MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి వ్యాపార వ్యవహారాలలో ఊహించని వృద్ధి

Today Horoscope: ఓ రాశివారికి వ్యాపార వ్యవహారాలలో ఊహించని వృద్ధి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో అనుకోని లాభాలు పొందగలరు.ఓం కరుణాయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 19 2023, 04:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

19-11-2023, ఆదివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.


పంచాంగం                                                                                                                                                                                                                               

తేది :.   19   నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
ఆదివారం
తిథి :- షష్టి ఉ॥7.48 ని॥వరకు తదుపరి  సప్తమి తె.5.35 ని॥వరకు
నక్షత్రం : - శ్రవణం రాత్రి 11.51 ని॥వరకు
యోగం:- వృద్ధి రాత్రి 1.10 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥7.48 గరజి సా॥6.42 వణిజి తె.5.35 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥2.04 ని॥ల 3.35 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 03:51ని॥ల సా॥ 04:36 ని॥వరకు
వర్జ్యం: ఉ॥ఉ.శే6.33 ని॥వరకు తె.3.34 ని॥ల 5.04 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల సా 6:00నివరకు
యమగండం:-మ॥12:00 ని॥ల మ.01:30 ని.
సూర్యోదయం :-    6.09ని॥లకు
సూర్యాస్తమయం:- 5.21 
          
            

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(క్షేమ తార)
భరణి నక్షత్రం వారికి (విపత్తార)
కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనులలో పట్టుదల  చూపిన పనులు పూర్తి కాగలవు. బంధు మిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓం ఆంజనేయాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (సంపత్తార)
రోహిణి నక్షత్రం వారికి  (జన్మ తార)
మృగశిర నక్షత్రం వారికి (పరమైత్ర తార)

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధు వర్గం నుండి ఆహ్వానాలు అందుతాయి.దైవ దర్శనాలు చేసుకుంటారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో అనుకోని లాభాలు పొందగలరు.ఓం కరుణాయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (పరమైత్రతార)
ఆరుద్ర నక్షత్రం వారికి  (మిత్రతార)
పునర్వసు నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. చేయి పనులలో ఆటంకాలు ఏర్పడి  చికాకులు గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. చేయి  పని వారితో కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాలలో నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. ఓం మంగళాదేవ్యై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైధన తార)
పుష్యమి నక్షత్రం వారికి (సాధన తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార)

దిన ఫలం:-కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు తప్పవు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. మిత్రులతో మనస్పర్ధలు రాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఓం రవయే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (క్షేమ తార)
పూ.ఫ నక్షత్రం వారికి (విపత్తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వివాదాలు పరిష్కారమగును .కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఓం శివాయ నమః  అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (సంపత్తార)
హస్త నక్షత్రం వారికి  (జన్మ తార)
చిత్త నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రుణాలు తీరుస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతతను పొందవచ్చు.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.భూ గృహ క్రయ విక్రయాల లో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో పాల్గొంటారు.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
స్వాతి నక్షత్రం వారికి  (మిత్ర తార)
విశాఖ  నక్షత్రం వారికి  (నైధన తార)

దిన ఫలం:-ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను వాయిదా వేయడం మంచిది. మానసికంగా శారీరకంగా నిరుత్సాహంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. కష్టపడి పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. వివాదాలకు దూరంగా ఉండండి. ఓం భాను‌ పుత్రాయ నమః అని జపించండి. శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (నైధనతార)
అనూరాధ నక్షత్రం వారికి (సాధన తార)
జ్యేష్ట నక్షత్రం వారికి (ప్రత్యక్తార)

దిన ఫలం:-కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.వాహన సౌఖ్యం లభిస్తుంది.వ్యాపార వ్యవహారాలలో అధికమైన వృద్ధి చూడగలరు. ఓం విష్ణువే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (క్షేమ తార)
పూ.షా  నక్షత్రం వారికి  (విపత్తార)
ఉ.షా నక్షత్రం వారికి  (సంపత్తార)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అపనిందలు రాగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారులతో అకారణంగా కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవసరమైన ఖర్చులు తగ్గించాలి.ఓం హిరణ్మయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (సంపత్తార)
శ్రవణం నక్షత్రం వారికి (జన్మ తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి (పరమైత్ర తార)

దిన ఫలం:-సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.బంధు వర్గం నుండి శుభవార్తలు వింటారు. దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండటంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. ఓం కపర్థినే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
శతభిషం నక్షత్రం వారికి  (మిత్ర తార)
పూ.భా నక్షత్రం వారికి  (నైధన తార)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఓం హిరణ్మయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (నైధన తార)
ఉ.భా  నక్షత్రం వారికి (సాధన తార)
రేవతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు సరిపడా ధనం చేతికి అందుతుంది. బంధు మిత్రులతో వివాదాలు రాగలవు. ప్రయాణాల్లో  ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అపనిందలు రాగలవు. చెడు అలవాట్లు దూరంగా ఉండాలి.ఓం సదాశివాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved