Today Horoscope: ఓ రాశివారికి పని వారితో ఇబ్బందులు తప్పవు
Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మీ అంచనాలు తలక్రిందలు అవుతాయి.సామాజిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యల వలన మానసిక వేదనకు గురి అవుతారు.
27 -1-2024 శని వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
శుభవార్త వింటారు.కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విలాస అందమైన వస్తువుల కొరకు అధిక ఖర్చు చేస్తారు. రావలసిన పాత బాకీలు వసూలు అవును. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ప్రతిష్టలు లభిస్తాయి.వ్యాపారాలు లాభసాటిగా మార్చేందుకు చేయు కృషి ఫలించును.శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. ప్రయత్నించిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. ఓం రాజ్య లక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
నిష్కారణంగా కొంతమందితో విభేదాలు ఏర్పడుతాయి. కీలకమైన సమస్యల వలన ఆందోళనగా ఉంటుంది. ఆత్మీయులు తో సఖ్యత గా ఉండవలెను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చేసే ప్రయత్నాలు పట్టుదలతో చేస్తే సఫలీకృతం అవుతాయి.మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడును.ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది. వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకొని వలెను.ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజు మీ అంచనాలు తలక్రిందలు అవుతాయి.సామాజిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యల వలన మానసిక వేదనకు గురి అవుతారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఆదాయం తగ్గి అనుకోని ఖర్చులు పెరగవచ్చు. వృత్తి వ్యాపారాలు వ్యవహారాలు కలిసి రాకపోవచ్చు. బంధుమిత్రులతో విరోధములు చికాకులు ఏర్పడును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఓం నీలకంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
సామాజిక సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబము లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. స్నేహ బంధుత్వాలు కలిసి వస్తాయి.గతంలో నిలిచిపోయిన వ్యవహారములు పరిష్కార మార్గాలు దొరుకును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి.ప్రయత్నించిన కార్యములు సకాలంలో పూర్తి అగును . పని వారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో పై అధికారుల తో సత్సంబంధాలు మెరుగు పడతాయి. ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
చేయు వ్యవహారములు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకొనవలెను. ఉద్యోగాలలో అసంతృప్తి వాతావరణ ఏర్పడుతుంది. సమాజము నందు నిందారోపణలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సామాజిక పరిస్థితుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు మానసికంగా ఆవేదన ఉద్రేక తులకు దారితీయును. అనవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను. దూరాలోచన కి దుష్టసాంగత్యం కి దూరంగా ఉండటం మంచిది. ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.గృహ సంబంధమైన పనులు కలిసి వస్తాయి. అనుకోకుండా అవకాశాలు కలిసి వస్తాయి. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల ఆదరాభిమానాలు పొందుతారు. శక్తి సామర్థ్యాలు కు తగిన గుర్తింపు లభించును. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అభివృద్ధి కొరకు చేయి నూతన విధానంలో మంచి ఫలితాలను పొందవచ్చు . వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ విషయాలు లో చురుగ్గా పాల్గొంటారు. కీలకమైన సమస్య పరిష్కారం అవుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మానసిక ప్రశాంతత సంతృప్తి కలుగుతుంది. ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
ఆర్థిక సహాయం అందుతుంది. చిన్న చిన్న సమస్యలు అని నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యల యందు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగ్గ ధన లాభం కలుగుతుంది. చేసే పని యందు ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి. నూతన వస్తు వాహన సౌఖ్యం లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలుగజేస్తుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో పెద్ద వారితో పరిచయం పెంచుకుంటారు. ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
చిన్న చిన్న విషయాలు లో పొరపాటులు ఇబ్బందులు ఎదురవుతాయి. పగ ప్రతీకారం కోపం వాటికి దూరంగా ఉండటం మంచిది. సమాజంలో లౌక్యంగా వ్యవహరించాలి.ప్రభుత్వం అధికారులు తో స్నేహం వలన ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పని అధికంగా ఉంటుంది.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలెను. ఊహించని ప్రయాణాలు ఏర్పడతాయి.అనుకున్న పనులు మందకొడిగా సాగడం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది.ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని విషయాలు లో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. చేయి వ్యవహారములు లో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
సాంఘికంగా నిందారోపణలు ఏర్పడగలవు. ఉద్యోగాలు లో కొంత ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసర ప్రయాణాలు వలన అలసట శారీరక బలహీనత ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చును.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజంలో చేదు అనుభవాలు మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం. ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)
బంధువుల తో ఏర్పడిన వివాదాలు పరిష్కారం మగును. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. నూతన ఆలోచనలు కలసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. ఈ రాశి వారు ఓం శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.