- Home
- Astrology
- Venus Transit: చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి విలాసవంతమైన జీవితం
Venus Transit: చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు ఎంట్రీ.. ఈ 4 రాశుల వారికి విలాసవంతమైన జీవితం
Venus Transit: శుక్రుడి సంచారం ఎన్నో రాశుల వారికి మేలు జరుగుతుంది. శుక్రుడు అక్టోబర్ 28న చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని వల్ల నాలుగు రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. సకల భోగాలు దక్కుతాయి.

శుక్రుడి నక్షత్ర మార్పు
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఎంతో శుభకరమైన గ్రహం. జీవితంలో ప్రేమ, అందం, సంపద, విలాసం దక్కాలంటే శుక్రుడే కారకుడు. శుక్రుడు అక్టోబర్ 28న చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.
మేష రాశి
శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశి వారి వైవాహిక, ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. మేష రాశి వారి వైవాహిక జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఇతరులతో కలిసి వ్యాపారాలు విపరీతంగా లాభాలు తెచ్చిపెడతాయి.
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి అడుగపెట్టడం వల్ల వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేస్తున్న ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. పాత అప్పులు తీరిపోయి మానసిక ప్రశాంతత దక్కుతుంది.
తులా రాశి
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు సంచారం తులారాశి వారికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. దీని వల్ల మీ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కళా రంగంలో ఉన్న వారికి శుక్రుడి వల్ల విజయం, కీర్తి వంటివి దక్కుతాయి.
వృశ్చిక రాశి
శుక్రుడి సంచారం వృశ్చిక రాశి వారికి 12వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల వారి జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది. వీరు పెట్టే పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలను తెచ్చిపెడతాయి. వీరికి ఆకస్మికంగా ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త వస్తువులు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.