MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope:రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది... వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి కలిసి వస్తుంది..? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి..? ఈ రోజు రాశిఫలాల్లో మనం తెలుసుకుందాం.

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 18 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం:

ఈరోజు మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఏదైనా పొదుపు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఆ పని వెంటనే చేయండి. ఇది మీకు లాభాదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రణాళికలను సోదరులతో కానీ సన్నిహితులతో కానీ చర్చించకండి. బద్ధకం వల్ల ఏ పని చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  మీ నోటి నుంచే వచ్చే కొన్ని చెడ్డ మాటలు ఇతరులను బాధపెడతాయి. పని రంగంలో సహచరులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. పని భారం ఉన్నప్పటికీ మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం:

ఆర్థిక కార్యకలాపాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మతపరమైన లేదా ఆధ్యాత్మిక రంగంలో మీ ఆసక్తి పెరుగుతుంది. దీంతో మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రణాళిక ప్రకారం అన్ని పనులను పూర్తి చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్నిసార్లు ద్రోహం జరగొచ్చు. స్నేహితులతో మీ సమయాన్ని వృథా చేయకండి. మీ శక్తిని మంచి పనులకు ఉపయోగించండి. ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఇంటి ఏర్పాటు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావొచ్చు.
 

312
telugu astrology

telugu astrology

మిథునం:

ఏదైనా పాలసీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టైతే వెంటనే మొదలుపెట్టండి. పరిస్థితి మీకు అనుకూలంగా ఉంది. ఇతరులు మీకు సహాయపడతారని ఆశించండి. మీ మనసులోని మాటను వినండి. మీరే మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆదాయంతో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీ కుటుంబ విషయంలో లేదా వ్యాపార విషయంలో బయటి వ్యక్తులెవరూ జోక్యం చేసుకోనివ్వకండి. వ్యాపార స్థలంలో చేసిన కృషి వల్ల సరైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం:

ఈ రోజు మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు. కొంతకాలంగా ఉన్న ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు.పిల్లల సమస్యలను పరిష్కరిస్తారు. దీంతో పిల్లలకు భద్రతా భావం కలుగుతుంది. ఇంట్లో ఒక వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. వ్యాపార కార్యకలాపాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. మీ పట్ల భాగస్వామి భావోద్వేగ మద్దతు మీ సామర్థ్యానికి కొత్త దిశను ఇస్తుంది. సీజనల్ సమస్యలు వస్తాయి. 

512
telugu astrology

telugu astrology

సింహ రాశి:

 ఫైనాన్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ ప్లాన్‌లలో దేనినైనా ప్రారంభించడం వల్ల మనస్సుకు ఆనందం కలుగుతుంది. అలాగే మీకు ఇష్టమైన పనులను చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారు.  మీ భావోద్వేగ స్వభావాన్ని నియంత్రించండి. లేకపోతే ఎవరైనా మీ భావోద్వేగం, దాతృత్వాన్ని తప్పుగా ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో పని రంగంలో పనులను చాలా వరకు మీరే పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. 

612
telugu astrology

telugu astrology

కన్య:

ఈరోజు మీ సమర్థతతో ఎన్నో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీ ఆలోచనలను పూర్తిగా ఆచరణాత్మకంగా ఉంచండి. స్టాక్ మార్కెట్, రిస్క్ సంబంధిత కార్యకలాపాలల్లో లాభాలు పొందుతారు. పుకార్లను ఏమాత్రం పట్టించుకోవద్దు. కొద్దిమంది మాత్రమే అసూయతో మీ కష్టాలను పెంచుతారు. పొరుగువారితో వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ సమయం వెచ్చిస్తారు. 

712
telugu astrology

telugu astrology

తుల:

ఈ సమయంలో గ్రహాల స్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. మిమ్మల్ని మీరు బాగా నమ్ముతారు. ఒక ముఖ్యమైన పని కోసం ప్రణాళికలను రూపొందిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్వార్థ భావన స్నేహితులతో సంబంధాన్ని పాడుచేస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ మీరు మీ ప్రవర్తనను కూడా మార్చుకుంటారు. ప్రస్తుతం ఉద్యోగంలో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికం:

విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. శక్తిని, సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఈరోజు మీరు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి కొన్ని పనులు హఠాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేయకండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. పబ్లిక్ రిలేషన్స్ మీ వ్యాపారం కోసం కొత్త వనరులను తెరవగలవు. కుటుంబ వాతావరణం ఆనందంగా సాగుతుంది. 
 

912
telugu astrology

telugu astrology

ధనస్సు: 

కొంతకాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కొన్నిసార్లు మీ అనుమానాస్పద కార్యకలాపం ఓ సమస్యకు కారణమవుతుంది. మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి. భావోద్వేగాల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. వ్యాపార స్థలంలో ఉద్యోగులతో వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తలు తమ తమ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఒకరికొకరు సమయం కేటాయించలేరు. కొన్నిసార్లు అధిక పని భారం కారణంగా చిరాకు, అలసట కలుగుతాయి. 
 

1012
telugu astrology

telugu astrology


మకరం:

ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఆదాయ మార్గాలు బలపడతాయి. బంధువులు ఇంటికి రావొచ్చు. సోమరితనం దరిచేరనివ్వకండి. కొన్ని విషయాల్లో బంధువులతో వివాదాలు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. వ్యాపార కార్యకలాపాలలో అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం అవసరం. జీవిత భాగస్వామి మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

1112
telugu astrology

telugu astrology


కుంభం:

ఈరోజు ఇంట్లో కొన్ని పునర్నిర్మాణ పనులను చేపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు డబ్బులపై శ్రద్ధ వహించండి. ప్రయాణం మీకు లాభాదాయకంగా ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల విజయం జారిపోతుంది. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి. ఈ సమయంలో ముఖ్యమైనదాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు పని రంగంలో మరింత బిజీ ఉంటుంది
 

1212
telugu astrology

telugu astrology


మీనం:

దైవ దర్శనం చేసుకుంటారు. ఇది మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. పిల్లల సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఇంటి పెద్దల పట్ల గౌరవంగా ఉండండి. కొన్నిసార్లు మీ మితిమీరిన జోక్యం కారణంగా ఇంటి వాతావరణం చెడిపోతుంది. మీ ప్రవర్తనను మితంగా ఉంచండి. సోదరులతో ఏదో విషయంలో వాగ్వాదం ఉంటుంది. ప్రస్తుత వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved