Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈ రోజు అదృష్టం లభిస్తుంది.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈ రోజు అదృష్టం లభిస్తుంది.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

ramya Sridhar | Updated : Jun 06 2023, 05:09 AM
10 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Asianet Image

06  జూన్   2023 మంగళ వారం  మీ రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                       
                                            
తేది :   6 జాన్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . జ్యేష్ట మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :- కృష్ణపక్షం
వారము:- మంగళవారం
తిథి :- విదియ ఉ॥5.45 ని.వరకు  తదుపరి తదియ తె.3.33
నక్షత్రం :-    పూ.షా  రాత్రి 2.06 ని.వరకు
యోగం:- శుభం ఉ॥7.53 ని.వరకు తదుపరి శుక్లం తె.5.03 ని.వరకు
కరణం:- గరజి ఉ॥5.45 వణిజి సా॥4.39 ని.వరకు భద్ర(విష్టి) తె.3.33
అమృత ఘడియలు:-  రాత్రి 9.33 ని.ల 11.04 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08:03 ని.ల ఉ.08:56 ని. వరకు తిరిగి రా.10:51 ని.ల రా.11:35 ని.వరకు
వర్జ్యం:- ప॥12.28 ని.ల 1.59 ని.వరకు
రాహుకాలం:మ.03:00ని. నుండి సా.04:30ని. వరకు
యమగండం:ఉ.9.00ని. నుండి ఉ. 10:30ని. వరకు
సూర్యోదయం :        5.28 ని॥లకు
సూర్యాస్తమయం:    6.28  ని॥లకు


ఈరోజు దినఫలం మరియు తారాబలం. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితము చూసుకొని వ్యవహరించండి.  శుభ ఫలితాలు పొందండి.
           సర్వేజనాః సుఖినోభవంతు
 

213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దిన ఫలం:-శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు . విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు . స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు . వృత్తి వ్యాపారం వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది . సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి .ఈ రాశి వారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దిన ఫలం:-మంచి విషయాలు తెలుస్తాయి.  ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు . జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది . నూతన పరిచయాలు కలిసి వస్తాయి . సోదరి సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది .  వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ధన లాభం కలుగుతుంది.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి పనులు ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు .ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దిన ఫలం:-విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల యందు ఊహంచన ధన లాభం కలుగుతుంది . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగమునందు అధికారాల యొక్క స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దిన ఫలం:-శారీరకంగా బలహీనంగా ఉంటుంది .  పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు రావచ్చు . కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి. నిత్యంమీతో పాటు ఉండే వారి తోటి విరోధాలకు దూరంగా ఉండడం మంచిది . అనవసరమైన ఖర్చులు పెరగకుండా  జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈరోజు(పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దిన ఫలం:-ఇతరుల యొక్క విషయాల యందు దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను. చేయ పనులయందు ఆసక్తి లేకుండా ఉండుట . చేయ పనివారితో టి ఇబ్బందులు ఏర్పడతాయి . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో  అవమానములు కలిగి గౌరవం తగ్గుతుంది . మనస్సు ఆందోళనగా ఉంటుంది . ఆరోగ్యం సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతోటి మాట పట్టింపులు వస్తాయి . ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని వలెను . వృత్తి వ్యాపారముల యందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది .ఈ రాశి వారు ఈరోజు ఓం రుద్రాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం . తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములు యందు సామాన్యమైన లాభం కలుగును . అనవసరమైన ఆలోచనయందు దూరంగా ఉండండి . ఆరోగ్యము విషయం లో ఇబ్బందులు ఏర్పడవచ్చు . అనవసరమైన ప్రయాణాలు చికాకుగా ఉంటుంది.  మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఆవేశంతో వాదనలు వలన సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును . ఓం హిమగర్భాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దిన ఫలం:-అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి . ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి . వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్తసమస్యలు ఏర్పడతాయి .మనసునందు అనేకమైన ఆలోచనతోటి ఆందోళనగా ఉంటుంది . బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాదన వేయడం మంచిది కాదు. రావలసిన బాకీలు తిరిగి లభించగలవు. శ్రీ రాహు మూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులు పూర్తి అగును. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. వ్యవహారము నందు ప్రతిపందకాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనుకోని సమస్యలు ఏర్పడి బాధ కలిగించును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీనత ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓం మహీసుతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఎన్ని అవాంతరాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేయవలెను. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల  తీరు ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగము నందు అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓం నీలకంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందం

ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)


దిన ఫలం:-వృత్తి వ్యాపారాలందు ఊహించని ధన లాభం కలుగును. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. చేయు ఖర్చు యందు అప్రమత్తత అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానములు మానాలు పొందగలరు. ఈ రాశి వారు  ఈరోజు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-వృత్తివ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండండి. మానసికంగా బలహీనత ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు యందు సమయస్ఫూర్తితోటి వ్యవహరించవలెను. చేయని పొరపాటులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్య మీద శ్రద్ధ వహించవలెను. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. ఉద్యోగమునందు  అధికారులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (విపత్తార): మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories