శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాధి రాశిఫలాలు..ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకోండి..!
శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు అన్ని రాశులకు సంబందించిన వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఆదాయం:-8
వ్యయం:-14
రాజపూజ్యం:-4
అవమానం:-3
గురుడు 1-5-24 వరకు జన్మరాశిలో రజిత మూర్తిగా సంచరించి తదుపరి సంవత్సరాంతం ధన స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.(గురు సంచారం అనుకూలం.)
శని ఈ సంవత్సరమంతా లాభ స్థానంలో లోహ మూర్తిగా శని సంచారం. (అనుకూలం)
రాహువు ఈ సంవత్సరమంతా వయ్య స్థానంలో రజత మూర్తి గా సంచారం.
కేతువు ఈ సంవత్సరమంతా షష్టమ స్థానంలో రజత మూర్తి గా సంచారం.
ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.సంతాన విషయంలో అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు.పితృ సంబంధించిన ఆస్తి విషయాలు అనుకూలిస్తాయి.సమాజంలో మరియు కుటుంబం లో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఎంతటి కఠినమైన వ్యవహారం మైన సులభంగా పరిష్కారమవుతాయి.కుటుంబంలో శుభకార్యములు జరుగును. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.చిన్నపాటి పరిశ్రమలు నిర్వహించే వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు.ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.గత కొంతకాలంగా ఇబ్బందిగా ఉన్న సమస్యలు పరిష్కార మగును.ఈ సంవత్సరం శారీరకంగా మానసికంగా నూతన ఉత్సాహంతో ఉంటారు. అలాగే ఈ సంవత్సరం జీవితానందం అన్ని విషయాల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది.వలన వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి లేదా పెద్దల యొక్క సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలి.అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఎదురవగలవు. అయినప్పటికీ తగు సమయానికి సమకూరుతుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుండి నడిపిస్తారు.సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.గత సంవత్సరం కంటే హోదా కలిగి ఆనందంగా గడుపుతారు.ప్రతి విషయంలో ధైర్యంగా ముందు ఉండి నాయకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని కేతు సంచారం అనుకూలం.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఆదాయం:-2
వ్యయం:-8
రాజపూజ్యం:-7
అవమానం:-3
గురుడు 1-5-24 వరకు వ్యయ స్థానంలో సువర్ణ మూర్తిగా సంచరించి.తదుపరి సంవత్సరాంతం జన్మరాశిలో రజత మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత బంధువర్గంతో విరోధాలు కుటుంబము లో చికాకులు కలుగును.
శని ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత సమాజంలో అపవాదము. గౌరవ మర్యాదలు తగ్గును.
రాహువు ఈ సంవత్సరమంతా లాభ స్థానంలో సువర్ణ మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత మీ ఆశయాలు సిద్ధిస్తాయి.
కేతువు ఈ సంవత్సరమంతా పంచమ స్థానంలో స్వర్ణ మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారాల్లో అనేక లాభాలు పొందగలరు. ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు. గత కొద్ది కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడతారు.మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేరుతాయి.ఈ సంవత్సరం జీవితంలో ఎదగవలసిన సంవత్సరంగా చెప్పవచ్చు.అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.అన్ని విధాల అభివృద్ధి చెందుతారు.స్థలాలు గాని ఇల్లు గాని కొనాలని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారంతో కలిగిన స్థాన మార్పులు రాగలవు.అనారోగ్య సమస్యలు.ఉమ్మడి స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరక పటుత్వం తగ్గుతుంది.వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది.గృహంలో శుభకార్యాలు జరుగును.ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది.కొన్ని విషయాల్లో అపవాదము అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.విదేశీ ప్రయాణం ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఆదాయం:-5
వ్యయం:-5
రాజపూజ్యం:-3
అవమానం:-6
గురుడు 1-5-24 వరకు లాభ స్థానంలో లోహ మూర్తి గా సంచరించి.తదుపరి సంవత్సరమంతా వ్యయ స్థానంలో లోహ మూర్తిగా సంచారం.
శని ఈ సంవత్సరమంతా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం.
రాహువు ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం
కేతువు ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం.
ఈ సంచారం వలన ఇబ్బందులు ఎదురవుతాయి.శుభ కార్యక్రమాలు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో స్థానచలనం.జీవిత భాగస్వామితో అకారణంగా కలహాలు.ఈ సంవత్సరం రాహు సంచారం బాగుంది.భార్య పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యవహారాలలో చిక్కులు ఏర్పడకుండా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.మానసికంగా ఇబ్బంది పడతారు.ఏది ఏమైనా గత సంవత్సరం కంటే విశేషమైన యోగాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు.మీ జీవిత ఆశయాలు నెరవేరుతాయి.బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.అప్రయత్నముగా ధన లాభం పొందగలరు.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఆదాయం:-14
వ్యయం:-2
రాజపూజ్యం:-6
అవమానం:-6
గురుడు 1-5-24 వరకు రాజ్య స్థానంలో సువర్ణ మూర్తిగా సంచరించి సంవత్సరాంతం లాభ స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం.
శని ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో రజత సంచారం.
రాహువు ఈ సంవత్సరం అంతా భాగ్యస్థానంలో సువర్ణ మూర్తి గా సంచారం.
కేతువు ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో సువర్ణ మూర్తి గా సంచారము.
(ఈ రాశి వారికి అష్టమ శని )
ఈ సంచారం వలన ఈ సంవత్సరం తలచిన అన్ని పనులలో విజయం సాధిస్తారు.అనుకూలమైన ఫలితాలు పొందగలరు.సుఖ సౌఖ్యములు పొందగలరు.కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. ఉద్యోగాలు లో అధికారంతో కూడిన ప్రమోషన్లు పొందుతారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. స్థలం కొనడం లేక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగును.భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అవును.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.సమస్యల వలన ఎడబాటు గా ఉన్న దంపతులు ఈ సంవత్సరం కలుసుకుంటారు.అన్ని విధాల అభివృద్ధి పొందుతారు.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా తీర్పు వస్తాయి.విదేశీ వ్యవహారాలు అనుకూలం.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఆదాయం:-2
వ్యయం:-14
రాజపూజ్యం:-2
అవమానం:-2
గురుడు 1-5-25 వరకు భాగ్య స్థానంలో తామ్ర మూర్తి గా సంచరించి.తదుపరి రాజ్య స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.
శని ఈ సంవత్సరం అంతా కళత్ర స్థానంలో లోహ మూర్తి గా సంచారం.
రాహువు ఈ సంవత్సరం అంతా తామ్ర మూర్తి గా అష్టమ స్థానంలో సంచారం.
కేతువు ఈ సంవత్సరం అంతా తామ్ర మూర్తి గా ధన స్థానంలో సంచారం.
మే నెల నుంచి గురుడు దశమ స్థానం అనగా రాజ్య స్థానంలో సంచారం. ఈ సంచారం వలన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు.ఉద్యోగాలు లో చేర్పులు మార్పులు జరుగును.వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి.సంతానం తో ఇబ్బందులు.ఆరోగ్య సమస్యలు రాగలవు.శారీరకంగా మానసిక ఇబ్బందులుంటాయి .అనేక ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.శరీరంలో ఆరోగ్య బాధలు ఇబ్బందులకు గురి కావడం.నిరుత్సాహంగా ఉంటుంది.ఆలోచన విధానాలు మందగిస్తాయి.పరిశ్రమల నిర్వహణ శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి.మనస్సునందు భయం గా ఉంటుంది .ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.సమాజంలో గౌరవం తగ్గుతుంది.అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది.మానసికంగా శారీరకంగా బలహీన పడతారు. విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.పుత్ర సంతానం వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది.విద్యార్థులకు కోరుకున్న విద్యలు లభిస్తాయి.నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు.శని కళత్ర స్థానంలో సంచారం ఈ సంచారం.మానసిక భయాందోళన .భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు రావచ్చు.వివాహ ప్రయత్నాలు లో నిరాశ చెందుతారు. వ్యాపారంలో ధన నష్టం. వ్యాపార అభివృద్ధి విషయాలు మందంగా ఉంటాయి.అకారణంగా ఇతరులతో కలహాలు రాగలవు.చోర భయం.దుష్ట కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.రాహువు సంచారం వలన ప్రభుత్వ అధికారులు తో విరోధాలు.తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఆదాయం:-5
వ్యయం:-5
రాజపూజ్యం:-5
అవమానం:-2
గురుడు 1-5-24 వరకు అష్టమ స్థానంలో రజత మూర్తి గా సంచరించి.తదుపరి భాగ్య స్థానంలో రజత మూర్తి గా సంచారం.
శని ఈ సంవత్సరాంతం తామ్ర మూర్తి గా శత్రు స్థానంలో సంచారం.
రాహువు ఈ సంవత్సరమంతా కళత్ర స్థానంలో రజత మూర్తి గా సంచారం.
కేతువు ఈ సంవత్సరమంతా రజత మూర్తి గా జన్మ రాశిలో సంచారం.
మే నెల నుంచి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. భాగ్య స్థానంలో గురు సంచారం. ఈ సంచారం వలన ఎంతటి కష్టతరమైన పని అయినా ప్రణాళికాబద్ధంగా విజయం సాధిస్తారు.స్థలాలు లేదా గృహం కొనడం లేక నిర్మాణం చేయడం గాని చేస్తారు.వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.కోర్టు విషయాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా తీర్పు రాగలవు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్య ప్రయత్న ప్రయత్నాలు ఫలించును. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ సంవత్సరం అనుకూలం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
శని సంచారం వలన అన్ని విధాల అభివృద్ధి కలుగును.ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.సర్వ కార్యములందు లాభాలు పొందగలరు.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ధనాభివృద్ధి పొందుతారు. ప్రారంభించి మధ్యలో ఆగిన పనులు పూర్తి అగును.ఆరోగ్య విషయాలు బాగుంటాయి.పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.ఉద్యోగాలలో అధికారంతో కూడిన బదిలీ.
రాహు సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు.వృధా అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కేతు సంచారం సామాన్యంగా నుండును.ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని సంచారం అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని విధాల యోగిస్తుంది. అన్ని వర్గాల వారు ముందుకు దూసుకుపోతారు.
telugu astrology
తుల రాశి అధిపతి గురుడు 3-6 శని 4-5
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఆదాయం:-2
వ్యయం:-8
రాజపూజ్యం:-1
అవమానం:-5
ఈ రాశి వారికి గురుడు 1-5-24 వరకు కళత్ర స్థానంలో లోహ మూర్తి గా సంచరించి. తదుపరి సంవత్సరాంతం అష్టమ స్థానంలో లోహ మూర్తి గా సంచారం.
శని ఈ సంవత్సరమంతా రజత మూర్తి గా పంచమ స్థానంలో సంచారం.
రాహువు ఈ సంవత్సరమంతా శత్రు స్థానంలో లోహ మూర్తి గా సంచారం.
కేతువు ఈ సంవత్సరమంతా లోహ మూర్తి గా వ్యయ స్థానంలో సంచారం.
మే నుంచి అష్టమ స్థానం వలన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.వ్యవహారాల్లో ముందుచూపు అవసరం.ప్రతి పని పట్టుదలతో ప్రయత్నించాలి. రుణభారం పెరగనీయకుండా ఖర్చులు యందు నియంత్రణ అవసరం.వ్యాపారస్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.దొంగతనాలు జరిగే అవకాశం. ఉద్యోగాలలో అధికారులు తో కత్తి మీద సాము వలె ఉంటుంది.ఊహించని విపత్తులు సంఘటనలు ఎదురవుతాయి.సన్నిహితులతో మీ ప్రవర్తన వలన వివాదాలు రాగలవు.జీవన విధానం సాఫీగా జరగడం కోసం తగిన జాగ్రత్తలు నియమాలు పాటించడం అవసరం.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్త వహించాలి.విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు ఫలిస్తాయి.అకారణంగా అన్నదమ్ముల తో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు మనస్పర్థలు రాగలవు. శారీరక ఇబ్బందులు పెరుగుతాయి.
శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం. మానసికంగా ఆందోళన గా ఉండటం.సంతాన మూలకంగా ఇబ్బందులు. కుటుంబానికి దూరంగా జీవనం చేయవలసి వస్తుంది.
రాహువు సంచారం అనుకూలం. శత్రువుల పై చేయి సాధిస్తారు.సాహసోపేతమైన కార్యం తలపెట్టి తారు.అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పరిశ్రమల్లో లేక వ్యవస్థలో కార్య నిర్వహణ సక్రమంగా నిర్వహించగలరు.విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించుటలో పోటీపడతారు.కళాకారులు విశేషమైన గౌరవ పురస్కారాలు లభిస్తాయి.గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కేతు సంచారం వలన పనులు లో శ్రమ అధికంగా ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విదేశీ ప్రయాణాలు లో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చవుతుంది.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఆదాయం:-8
వ్యయం:-14
రాజపూజ్యం:-4
అవమానం:-5
ఈ సంవత్సరం గురుడు 1-5-24 వరకు షష్ఠమ స్థానంలో తామ్ర మూర్తి గా సంచరించి తదుపరి సంవత్సరాంతం తామ్ర మూర్తి గా కళత్ర స్థానంలో సంచారం.
శని ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.
రాహు ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.
కేతు ఈ సంవత్సరం అంతా లాభ స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.
(ఈ రాశి వారికి అర్థాష్టమ శని)
మే నుంచి గురు బలం అనుకూలంగా ఉండటం చేత వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తిని పొందుతారు. అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ ఆర్థిక విషయాలు సంతోషాన్ని కలిగేటట్లుగా ఉంటాయి.అన్నదమ్ములు బందో వర్గంతో ధనసహాయం పొందగలరు.
భూమి లేదా గృహమును కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
శని సంచారం అనుకూలం కాదు. శారీరక బాధలు పెరుగుతాయి.మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులు కలుగుతాయి.పై అధికారులతో సంయమనము పాటించడం మంచిది.పనులలో ఆటంకాలు ఏర్పడిన ఆలస్యంగా పూర్తి కాగలవు.
రాహు సంచారం అనుకూలం కాదు.
కేతు సంచారం అనుకూలం.అభివృద్ధి కరమైన ఆలోచనలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం మరియు సంపదలు పొందే అవకాశం.స్థిరాస్తి కొనుగోలు అమ్మకం వలన లాభాలు పొందగలరు.అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొన్ని సందర్భాల్లో ధైర్యం కోల్పోయే సంఘటనలు జరగవచ్చు.కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.యొక్క పేరు ప్రతిష్టలు నలువైపులా వ్యాపిస్తాయి.అనవసరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.అందరి అండదండలు పుష్కలంగా ఉంటాయి.భ్రమించి వ్యవహారాల్లో హడావిడి చేస్తారు.ఊహించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెరగడం ఇబ్బందికరంగా మారుతుంది. విద్యార్థుల విద్యా సంబంధమైన విషయాలు లో పురోగతి సాధిస్తారు.వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
telugu astrology
ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1) నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) ఆదాయం:-11 వ్యయం:-5 రాజపూజ్యం:-7 అవమానం:-5
ఈ రాశి వారికి గురుడు మే1-5-24 వరకు పంచమ స్థానంలో సువర్ణమూర్తి గా సంచరించి తదుపరి సంవత్సరాంతం షష్ట స్థానంలో రజత మూర్తి గా సంచారం
శని ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో లోహ మూర్తి గా సంచారం.(శని సంచారం అనుకూలం)
రాహు ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం
కేతువు ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.(అనుకూలం)
మే నుంచి షష్టమ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం కాదు.వ్యవహారాల్లో ఆతురత పెరుగుతుంది.పనులు శ్రమ అధికంగా ఫలితం తక్కువగా ఉంటుంది.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబంలో ఉద్యోగాలు చికాకులు.అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.వ్యవహారాల్లో బుద్ధి చాతుర్యం పెరుగుతుంది.దాంపత్య జీవితం బాగుంటుంది.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు.దగ్గర బంధువులు నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.అకారణంగా స్త్రీల తో కలహాలు రాగలవు.స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు మరియు వాహన గృహ భూ కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.ఉద్యోగాలలో అభివృద్ధి.సంఘంలో మంచి స్థానం.మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది.ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్లు వలె ఖర్చు అవుతుంది.ఈ సంవత్సరం కళాకారులు కు సామాన్యంగా ఉంటుంది.ఎన్ని అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రమే లభిస్తుంది.వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ధన లాభం పొందగలరు.విద్యార్థులకు బాగుంది. జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు మెరుగుపడతాయి.గట్టి ప్రయత్నముచే నూతన గృహ భూ కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.
