Rahu Ketu Transit: రాహు కేతు సంచారంతో రెండు నెలల్లో ఈ 3 రాశులకు స్వర్ణయుగం మొదలు
Rahu Ketu Transit: రాహు, కేతువులను దుష్ట గ్రహాలుగా చెప్పుకుంటారు. కానీ వీటి సంచారం ఒక్కోసారి కొన్ని రాశులకు కలిసివస్తుంది. వచ్చే ఏడాది రాహు కేతు సంచారం వల్ల మూడు రాశుల వారికి మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి.

2026లో రాహు కేతు సంచారం
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు, కేతువులు దుష్ట గ్రహాలుగా చెప్పుకుంటారు. వీటిని ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. 2026 డిసెంబర్ 5న రాహువు మకరంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక కేతువు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల మూడు రాశుల వారికి స్వర్ణయుగం మొదలవుతుంది.
తులారాశి
తులా రాశి వారికి రాహువు నాలుగో ఇంట్లో, కేతువు పదో ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ రాశి వారికి కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది. వీరు చేస్తున్న ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కుతాయి. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. వీరు చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి.
ధనూ రాశి
ధనుస్సు రాశి వారికి రెండో ఇంట్లో రాహులు, ఎనిమిదో ఇంట్లో కేతువు ప్రవేశించబోతున్నారు. రెండో ఇల్లు అనేది సంపదను సూచిస్తుంది. ఇక ఎనిమిదో ఇల్లు ఆయుష్షు, మరణం, దీర్ఘకాలిక వ్యాధులను సూచిస్తుంది. వీరికి ఊహించని రీతిలో ఆర్ధిక లాభాలు కలుగుతాయి. రాహువు వల్ల ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి తొమ్మిదో ఇంట్లో రాహువు, మూడో ఇంట్లో కేతువు ప్రవేశించబోతున్నారు. తొమ్మిదో ఇంట్లో రాహువు వల్ల తండ్రి వైపు నుంచి మీకు సాయం అందుతుంది. అలాగే కొత్త ఇల్లు కట్టే అవకాశం ఉంది. పాత ఇంటికి మరమ్మతులు చేసే ఛాన్స్ ఉంది. కొత్త వాహనం లేదా స్థలం కొనే అవకాశం ఉంది.