MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త

Today Horoscope: ఓ రాశివారు ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)  

6 Min read
Author : Navya G
Published : Feb 06 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:                                            
 తేది : 6 ఫ్రిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘం
ఋతువు : శిశిరం
పక్షం : కృష్ణపక్షం                                                                                       
వారము.సోమవారం
తిథి పాడ్యమి రాత్రి 01:16ని వరకు
నక్షత్రం :. ఆశ్లేష మధ్యాహ్నం 02:31 ని   వరకు
వర్జ్యం:   తెల్లవారుజామున 03:42 నుండి 5:28   ని వరకు
దుర్ముహూర్తం:మ.12.36ని. నుండి మ.01.21ని. వరకు తిరిగి మ.02.52ని. నుండి మ.03.37ని. వరకు
రాహుకాలం:మ.01.30ని నుండి మ.03.00ని వరకు
యమగండం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.35ని.లకు
సూర్యాస్తమయం: సా.05.53ని.లకు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఆదాయనికి మించి ఖర్చులు పెరుగును.. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.మానసిక సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈ రోజు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. తలపెట్టిన పనులు పట్టుదల తోటి అనుకున్న సమయానికి పూర్తి చేయవలెను. సోదరులతోటి ఆస్తి వివాదాలు ఏర్పడగలవు. ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం మీకు అంత అనుకూలమైనది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. కుటుంబ వాతావరణ గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారమునందు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభించదు. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. అనవసరమైన విషయాలలో జోక్యం తగదు. పని వారి తోటి ఇబ్బందులు కలగవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి.ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని ఆటంకాలు ప్రతిబంధకాలు ఏర్పడను. ఇతరులు పై మీ అభిప్రాయాలు తారుమారు అవును.ఉద్యోగమునందు పని ఒత్తిడి ఎక్కువగా ఉండను. ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ఈ రోజు ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తారుమారు అగును. బంధువర్గం తోటి అకారణంగా వివాదాలు చోటు చేసుకుంటాయి.ఉద్యోగాల్లో అధికారులు తోటి ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట బాధ్యతలు భారంగా నుండును. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా వాటిని పట్టుదలతోటి పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగము నందు సమస్యలు కలవరము పెట్టును. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
వ్యాపారము నందు పెట్టుబడుకు తగ్గ దన లాభం కలుగును‌. రావలసిన బాకీలు పశువులగును. సమాజము నందు ప్రతిభావంతులగా గుర్తింపు పొందుతారు. కీలకమైన సమస్యలు వివాదాలు పరిష్కారమగును. ఉద్యోగము నందు గౌరవ మర్యాదలు అనూహ్యంగా పెరుగును. చేయ పని యందు లేదా పనిముట్ల యందు తగు జాగ్రత్తలు తీసుకునవలెను. ఎంతటి వారినైనా సరే మీ మాటలతోటి ఆకట్టుకుంటారు. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సంఘము నందు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. కీలకమైన పనుల్లో విజయం సాధిస్తారు. కేసులు వివాదాలు పరిష్కారమగును. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగును. ఉద్యోగులు ఉద్యోగమునందు నూతన ఉత్సాహంతో ముందుకు  వెళతారు. భవిష్య త్తు గూర్చి ఆలోచనలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓంబృగువె నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగము నందు ఒడిదుడుకులు తొలగి ప్రశాంతత లభించును.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగును.ఆదాయ మార్గాలు పై అన్వేషణ చేస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగును.సోదరులతో ముఖ్యమైన విషయాలు గూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మీవంతు సహాయ సహకారాలు అందిస్తారు. మానసిక ప్రశాంతత లభించును.మిత్రులతోకలసి విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారాల యందు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.  మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. . ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపంలోకి తీసుకుని వస్తారు.   నిరుద్యోగ ప్రయాత్నాలు ఫలించును. బంధువర్గం నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.  దైవ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యా విషయాలలో ప్రతిభ కనబరుస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగమునందు సంతోషకరమైన వార్తలు వింటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న  సమస్యలు పరిష్కారం మై ప్రశాంతత లభించును. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులకు బంధువులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థిక వ్యవహారాలు లో సమస్యలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో టి మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగమునందు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. తోటి వారి తోటి సఖ్యతగా ఉండవలెను. వ్యాపార విషయంలో ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. పరిస్థితులు అనుకూలించక తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్న సమస్యలు మానసికంగా బాధ కలుగుతుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సన్నిహితులు వివాదాలు పరిష్కారం లభిస్తుంది. ఉంటుంది.  స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు. ఉద్యోగమునందు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగును.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంఘము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. గృహమునందు సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈరోజు ఓం కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
తలపెట్టిన పనులు విజయవంతంగా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజము నందు మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారమునందు అభివృద్ధి కనబడుతుంది.ఆర్థిక వ్యవహారాలుఆర్థికం వ్యవహారాలు సాఫీగా సాగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓంఅష్టలక్ష్మియై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved