MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేస్తారు..!

ఈ రాశివారు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేస్తారు..!

ప్రతి ఒక్కరిలోనూ అందరినీ ఆకర్షించే ఏదో ఓ లక్షణం కచ్చితంగా ఉంటుందట. అయితే..  ఏ రాశివారి లో ఎలాంటి ఆకర్షించే లక్షణం ఉంటుందో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట అదేంటో ఓసారి చూసేద్దాం..

3 Min read
Author : ramya Sridhar
Published : Sep 18 2021, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఒక్కో మనిషి ఒక్కోలా ఆలోచిస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటే.. అదే మనిషిలో  కొన్ని చెడు లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే.. ప్రతి ఒక్కరిలోనూ అందరినీ ఆకర్షించే ఏదో ఓ లక్షణం కచ్చితంగా ఉంటుందట. అయితే..  ఏ రాశివారి లో ఎలాంటి ఆకర్షించే లక్షణం ఉంటుందో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట అదేంటో ఓసారి చూసేద్దాం..

213

1.మేష రాశి..
ఈ రాశివారు అందరితోనూ చాలా నమ్మకంగా ఉంటారు. అందరితోనూ సానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరితోనూ నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ లక్షణమే ఎలాంటి వారినైనా ఆకర్షించేస్తారు. ఇక వీరు తమ లైఫ్ పార్ట్ నర్ తో సైతం చాలా విధేయంగా ఉంటారు. వీళ్లు.. ఎక్కువగా కుటుంబంతో సమాయాన్ని గడపాలని ఇష్టపడతారు. వీరి నిజాయితీకి అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు.

313

2.వృషభ రాశి..

వీరికి అంతర్ దృష్టి ఎక్కువ. అందరితోనూ చాలా నమ్మకంగా ఉంటారు.  కొందరిలా ఎప్పటికప్పుడు మాట మార్చే అలవాటు వీరికి ఉండదు. చాలా స్థిరంగా ఉంటారు. కాగా.. వీరిలోని  అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా.. వారు ప్రేమించిన వారితో ఎప్పుడూ కలిసి ఉంటారు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించేస్తారు. జీవిత భాగస్వామికి ఎక్కువ విలువ ఇస్తారు.

413

3.మిథున రాశి..
మిథున రాశివారు సామాజికంగా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరికి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ.  సరదాగా బయటకు వెళ్లడాన్ని ఇష్టపడతారు. అందరితోనూ సరదాగా ఉంటారు. ఇక ప్రేమించిన వారితో ఎప్పుడూ సరసాలాడుతూనే ఉంటారు. వీరు తమలాంటి వ్యక్తులను మాత్రమే తమ జీవితంలోకి రావడానికి ఇష్టపడతారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పనులతో తమ పార్ట్ నర్ ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

513

4. కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితం. అందరితోనూ చాలా నమ్మకంగా ఉంటారు. అంతేకాదు వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. తమ పార్ట్ నర్ విషయంలో చాలా ప్రేమగా, క్లారిటీగా ఉ:టారు. ఎక్కువగా గొడవలు పడకుండా.. ఎలాంటి సమస్యనైనా చిన్న కౌగిలింతతో తొలగించాలని చూస్తుంటారు. వీరితో ఒక్కసారి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడితే.. వీరిని ఎవరూ వదులుకోలేరు.

613

సింహ రాశి..
ఎంత మందిలో ఉన్నా.. తమను ప్రత్యేకంగా గుర్తించేలా చేయడంలో ఈ రాశివారిలో స్పెషల్ టాలెంట్ ఉంది. వీరిలోని అద్భుత లక్షణమే ఇది. ఎంత మందిలో ఉన్నా.. అందరినీ ఆకర్షించగలుగుతారు. ఇక జీవిత భాగస్వామి విషయంలో మరింత శ్రద్ధగా ఉంటారు. ఎప్పటి  కప్పుడు.. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. వీరు.. ఎంత చెడ్డ రోజునైనా... మంచి రోజుగా మార్చుకోగలరు.

713

6.కన్య రాశి..
ఈ రాశివారు చాలా మృదు స్వభావులు. ఈ స్వభావం కారణంగా.. వీరిని చూసి ఎవరైనా ఇట్టే ఆకర్షణకు గురౌతుంటారు. ఎలాంటి వారితో నైనా వీరు త్వరగా కనెక్ట్ అయిపోతారు. చాలా దయ కలిగి ఉంటారు. ఎవరినీ బాధపెట్టాలని అనుకోరు. ఇది వీరిలోని అద్భుతమైన లక్షణం.
 

813

7. తుల రాశి..
ఈ రాశివారు జీవితంలో సమతుల్యంగా ఉంటారు. తమ బంధంలో స్థిరత్వం, ప్రేమను కోరుకుంటారు. ఎదుటివారి సందేహాలను తీర్చడంలో ముందుంటారు. వీరు రిలేషన్ ని అంత తొందరగా వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. సమస్యలను పరిష్కరించడంలో వీరు చాలా నేర్పరి.

913

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారు  చాలా తెలివిగలవారు.  వీరికి తమ వ్యక్తిగత విషయాలను.. మరో వ్యక్తితో పంచుకోవడానికి ఇష్టపడరు. వీరు తమ పార్ట్ నర్ పట్ల చాలా సున్నితంతగా వ్యవహరిస్తారు. వీరు తమను గౌరవించే వారిని మాత్రమే చాలా గౌరవంగా చూస్తుంటారు.  నచ్చనివారితో నచ్చనట్లుగానే వ్యహరిస్తారు.

1013

9. ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా సాహసేపతంగా ఉంటారు. వీరితో లైఫ్ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటుంది. తమ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉంటారు. తమ పార్ట్ నర్ కి ప్రతిరోజూ కొత్త జీవితాన్ని  చూపిస్తూ ఉంటారు.
 

1113

10.మకర రాశి..
ఈ రాశివారికి చాలా పట్టుదల ఎక్కువ. అందరితోనూ విధేయతగా ఉంటారు. ఈ రాశివారిలో అందరికన్నా భిన్నమైన లక్షణాలు ఉంటాయి. వీరు ఎలాంటి  పరిస్థితుల్లోనూ తమ బాధ్యతలను పక్కన పెట్టేయరు. ఎవరూ చెప్పకుండానే తమ బాధ్యతలను స్వీకరిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు.

1213

11. కుంభ రాశి..
కుంభ రాశివారికి ఫేక్ గా నటించడం అస్సలు రాదు. వీరు అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరినీ కష్టపెట్టాలని అనుకోరు. కష్టపడి పనిచేస్తుంటారు. తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు శ్రమ పడుతుంటారు. ప్రతి ఒక్కరినీ ప్రేమ గాచూడటం వీరిలోని ప్రత్యేక ఆకర్షణ.

1313

12. మీన రాశి..
ఈ రాశివారు జీవితంలో పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటారు. వీరు చాలా సానుభూతిగా ఉంటారు. ఈ లక్షణంతోనే అందరినీ ఆకర్షిస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. వీరు బంధంలో చాలా పారదర్శకంగా ఉంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!
Recommended image3
Ugadi 2026: పరాభవ నామ సంవత్సర ఉగాది.. తులా రాశి ని వరించనున్న అదృష్టం..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved