మనీ ప్లాంట్ ఒక్కటే కాదు ఈ మొక్కలు కూడా మీకు అదృష్టాన్ని తెస్తాయి
మనీ ప్లాంట్ ను వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్క పేరుకు దగ్గట్టుగానే మీ సంపదను పెంచుతుంది. అయితే ఈ మొక్కలే కాదు మరికొన్ని మొక్కలు కూడా మీ సిరి సంపదను పెంచడానికి దోహదం చేస్తాయి. అవేంటంటే?
వాస్తు శాస్త్రంలో.. కొన్ని రకాల మొక్కలను, చెట్లును ఇంటిదగ్గర నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి కుటుంబ ఆనందాన్ని, ప్రశాంతతను కాపాడుతాయని చెప్తారు. అయితే ఇంట్లో మొక్కలు, చెట్లు నాటేటప్పుడుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. దీంతో మీకు అంతా మంచే జరుగుతుంది. వాస్తు ప్రకారం.. అదృష్ట మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో సానుకూలతను పెంచడానికి తులసిని ఎంతో పవిత్రమైన, శుభప్రదమైన మొక్కగా భావిస్తారు. తులసి మొక్కకు ధార్మిక ప్రాముఖ్యతతో పాటుగా వాస్తులో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను మీ ఇంటి ఆవరణ, బాల్కనీ లేదా కిటికీల పెట్టొచ్చు.
వెదురు
వాస్తు శాస్త్రం ప్రకారం.. వెదురు మొక్క కూడా అదృష్టంతో ముడిపడి ఉంది. వెదురు మొక్కలో 5, 6 లేదా 7 కాండాలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క అదృష్టాన్ని కూడా పెంచుతుందని నమ్ముతారు. వెదురు మొక్కను ఇంటి తూర్పు మూలలో పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
shami plant
జమ్మి చెట్టు
శివుడి ఆరాధనలో జమ్మి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో జమ్మి చెట్టు ఉండటం వల్ల శివుని అనుగ్రహం మీపై ఉంటుందని నమ్మకం. అలాగే ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల అదృష్టం పెరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. అలాగే ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
అపరాజిత మొక్క
అపరాజిత మొక్కకు కూడా హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మొక్కను మీ ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటండి. ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీనివల్ల మీ ఇంట్లో ధనం, ధాన్యాలకు కొదవే ఉండదని కూడా నమ్మకం. అలాగే ఈ మొక్క కుటుంబానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.