Today Horoscope: కన్య రాశి వారు ఈ రోజు దీనికోసం అప్పులు చేయాల్సి వస్తుంది
virgo horoscope: కన్య రాశివారి శుక్రవారం రాశిఫలాలు ఇవి. మరి , ఈ రోజు కన్య రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగ-వ్యాపారాల్లో, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందో చూద్దాం..

కన్య రాశి ఫలాలు
నేడు కన్య రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా…
ఆర్థిక పరిస్థితి
కన్యారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బాగుండదు. వీరు ఎప్పుడో చేసిన అప్పులను తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత పెంచుతుంది. అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఫైనాన్షియల్ ప్లాన్ ను ఏర్పాటు చేసుకుంటే పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఉద్యోగం, వ్యాపారం
వృత్తి పరంగా ఒత్తిడి కలుగుతుంది. పనిభారం ఎక్కువ అవుతుంది. దీంతో మీరు చేయాల్సిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అలాగే పనిభారం వల్ల శారీరకంగా బాగా అలసిపోతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఇతరులతో విభేదాలు వస్తాయి. సమస్యను పరిష్కరించుకుంటే అంతా సర్దుమనుగుతుంది.
ఆరోగ్యం
కన్యారాశి వారి ఆరోగ్యం ఈ రోజు కొంత దెబ్బతింటుంది. ఒత్తిడి, అలసట, శారీరక అసౌకర్యం ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడతారు. ధ్యానం, యోగా, వ్యాయామంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.