Zodiac signs: ఈ రాశుల వారు ఫోన్ కి బానిసలుగా మారిపోతారు..!
స్మార్ట్ ఫోన్ వాడని వారు ఈ రోజుల్లో ఎవరూ లేరనే చెప్పాలి. అయితే.. ఈ కింది రాశులు మాత్రం వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడతారు. అసలు ఫోన్ లకు బానిసలుగా మారిపోతారని చెప్పొచ్చు. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉండాల్సిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని అవసరాలకు ఈ ఫోన్ లే వాడుతున్నారు. పక్కన మనిషి తోడు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా ఉంటున్నారేమో కానీ... చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండేవారు మాత్రం చాలా అరుదు అని చెప్పొచ్చు. అయితేే.. ఈ స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో.. వాటిని అవసరానికి మించి వాడుతూ.. వాటిని బానిసలుగా మారుతున్నవారు కూడా ఉన్నారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అలా బానిసలుగా మారగల రాశులేంటో చూద్దాం..
మేష రాశి..
స్మార్ట్ ఫోన్ లకు అడిక్ట్ అయ్యే రాశుల లిస్టులో మేషం మొదటి స్థానంలో ఉంది. ఎప్పుడూ ఏదో పనిలో బిజీగా ఉంటూ, ప్రపంచంతో టచ్‌లో ఉండటానికి ఫోన్లు వాడుతుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తమ చేతిలో ఈ ఫోన్ ఉండాల్సిందే. తమ వివరాలను సోషల్ మీడియాలో ఉంచడంతో పాటు.. ఇతరుల వివరాలను తెలుసుకోవడం, స్నేహితులతో చాట్ చేయాలన్నా వీరు ఫోన్లు వాడతారు. ఫోన్ చేతిలో లేకుంటే వీరికి కాసేపు కూడా తోచదు.
మిథున రాశి..
స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారే రాశులలో మిథున రాశి రెండో స్థానంలో ఉంది. మిథున రాశి వాళ్ళకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. సమాచారం కోసం సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంటారు. తాము విన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకోని, శోధించి.. సాధించే వరకు వీరు ఫోన్లు పక్కన పెట్టరు.
సింహ రాశి..
అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకునే సింహ రాశి స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారే జాబితాలో మూడో స్థానంలో ఉంది. సింహ రాశి వాళ్ళు పుట్టుకతోనే సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారు. లైకుల కోసం ఆరాటపడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఉంటేనే తమకు క్రేజ్ ఉంటుందని నమ్ముతారు. ఫోటోలు షేర్ చేయడానికి, రీల్స్ అప్ లోడ్ చేయడానికి, ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
తుల రాశి..
బ్యాలెన్స్, సామరస్యం కోరుకునే తుల రాశి ఈ స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారే జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. తుల రాశి వాళ్ళు బంధాలు నిలుపుకోవడానికి, రిలేషన్స్‌ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే.. ఈ రోజుల్లో రిలేషన్స్ నిలపడాలంటే ఫోన్ లోనే అందరితో కాంటాక్ట్ లో ఉండాలని వీరు నమ్ముతారు. అందుకే.. ఎక్కువ సేపు ఫోన్ లలో సమయం గడుపుతారు.
కుంభ రాశి..
టెక్నాలజీని ఇష్టపడే, ముందుచూపు ఉన్న కుంభ రాశి స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారే జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. కొత్త ఆలోచనలు, టెక్నాలజీని ఈ రాశివారు బాగా ఇష్టపడతారు. కొత్త యాప్స్, గ్యాడ్జెట్‌లను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఫోన్లు వాడుతూ ఉంటారు.