MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope: ఓ రాశివారు జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 07 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శణం చేసుకుంటారు. వృత్తి  వ్యాపారాలు లాభాలు రాక డీలా పడతారు. ముఖ్యమైన పనులే నత్తనడకన సాగడంతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. బంధుమిత్రులతో డబ్బుల ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవ దర్శనంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంటా బయటకు పని భారం బాగా పెరుగుతుంది. మీరు ఆదాయానికి మించి ఖర్చులను చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.  భాగస్వామ్య వ్యాపారంలో వివాదాలు వస్తాయి. ఉద్యోగులు అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. 
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. సంఘంలో ప్రముఖులతో మీ పరిచయాలను పెంచుకుంటారు. మొదలుపెట్టిన పనులు అనుకున్నట్టుగానే సాగుతాయి. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు కలిసి వస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా ముందుకు సాగుతాయి. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీరే నష్టపోవాల్సి ఉంటుంది. అనుకోని విధంగా బంధుమిత్రులతో గొడవలు జరుగుతాయి.  అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.  మొదలుపెట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి ఉండదు. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-జీవిత భాగస్వామి నిర్ణయం తీసుకుంటే వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉన్నది. వృత్తి  ఉద్యోగుల కష్టానికి సరైన ఫలితం పొందుతారు.మొదలుపెట్టన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-బంధుమిత్రుల నుంచి శుభవార్తాలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ క్రయ, విక్రయాలు మీకు లాభసాటిగా ఉంటాయి. రావు అనుకున్న బాకీలు వసూలు అవడంతో ఆనందంగా ఉంటారు. సమాజంలో ప్రముఖులతో మీ పరిచయాలను పెంచుకుంటారు. వృత్తి  వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.  ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద నష్టం జరుగుతుంది. మొదలుపెట్టిన పనుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.  అవసరానికి చేతిలో డబ్బు ఉండదు.  ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు అంతంత మాత్రమే సాగుతుంది. దైవ దర్శనంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- వృత్తి  వ్యాపారాలు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాన్ని అమలు చేస్తారు.  మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు.  నూతన వాహనం కొనే యోగం ఉన్నది.  వ్యాపారాలు లాభాల్లో సాగుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి.  ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.  కొత్త అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.  వ్యాపారాలు, ఉద్యోగులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యమైన పనులకు ఆటంకాలు కలుగుతాయి.  మీరు ఊహించిన ప్రయాణాలు చేస్తారు.  కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఇంట్లో గొడవలు జరుగుతాయి. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: చాలా రోజులుగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.  కొత్త పనులను మీరు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు మీకు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఈ రోజు విలువైన వస్తువులను కొనే సూచన ఉన్నది. భూమికి సంబంధించి గొడవలు, వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కరించబడతాయి.  బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.  మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.  చిన్ననాటి మిత్రులతో ఈ రోజు ఆనందంగా గడుపుతారు. ధనలాభం కలిగే యోగం ఉన్నది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved