MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు బెడ్ దగ్గర ఇవి అస్సలు పెట్టుకోకూడదట!

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు బెడ్ దగ్గర ఇవి అస్సలు పెట్టుకోకూడదట!

సాధారణంగా చాలామంది నిద్రపోయేటప్పుడు బెడ్ పక్కన ఫోన్, వాటర్ బాటిల్, మెడిసిన్ లాంటివి పెట్టుకొని పడుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి వస్తువులు పెట్టుకోవడం ఎంతమాత్రం మంచిది కాదట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Feb 19 2025, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ శాస్త్రం ప్రకారం చేసే అన్ని పనులు విజయవంతమవుతాయని నమ్ముతారు. మనిషి జీవనం గురించి వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు పొందుపరిచారు. వాటిలో నిద్ర కూడా ఒకటి. నిద్రకు సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. నిద్రపోయేటప్పుడు చేసే కొన్ని తప్పులు, మన జీవితంలో ఎదుగుదలను దెబ్బతీస్తాయట. 

కాబట్టి నిద్రపోయేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. దాని వల్ల మంచి జరుగుతుంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నూనె:

నూనె:

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు ఎలాంటి నూనెనైనా మీ బెడ్‌రూమ్‌లో పెట్టుకోకూడదు. ఒకవేళ అలా నూనె ఉంచుకుంటే, దాని వల్ల మీ జీవితంలో ఎలాంటి పురోగతి ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

36
మందులు:

మందులు:

చాలామంది బెడ్ దగ్గర రకరకాల మందులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి మందులనైనా సరే మీ బెడ్ దగ్గర ఎప్పుడూ పెట్టుకొని పడుకోకూడదట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

46
పర్సు:

పర్సు:

చాలామంది డబ్బులు, పర్సు ఎప్పుడు పడుకునే దగ్గరే పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పడుకునే దగ్గర పర్సును ఎప్పుడూ ఉంచుకోకూడదట. ఇలా చేస్తే మీ ఇంట్లో పేదరికం వస్తుంది.

56
వాటర్ బాటిల్:

వాటర్ బాటిల్:

మనలో చాలా మందికి రాత్రి నీరు తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల బెడ్ దగ్గర ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకుంటాం. కానీ ఇలా చేయడం వాస్తు శాస్త్రంలో నిషేధించబడింది. పడక దగ్గర నీరు పెట్టుకుని పడుకుంటే ఆ వ్యక్తిపై జీవితాంతం ప్రతికూల శక్తులు ఉంటాయట.

66
చెప్పులు:

చెప్పులు:

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ బెడ్ దగ్గర చెప్పులు లేదా బూట్లు ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఎప్పుడూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు బంధుమిత్రుల నుంచి విలువైన బహుమతులు పొందుతారు!
Recommended image2
Astrology Predictions: జూన్ 24 నుంచి ఈ 3 రాశుల వారికి జాక్‌పాట్.. కెరీర్‌లో దూసుకెళ్తారంతే!
Recommended image3
Saturn Transit: ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలాన్ని తీసుకురాబోతున్న శని దేవుడు.. పెరగనున్న సంపాదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved