MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు

Today Horoscope: ఓ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 02 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

2-6-2024  ఆదివారం  మీ రాశి ఫలాలు


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఇష్టదైవ దర్శనంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలించవు. పనులు ముందుకు సాగవు. అయినా ప్రయత్నిస్తే పూర్తి చేయగలుగుతారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.అందుకే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలొస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఈ రోజు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఇన్ని రోజులు ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు. దీంతో కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు.

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-మీరు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. అకస్మత్తుగా మీ నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనం మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బంధువులతో తగాదాలొస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. 
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఈ రోజు నూతన పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. మీరు ఇన్నాళ్లుగా అనుకుంటున్న పనులను పూర్తిచేస్తారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. నూతన వస్తు, వాహనాలు కొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఒత్తిడి దూరమయ్యి ఆనందంగా ఉంటారు. 
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- విందు, వినోధాలకు ఆహ్వానం అందుతుంది. మీరు చేపట్టిన ప్రతి పనీ సాఫీగా ముందుకు సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.వ్యాపారులు నూతన పద్దతులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక నష్టం కలుగుతుంది. పనులు మధ్యలోనే ఆగిపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. గొడవలకు దూరంగా ఉంటేనే మంచిది. ఆలోచనలో గందరగోళం ఉంటుంది. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకండి. 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి రావు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పాత రుణాలు వేదిస్తాయి. దీంతో కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలనుకుంటే వాటిని వాయిదా వేయడమే మంచిది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-నిరుద్యోగులు శుభవార్త వింటారు. చదువులో సంతాన్నిచూసి గర్వపడతారు. మీ పనులన్నీ మీరు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. ఇది మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులే మిత్రులవుతారు. ఉద్యోగులు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- మీరు ఊహించని విధంగా పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం ఈ రోజు వస్తుంది. ఉద్యోగంలో మీరు ఇరుక్కున్న సమస్య నుంచి ఈ రోజు బయటపడతారు. 
 

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-మీరు చేపట్టిన కొన్ని విషయాల్లో ముఖ్యమైన మార్పులు చేస్తారు. ప్రయాణాలు చిరాకు కలిగిస్తాయి. ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు దైవ చింతనలో లీనమవుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మంచిది కాదు. స్నేహితుల వల్ల కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. 
 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ఇంటా బయట మీరు సమస్యలతో సతమతమవుతారు. ఇంట్లో ప్రశాంతంగా ఉండదు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్నేహితులకు దూరంగా ఉంటేనే మీకు మంచిది. నిరుద్యోగుల ఎదురుచూపులు అలాగే ఉంటాయి. ఒకే పనిని పదేపదే చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాక నిరాశ చెందుతారు. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ప్రయాణాల వల్ల కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలను అంచెలంచెలుగా పెంచుతారు. మీరు ఇన్ని రోజులుగా పరిష్కరించని సమస్యలను ఈ రోజు పరిష్కరిస్తారు. ఉద్యోగులు ప్రొమోషన్ పొందుతారు. పనులను ఉత్సాహంగా చేస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved