MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope:ఓ రాశివారికి ఈరోజు ఏం చేసినా శుభమే..!

Today Horoscope:ఓ రాశివారికి ఈరోజు ఏం చేసినా శుభమే..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

4 Min read
Author : ramya Sridhar
Published : Jun 11 2024, 05:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేష రాశి..
మేషం (అశ్విని ,భరణి ,కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రవి)
భరణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)
కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
ఈ రోజు మేషరాశి వారికి  గృహంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఈరోజు చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభ రాశి..
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
 ఈరోజు వృషభ రాశివారికి కాస్త మద్యస్తంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా సాగుతాయి. వెళ్లాల్సిన ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి.  అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.  వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఎదురవ్వచ్చు. ఉద్యోగస్తులకు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

312
telugu astrology

telugu astrology


3.మిథున రాశి..
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)
ఈ రోజు మిథున రాశివారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు.  కాస్త చేపట్టిన పనుల్లో అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు సరిగా సాగవు.  నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా సఫలం కావు.

412
telugu astrology

telugu astrology


4.కర్కాటక రాశి..
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
ఈరోజు కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలరు. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది.  వ్యాపారాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. అధికారుల పనితీరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి రవి)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)

దిన ఫలం:-ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి.జీవిత భాగస్వామితో చికాకులు. కుటుంబం లో ప్రతికూల వాతావరణం.ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు లో ఆటంకాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.సంతాన మూలకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.సంఘంలో ఆచితూచి వ్యవహరించాలి.ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతి
హస్త నక్షత్రం వారికి(దినాధిపతి శని)
చిత్త నక్షత్రం వారికి(దినాధిపతి కేతువు)

దిన ఫలం:-దేవాలయ సందర్శన. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సోదరులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి.ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.కుటుంబ వృద్ధి కోసం కొంతమేర ధనాన్ని ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.ఓం సరస్వతీ దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)
విశాఖ  నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)

దిన ఫలం:-తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలను పొందుతారు. కుటుంబంలో శుభ కార్య ఆలోచన చేస్తారు.విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో విశేష ధన లాభం పొందుతారు.నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది.ఓం సౌమ్యలక్ష్మి దేవతాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

812
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి(దినాధిపతి రాహు)

దిన ఫలం:-కుటుంబము నందు ప్రతికూలత.ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉంటుంది.ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.బంధుమిత్రులతో చికాకులు.కొత్త సమస్యలు ఏర్పడతాయి.ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.తలపెట్టిన కార్యాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల , పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి(దినాధిపతి రవి)
పూ.షాఢ నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు)
ఉ.షాఢ నక్షత్రం వారికి(దినాధిపతి గురుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు.కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.గృహంలో శుభకార్య ప్రస్తావన చేస్తారు.ఆధ్యాత్మిక చింతన.సత్కర్మలు చేస్తారు.సంఘంలో పెద్ద వారిని కలుస్తారు.రావలసిన బాకీలు వసూలు అవును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు.దానధర్మాలు చేస్తారు.కొత్త వ్యక్తులు కలుస్తారు.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు.ఓం వీరాంజనేయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )

దిన ఫలం:-వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి.ఆధ్యాత్మిక చింతన.అనవసరమైన ఖర్చులు.ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.బంధుమిత్రులతో అకారణంగా కలహాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం.ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ఓం కామేశ్వరి దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చు.మిత్రులతో సఖ్యత గా ఉండాలి.ఆదాయానికి మించి అధిక ఖర్చులు.అకారణ కలహాలు రాగలవు. దైవకార్యాలు, ఆధ్యాత్మిక కారక్రమాల్లో పాల్గొంటారు.  సంయమనం పాటించాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబం నందు ప్రతికూల వాతావరణం.రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘంలో  ఆచితూచి తెలివిగా వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)

దిన ఫలం:-నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు మిత్రుల కలయిక.పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహంలో దైవ కార్యాచరణ.ఉద్యోగాలలో అధికారుల అభిమానం పొందగలరు.వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి.ఇతరులకు ఉపకారం చేయాలి అని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఓం గంగాధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved