రాశులతో శత్రుత్వం.. మీకే ప్రమాదం..!
స్నేహం చేయకపోయినా పర్వాలేదు కానీ.. వైరం మొదలై.. శత్రువులుగా మారితే మాత్రం చాలా కష్టం. కొందరితో శత్రుత్వం మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారితో శత్రుత్వం.. మీకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందట.

ప్రపంచంలో చాలా మంది మన చుట్టూ ఉంటారు. అయితే.. మన చుట్టూ ఉన్న అందరితోనూ మనం స్నేహం చేయలేం. కొందరితో స్నేహంగా ఉండగలం.. మరి కొందరితో..తెలీకుండానే వైరం పెరిగిపోతుంది. స్నేహం చేయకపోయినా పర్వాలేదు కానీ.. వైరం మొదలై.. శత్రువులుగా మారితే మాత్రం చాలా కష్టం. కొందరితో శత్రుత్వం మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారితో శత్రుత్వం.. మీకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందట. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...
1.వృషభ రాశి..
ఈ వృషభ రాశివారు మామూలుగానే కాస్త మొండిగా ఉంటారు. వీరికి కోపం కూడా కాస్త ఎక్కువ. కాబట్టి.. వీరితో శత్రుత్వం పెట్టుకొని.. వారి కోపానికి ఆజ్యం పోసి మరింత పెంచకూడదు. ఏదైనా వారికి కోపం తెప్పిస్తుంది అంటే దానికి దూరంగా ఉండటమే మంచిది. వీరి కోపాన్ని తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. అది మీకే టెన్షన్ తెప్పిస్తుంది. వీరితో శత్రుత్వం మీకే సమస్యలను తీసుకువస్తుంది. కాబట్టి.. వీరితో వైరం పెట్టుకోకపోవడం మీకే మంచిది.
2.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు కోపంగా ఉంటే మీపై ఎమోషనల్ యుద్థం చేస్తారు. మీరు వారిని శత్రువుగా భావిస్తే... వారు కూడా మిమ్మల్ని శత్రువులా ఫీలౌతారు. మీ గురించి ఇతరులకు లేని పోని విషయాలను చెప్పి.. మిమ్మల్ని మరింత చెడు చేయాలని చూస్తారు. వీరి ఆలోచనలు చాలా విషపూరితంగా ఉంటాయి. వీరితో వైరం పెట్టుకుంటే.. తర్వాత మీరే బాధపడతారు.
3.వృశ్చిక రాశి..
ఈ రాశి వారితో వైరం కూడా మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది.వీరి కోపం ఎదుటివారిలో కలవరం పెంచుతుంది. వీరి కోపానికి ఎవరైనా భయపడిపోతారు. వీరికి నటించడం చేత కాదు. కానీ.. వారిని శత్రువులుగా భావిస్తే... ముఖంపైనే వైరాన్ని చూపిస్తారు. ఒక్కసారి వీరితో శత్రుత్వం మొదలైందంటే.. వీరు అస్సలు వదిలపెట్టరు. వీరితో వైరం పెట్టుకుంటే.. మీరు ఎదురు దాడికి సిద్ధంగా ఉండాలి.
4.ధనస్సు రాశి..
నిజానికి ధనస్సు రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వీరిని బాధ పెట్టడం కూడా చాలా సులువు. కానీ.. ఒక్కసారి వీరు ఎవరిపైన అయినా పగ పట్టారంటే చాలు.. వారు తమ శత్రువుపై విజయం సాధించే వరకు వదిలపెట్టరు. సమయం వచ్చినప్పుడల్లా.. విషం చిమ్ముతూనే ఉంటారు. మీరు ఒకవేళ వారితో సరదాగా ఉండాలని ప్రయత్నించినా వారు ఊరుకోరు.