telugu astrology
మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఆదాయం:-14
వ్యయం:-14
రాజపూజ్యం:-3
అవమానం:-1
article_image2
Capricorn
ఈ రాశి వారికి గురుడు 1-5-24 వరకు చతుర్ధ స్థానంలో రజత మూర్తి గా సంచరించి తదుపరి సంవత్సరాంతం పంచమంలో సువర్ణమూర్తి గా సంచారం.
శని ఈ సంవత్సరమంతా ధన స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.(శని సంచారం అనుకూలం కాదు)
రాహు ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో రజత మూర్తి గాసంచారం (శుభ ఫలితాలు పొందగలరు)
కేతువు ఈ సంవత్సరం అంతా భాగ్య స్థానంలో రజత మూర్తి గా సంచారం.
(ఈ రాశి వారికి ఏలినాటి శని )
గురు సంచారం అనుకూలం. సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి.వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందగలరు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.కుటుంబంలో వివాహ శుభ కార్యాలు జరుగును.విదేశీ ప్రయత్నాలు ఫలించును.కుటుంబ విషయాలు సానుకూలంగా ఉండి ప్రశాంతత లభిస్తుంది.నూతనమైన అభివృద్ధి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు.ఎంతటి కష్టమైనా పని అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు.పలు మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. దుష్కార్య లకు దురాలోచనలు కు దూరంగా ఉండాలి. ప్రయాణాలు లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.కోర్టు విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి.శారీరకంగా మానసికంగా బలపడతారు.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.మీ మాటకు విలువ పెరుగుతుంది.భూ గృహ కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం.స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరపు బంధు వర్గము తో అపకారం జరిగే అవకాశం.విద్యార్థులు విద్య యందు శ్రద్ధ చూపించాలి.ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఉత్సాహంగా ఉంటుంది.ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి.వృత్తి ఉద్యోగాలు శ్రమ అధికంగా ఉన్న దానికి తగ్గట్టుగా ప్రతిఫలం లభిస్తుంది.భూ గృహ వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఆదాయం:-14
వ్యయం:-14
రాజపూజ్యం:-6
అవమానం:-1
article_image2
గురుడు చతుర్ధ 1-5-2024 వరకు తృతీయ స్థానంలో సంచారం స్థానంలో సంచరించి.తదుపరి సంవత్సరాంతం చతుర్ధ స్థానంలో లోహ మూర్తి గాశసంచారం
శని ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్ర మూర్తి గా సంచారం
రాహువు ఈ సంవత్సరం అంతా ధన స్థానంలో లోహ మూర్తి గా సంచారం
కేతువు ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో లోహ మూర్తి గాసంచారం.
(ఈ రాశి వారికి ఏలనాటి శని )
సువర్ణమూర్తి గా రజత మూర్తి గా లోహ మూర్తి గా తామ్ర మూర్తి గా
1-5-24 వరకు. సంవత్సరాంతం
మే నుండి చతుర్ధ స్థానంలో సంచారం అనుకూలమైనది కాదు.వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది.దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.గురు బలం అంతంతమాత్రం ఉండటం వల్ల ఒక ప్రణాళిక బద్ధంగా జీవన విధానం అలవాటు చేసుకోవాలి.సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించాలి.ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.విద్యార్థులు పట్టుదలతో చదవాలి.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులకు గురి అవుతారు.ఉద్యోగస్తులకు స్థానచలనం మరియు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆదాయం మరియు ఖర్చు సమానంగా ఉంటాయి.బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి.
శని జన్మ రాశిలో సంచారం వలన సామాన్యంగా ఉంటుంది.ఇష్టం లేని కష్టతరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది.ప్రయాణాల్లో అవరోధాలు ఇబ్బందులు ఎదురవుతాయి.మానసిక ఆందోళన పెరుగుతుంది.అనారోగ్య సమస్యలు రాగలవు. వ్యాపారాలలో ఒక్కసారిగా ధన లాభం మరోసారి ధన నష్టం జరుగుతూ ఉంటుంది.
రాహు కేతు గ్రహాల సంచారం అనుకూలమైనది కాదు.ఈ సంచారం వలన ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.సమాజంలో అపకీర్తి.మానసికంగా శారీరకంగా నిరుత్సాహంగా ఉండటం.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు.ప్రభుత్వ అధికారులు వలన ఇబ్బందులు కలుగుతాయి.మీరు ఆశించిన ఫలితాలు పొందాలంటే ఓర్పు సహనం గా ఉన్నట్లయితే ఆశించిన ప్రయోజనం పొందగలరు.చేయవలసిన పనులు పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చి దృఢంగా చేసినట్లయితే విజయం లభిస్తుంది.అనవసరమైన వ్యక్తులు తో సంభాషణ చర్చలు సమావేశాలకు దూరంగా ఉండాలి.ఉన్నతాధికారులతో ఓర్పు సహనం గా ఉండాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఆదాయం:-11
వ్యయం:-5
రాజపూజ్యం:-2
అవమానం:-4
article_image2
గురుడు 1-5-24 వరకు ధన స్థానంలో తామ్ర మూర్తి గా సంచరించి .తదుపరి సంవత్సరాంతం తృతీయ స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.
శని ఈ సంవత్సరమంతా వ్యయ స్థానంలో రజత మూర్తి గా సంచారం.
రాహువు ఈ సంవత్సరమంతా జన్మ రాశి లో తామ్ర మూర్తి గా సంచారం.
కేతువు ఈ సంవత్సరమంతా కళత్ర స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.
(ఈ రాశి వారికి ఏలినాటి శని)
మే నుంచి గురుడు తృతీయ రాశిలో సంచారం అనుకూలం కాదు.ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొన్ని రకాలు అడ్డంగులు వలన వ్యాపార వ్యవహారాలలో అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు రాగలవు.పనుల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. పనులు లో వ్యవహారాలలో అవాంతరాల ఏర్పడతాయి. మధ్యవర్తిత్వానికి మరియు హామీలు విషయంలో జాగ్రత్త అవసరం.ఆశించిన ఫలితాలు పొందడం కష్టతరం గా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు తగిన మార్గాలు అన్వేషణ చేయడం మంచిది.వైవాహిక జీవితంలో కూడా అన్యోన్యత తగ్గి గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణ చేసుకోవడం మంచిది.విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం. బంధువర్గము తో వ్యతిరేకతలు గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలత తక్కువ.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి సరైన ఆలోచన సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పు సహనంతో పనులు పూర్తి కాగలవు.ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
శని సంచారం వల్ల కుటుంబంలో గొడవలు చికాకులు గా ఉంటుంది.వాదనలకు వివాదాలకు దూరంగా వాదనలకు వివాదాలకు దూరంగా ఉండాలి.
రాహు కేతు సంచారం అనుకూలమైనది కాదు. ఈ సంచారం వలన ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.శారీరక పటుత్వం తగ్గుతుంది.అన్ని విషయాలు లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నించడం మంచిది.కొన్ని విషయాలు లో మోసపోవడం నష్టపోవడం జరుగును. అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభించును. ఖర్చులు నీళ్లవలె ఖర్చు అవును.ధనం నిలబడటం కష్టంగా ఉంటుంది.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు.
శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు అన్ని రాశులకు సంబందించిన వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు.