MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. కన్య రాశి జాతకం

Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. కన్య రాశి జాతకం

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో కన్య రాశివారి విదేశీ ప్రయాణం గురించి  ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది.   అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తాకడం కానీ,  అవమానాలు  ఎదురవడం కానీ జరగవచ్చు. 

6 Min read
ramya Sridhar
Published : Mar 31 2022, 01:10 PM IST| Updated : Apr 01 2022, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
virgo

virgo

ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

27
VIRGO

VIRGO

 కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం  వృత్తి విషయంలో అనుకూలంగా ఉంటుంది.  ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  
ఉద్యోగం
వృత్తి పరంగా  సంవత్సరమంతా  గురు గోచారం, సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శనిగోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. గురువు ఏడవ ఇంటిలో అనుకూలంగా సంచరించటం వలన వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి.  ముఖ్యంగా  సంవత్సర ఆరంభం నుంచి జూలై మధ్యకాలంలో తిరిగి జనవరి తర్వాత గురు మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదోన్నతి కానీ అనుకున్న ప్రదేశానికి బదిలీ కానీ అవుతుంది.  అంతేకాకుండా మీ విలువ మీ సహోద్యోగులు గుర్తించడం, వారి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.  ఈ సమయంలో మీకు అవార్డులు కానీ లేదా ప్రశంసలు కానీ లభిస్తాయి.  విదేశీ ప్రయాణం గురించి  ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది.   అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తాకడం కానీ,  అవమానాలు  ఎదురవడం కానీ జరగవచ్చు.  ఈ సమయంలో అత్యాశతో కానీ, ముందు వెనుకా ఆలోచించకుండా ఎటువంటి పనులు, ముఖ్యంగా మీ శక్తికి మించిన పనులు చేయడానికి ఒప్పుకోకండి.  దాని వలన ఆ పని కాకపోవడమే కాకుండా మీకు అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది.   అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యాత్మక సమయాల్లో మీ మిత్రులు కానీ, సోదరులు కానీ సహాయం చేసి  ఆ  సమస్యను దూరం చేసే అవకాశం ఉంటుంది. జూలై తరువాత జనవరి వరకు శని గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో మార్పు విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ వృత్తిలో మార్పు విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  కాబట్టి సూర్య గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో ఈ విషయంలో ప్రయత్నం చేయటం మంచిది. తొందరపడి మాట ఇవ్వడం వలన తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 

37

కుటుంబం
 కుటుంబ విషయంగా  ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో అనుకూలమైన  పరిస్థితులు నెలకొంటాయి,  కుటుంబ వృద్ధి జరుగుతుంది.  అంతేకాక కుటుంబంలో  ఉన్న సమస్యలు తొలగిపోతాయి.  అయితే  గురు గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శని గోచారం సంవత్సరం మధ్యలో సామాన్యం గా ఉండటంవల్ల కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది.  మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు  రావటం దాని వలన కొంత మానసిక చింత ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా మీ సంతానం యొక్క ఆరోగ్య  విషయంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం.  సంవత్సర ఆరంభంలో తిరిగి సంవత్సరం మధ్యలో గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఇంటిలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  ఈ సమయంలో  చాలా కాలం నుంచి వివాహం కాకుండా ఎదురుచూస్తున్న వారికి వివాహ ప్రాప్తి ఉంటుంది.  అలాగే సంతాన విషయంలో ఆలస్యం అయిన వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గురు గోచారం బాగున్నప్పటికీ సంవత్సరమంతా రాహు గోచారం  8వ ఇంటిలో ఉండటం వలన  కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న, చిన్న మనస్పర్థలు ఏర్పడటం,  చెప్పుడు మాటలు కారణం ఇద్దరి మధ్య అవగాహనా రాహిత్యం ఏర్పడి గొడవలు రావడం జరగవచ్చు.  అయితే ఈ సమయంలో అనవసర ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి మాట్లాడటం కానీ,  నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తే చాలా మటుకు సమస్యలు  తొలగిపోతాయి.  అంతేకాకుండా మీ మిత్రులు మరియు బంధువులు సహాయం వలన మీ మధ్య ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి.  ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు కు వెళ్లే అవకాశం ఉంటుంది.  
 

47
Virgo

Virgo

ఆర్థిక స్థితి 
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది.  అయితే సంవత్సరం మధ్యకాలంలో లాభ స్థానం శని దృష్టి ఉండటం వలన ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ వచ్చిన లాభాలను సరిగా వినియోగించుకోలేక పోవడం జరగచ్చు.  ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఈ సమయంలో శని దృష్టి సప్తమ స్థానంపై మరియు లాభ స్థానంపై ఉండటం వలన లాభాల శాతం తగ్గే అవకాశం ఉండటం కానీ లేదా అనుకున్న సమయానికి పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో  వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది.  అలాగే సంవత్సరమంతా  రాహు గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన విలాసాలకు,  అవసరం లేకపోయినా గొప్పలకు పోయి డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.   గురు గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకొనట్లయితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు మరియు  ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.  మీ వృత్తి/వ్యాపారాల కారణంగా  ఈ సంవత్సరం మంచి ఆదాయం ఉంటుంది.  ఇల్లు,  వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.  రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో  ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశ ఈ సమయంలో  ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు అని మిమ్మల్ని ప్రలోభపెట్టే వారు కూడా ఉంటారు. వారి మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటికి లొంగకుండా సంపాదన విషయంలో మీ శ్రమను నమ్ము కోవడం మంచిది.

