Zodiac signs: ఈ రాశులవారికి బయట తిరగడం అంటే పిచ్చి..!
ప్రయాణాలంటే ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. కానీ.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు మాత్రం ప్రయాణాలంటే పిచ్చి. ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు.

ఒక మనిషి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని వారి రాశి చక్రం ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ల జాతకంలో గ్రహాలు, నక్షత్రాల స్థానాన్ని బట్టి అన్నీ తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం అతని జాతకం ఆధారంగా నిర్ణయిస్తారు. ఇదే రాశి ఆధారంగా నచ్చిన, నచ్చని విషయాలు అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు జోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండకుండా.. సమయం దొరికినప్పుడల్లా బయటకు తిరిగే వాళ్లు కూడా ఉన్నారు. మరి, బయటకు తిరగడాన్ని ఇష్టపడే రాశులేంటో చూద్దామా...
telugu astrology
1.మేష రాశి..
మేష రాశి వారికి ప్రయాణాలంటే చాలా ఎక్కువ ఇష్టం. ఏ కొంచెం సమయం దొరికినా, లాంగ్ వీకెండ్ వచ్చినా.. ఎక్కడికో ఒకచోటకు వెళ్లడానికి ఇష్టపడతారు.ఈ రాశివారికి కొత్త ప్రదేశాలకు వెళ్లి, అక్కడి విషయాలు తెలుసుకోవడం అంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఇది ఈ రాశివారికి ఒక హాబీ లాంటిది. తోడు ఎవరూ లేకపోతే ఒంటరిగా అయినా బయటకు వెళ్లడానికి వెనకాడరు.
telugu astrology
2.వృషభ రాశి..
జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ప్రయాణాల విషయానికి వస్తే వాళ్ళ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఏదైనా ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటారు. కొన్ని ప్రదేశాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి. అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్లాలని అనుకుంటారు. చాలా సార్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ప్రశాంతంగా గడపడానికి వెళ్తారు.
telugu astrology
3.మిథున రాశి
మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా బయట తిరగడానికి రెడీగా ఉంటారు. అది గొడవగా ఉండే ప్రదేశమైనా, ప్రశాంతంగా ఉండే ప్రదేశమైనా వాళ్ళకి తేడా ఏమీ ఉండదు. వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోనే ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. అందుకే కొత్త ప్రదేశాలను వెతుకుతూ ఉంటారు.
telugu astrology
4.కుంభ రాశి..
ఈ లిస్టులో కుంభ రాశి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ప్రయాణాలంటే ఎప్పుడూ వెనక్కి తగ్గరు.ఎన్నిసార్లు తిరిగిన ప్రదేశం అయినా, మళ్లీ మళ్లీ వెళ్లడానికి ఇష్టపడతారు. వారికి ఆ ప్లేస్ నచ్చితే చాలు.. ఎన్ని సార్లు అయినా వెళతారు. ప్రతిసారి ట్రిప్ ని బాగా గుర్తుండిపోయేలా చేసుకుంటారు. అంతేకాదు, వాళ్ళ అనుభవాలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడతారు.