సింహ రాశి గురించి భయంకరమైన నిజాలు.. !
ప్రేమలో ఉన్నంత కాలం చాలా ఆనందంగా ఉంటారు.. ప్రేమించిన వారిని కూడా.. అంతే ప్రేమగా చూసుకుంటారు. జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు.

ప్రేమ కి చాలా మహత్వం ఉంది. బాధలో ఉన్నవారిని ఓదార్పు ఇవ్వగలదు.. ప్రశాంతతను అందిస్తుంది. మరికొందరికీ.. నిరాశ, చిరాకు కూడా కలిగిస్తుంది. అయితే.. ఆ ప్రేమ.. తీపినిస్తుందా..? బాధనిస్తుందా అనే విషయం.. మీ మీద.. మీ భాగస్వామి మీద ఆధారపడి ఉంటుంది.
మనం ముందుగానే.. మన జీవిత భాగస్వామి ఎప్పుడు.. ఎలా ప్రవర్తిస్తారనే విషయం తెలుసుకుంటే.. జీవితంలో ఆనందంగా ఉండవచ్చని చెబుతున్నారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రేమ విషయంలో సింహ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం..
సింహ రాశివారు చాలా బోల్డ్ గా ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు వారిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారితో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. తాము ప్రేమించేవారి మనసులో ఏముందో ముందే అర్థం చేసుకుంటారు.
ప్రేమలో ఉన్నంత కాలం చాలా ఆనందంగా ఉంటారు.. ప్రేమించిన వారిని కూడా.. అంతే ప్రేమగా చూసుకుంటారు. జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు.
ఒక్కసారి ప్రేమించిన వారితో విడిపోతే.. వీరిని కోల్పోయినందుకే వారే ఎక్కువ బాధపడతారట.
ఒక్కసారి ప్రేమించిన వారితో విడిపోతే.. వీరిని కోల్పోయినందుకే వారే ఎక్కువ బాధపడతారట. అయితే.. సింహ రాశి వారు కూడా.. ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ అయితే.. దాని నుంచి అంత త్వరగా బయటపడలేరట.
సింహ రాశివారు లాంటి స్నేహితుడు ఉంటే వారి జీవితాంతం ఆనందంగా ఉంటుంది.
వీరు స్నేహానికి విలువ ఎక్కువ ఇస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఎలాంటి తప్పులు చేయరు. వీరికి విధేయత కూడా చాలా ఎక్కువ.
సింహ రాశి వారు చిన్నతనంలో ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు. వీరికి కౌగిలింతలు అంటే ఎక్కువ ఇష్టం. తల్లిదండ్రులు తమను కౌగిలించుకోవాలని.. ముద్దు పెట్టుకోవాలని.. వారిని హత్తుకొని పడుకోవాలని అనుకుంటారు. ఎక్కువగా ప్రశంసలు కోరుకుంటారు.
అదే సింహరాశివారు తల్లిదండ్రులుగా మారిన తర్వాత.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ప్రేమను పంచుతారు కానీ.. రూల్స్ ఎక్కువ పెడుతుంటారు.