57
virgo

virgo

ఆరోగ్యం
 కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో లో అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురు గోచారం మధ్యమంగా ఉండటం వలన ఆరోగ్యం బాగుంటుంది.  అయితే రాహుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఉదర సంబంధ మరియు నరముల సంబంధ ఆరోగ్యసమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇవి మిమ్మల్ని అంతగా బాధించేవి కావు కాబట్టి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. శని  దృష్టి ఏడవ,  మూడవ, మరియు  పదకొండవ ఇళ్లపై ఉంటుంది కాబట్టి చేతులు,  కాళ్లు మరియు  జననేంద్రియాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంటుంది. సంవత్సర ఆరంభంలో గురువు మరియు శని  గోచారం అనుకూలంగా  మారుతుంది కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాహు గోచారం కారణంగా మానసిక ఆందోళనకు కూడా ఏర్పడే అవకాశముంటుంది. అంతే కాకుండా ఈ సంవత్సరం మీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన ఈ సమస్యలు మళ్లీ, మళ్లీ రాకుండా ఉంటాయి.  ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను కొంత మార్చుకోవాల్సి ఉంటుంది.  సమయానికి భోజనం చేయడం అలాగే చిరుతిండ్లు తగ్గించడం వలన గ్యాస్టిక్ సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స లభించి తొందరగా ఆరోగ్యవంతులవుతారు. 

67

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 కన్యా రాశి వారికి వ్యాపారపరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరమంతా  గురుగోచారం, మరియు సంవత్సర మధ్యకాలంలో శని గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారం మందకొడిగా సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే శని దృష్టి సప్తమ స్థానంపై మరియు లాభ స్థానం పై ఉండటం వలన వ్యాపార భాగస్వాములతో చిన్న, చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా భాగస్వామ్యం వదిలి వారు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. దానివలన ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురు గోచారం మరియు సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార పరంగా మరియు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది.  చేపట్టిన వ్యాపారాలు విజయవంతంగా నడవటమే కాకుండా మీ వ్యాపారం కారణంగా నలుగురికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది.   సంవత్సరమంతా గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన  వ్యాపారంలో లాభాలు జరుగుతాయి.  మీ వ్యాపారం వేర్వేరు ప్రదేశాల్లో కూడా ప్రారంభం చేస్తారు. అయితే సంవత్సరమంతా రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో  ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొత్తగా పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.  ముఖ్యంగా ఇతరుల ప్రలోభాలకు లోనయి పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించడం మంచిది.   అలాగే ఎక్కువ లాభాలను ఆశించి తప్పుడు వ్యాపారాలు చేయడం మంచిది కాదు దాని వలన అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. వ్యాపార పరంగా గతంలో చేయాలనుకుని ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయిన వ్యాపారం ఈ సంవత్సరం ప్రారంభం చేసుకోవచ్చు.  మీ మిత్రుల ద్వారా దీనికొరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.  స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది.   మీరు అనుకున్న విధంగా అవకాశాలు వచ్చి డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గతంలో దూరమైన అవకాశాలు తిరిగి వస్తాయి. 

77

పరిహారక్రియలు
కన్యా రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా రాహు, కేతువులకు పరిహారక్రియలు ఆచరించడం మంచిది. సంవత్సరమంతా రాహువు  ఎనిమిదవ ఇంటిలో,  కేతువు రెండవ ఇంటిలో సంచరించటం వల్ల కుటుంబ పరంగా,  ఆర్థికంగా,  విద్యాపరంగా మరియు ఆరోగ్య పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలకు పరిహారక్రియలు ఆచరించడం వలన ఇవి ఇచ్చే సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో సంచరించే రాహుగ్రహ దోష నివారణ కొరకు ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం కానీ,  దుర్గా స్తోత్ర పారాయణం కానీ చేయటం మంచిది.  ఇవి కాకుండా మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి 18000 సార్లు  రాహు మంత్ర జపం చేయటం కానీ,  రాహు గ్రహ శాంతి హోమం  జరిపించటం కాని మంచిది. రెండవ ఇంటిలో  కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు కేతు గ్రహ స్తోత్ర  పారాయణం కానీ,  గణపతి స్తోత్ర పారాయణం కానీ చేయటం మంచిది.  ఇవే కాకుండా ఏడు వేల సార్లు కేతు మంత్రం జపం కానీ లేదా కేతు గ్రహ శాంతి హోమం కానీ చేయవచ్చు. . మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఉగాది
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved