ఈ రాశివారిలో ఉన్న చెడు లక్షణం ఇదే...!
ఒక్కో రాశిలో ఉన్న చెడు లక్షణం ఏంటో చూద్దాం. అంటే పూర్తిగా చెడు అని చెప్పలేం. కాకపోతే.. మీలో ఉన్న ఆ లక్షణం ఇతరులకు కాస్త ఇబ్బందిగా ఉంటుందని అర్థం. మరి అవేంటో ఓసారి చూద్దాం..

ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే... వాటిలో ఏది ఎక్కువ శాతం ఉంటే వారిని ఆ కేటగిరిలోకి చేరుస్తూ ఉంటారు. మనం ఎంత మంచివారు అనుకున్నా కూడా.. ఇతరులకు నచ్చని ఏదో ఒక విషయం అంటే.. చెడు లక్షణం ఉండి తీరుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక్కో రాశిలో ఉన్న చెడు లక్షణం ఏంటో చూద్దాం. అంటే పూర్తిగా చెడు అని చెప్పలేం. కాకపోతే.. మీలో ఉన్న ఆ లక్షణం ఇతరులకు కాస్త ఇబ్బందిగా ఉంటుందని అర్థం. మరి అవేంటో ఓసారి చూద్దాం..
1.మేష రాశి...
ఈ రాశివారు బాస్ లా ప్రవర్తిస్తారు. ప్రతి ఒక్కరిపై డిమాండింగ్ గా ఉంటారు. చాలా రూడ్ గా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా.... అందరూ కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు వీరిలోని బాసిజం బయటపెడతారు.
2.వృషభ రాశి...
ఈ రాశివారు మనిషి మంచివారే. కానీ వీరు కచ్చితంగా మార్చుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు వృథా చేయడం. వీరిలో ఉన్న చెడు లక్షణం ఇదే. వీరు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెడుతూ ఉంటారు. దేనికి ఖర్చు పెడుతున్నాం... ఎంత ఖర్చుపెడుతున్నాం అనే లెక్కా పత్రం లేకుండా ఖర్చుపెట్టేస్తూ ఉంటారు.
3.మిథున రాశి...
ఈ రాశివారు ఎదుటివారిపై ఎక్కువగా గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇతరులు ఎవరైనా సంతోషంగా ఉన్నా వీరు చూసి తట్టుకోలేరు. వెంటనే వారిపై గాసిప్స్ క్రియేట్ చేసి ఇతరులకు చెప్పి హ్యాపీగా ఫీలౌతూ ఉంటారు.
4.కర్కాటక రాశి...
ఈ రాశివారు ఎంతటి ఉత్సాహకరంగా ఉండాల్సిన ప్రదేశమైనా చాలా మూడీగా ఉంటారు. టూ సెన్సిటివ్. కాస్త చిన్న మాట అన్నాసరే వీరు హర్ట్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడూ ముఖం డల్ గా పెట్టుకొని ఉంటారు.
5.సింహ రాశి...
ఈ రాశివారు అంతా బాగానే ఉంటారు. కానీ.. ఒక్కసారి పరిస్థితులు తమకు అనుకూలంగా జరగడం లేదని తెలిస్తే మాత్రం ఎక్కడ ఉన్నామనేది కూడా చూడకుండా డ్రామా క్రియేట్ చేస్తారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు టూమచ్ గా బిహేవ్ చేస్తారు. ఈ రాశివారికి ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కావాలి. అందుకోసం.. ఇతరులను ప్రతి నిమిషం కంట్రోల్ చేస్తూ ఉంటారు.
7.తుల రాశి..
ఈ రాశివారి మామూలూగా చాలా బాగుంటారు కానీ... ఎదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం వీరికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే క్లారిటీ ఉండదు. బుర్ర పెట్టి కూడా ఆలోచించరు.
8.వృశ్చిక రాశి...
ఈ రాశివారు ఎవరిమీదైనా కోపం ఉంటే దానిని తగ్గించుకోవాలని చూడరు. అంతకంతకు పెంచుకుంటూనే ఉంటారు. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. దాని కోసం ఇతరులను మానిప్యూలేట్ చేయాలని చూస్తుంటారు.
9.ధనస్సు రాశి...
ఈ రాశివారికి బాధ్యత తెలీదు. వీరిలో ఉన్న చెడు లక్షణం ఇదే. బాధ్యతగా ఉండాల్సిన సమయంలోనూ వీరు ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్దంగా ఉండరు. ఇది ఇతరులను చాలా చిరాకు పెడుతుంది.
10.మకర రాశి..
ఈ రాశివారికి కాస్త కూడా జాలి, దయ అనేది ఉండదా అన్నట్లు ప్రవర్తిస్తారు. వీరికి అధికారం పై ఆశ ఎక్కువ. ఎప్పటికైనా అధికారం చేజిక్కుంచుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటారు.
11.కుంభ రాశి...
ఈ రాశివారిలో నిజానికి చెడు లక్షణం అంటూ ఏమీ ఉండదు. కానీ... కొన్ని సార్లు మాత్రం చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తారు. ఇతరులతో పోల్చినప్పుడు.. ముందుగా తమ గురించి మాత్రమే వారు ఆలోచిస్తారు.
12.మీన రాశి..
ఈ రాశివారికి కాస్త స్వార్థం ఎక్కువే. వారికి దక్కాల్సింది దక్కే వరకు ఇతరుల గురించి అస్సలు ఆలోచించరు. వారు కోరుకున్నది వారికి కావాల్సిందే.