ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ప్రతిభకు తగిన గౌరవం, ధన లాభం
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందుకుంటారు. దేవాలయ సందర్శన. ధర్మకార్యాలు చేస్తారు. ఉద్యోగమునందు కొన్ని ఇబ్బందులు కలిగిన ఉత్సాహంతోటి ముందుకు సాగుతారు.
daily horoscope
పంచాంగం :
తేది :4 నవంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీక మాసం
ఋతువు : శరదృతువు
పక్షం : శుక్లపక్షము
వారము: శుక్రవారం
తిథి : ఏకాదశి రాత్రి 7. 01 ని వరకు
నక్షత్రం :. పూ.భా రాత్రి 1.48 వరకు
వర్జ్యం: ఉ 8.56 ల 10.27 వరకు
దుర్ముహూర్తం:ఉ.08.20ని.నుండి ఉ. 09.05ని.వరకు తిరిగి మ.12.07ని. 12.53
రాహుకాలం:ఉ.10.30ని.నుండి మ. 12.00ని. వరకు
యమగండం: మ.3.00ని. నుండి సా. 4.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 6:03ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05.25
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శుభవార్తల వింటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసివస్తుంది. ఇతరులకు సలహాలిచ్చి ఇబ్బందులకు గురికాకండి. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి నూతన కార్యాలకు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలు ముందు ధన లాభం కలుగును. తలపెట్టిన పనులతో విజయం సాధిస్తారు. ఉద్యోగుమునందు అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉండను.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ప్రారంభించి ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందుకుంటారు. దేవాలయ సందర్శన. ధర్మకార్యాలు చేస్తారు. ఉద్యోగమునందు కొన్ని ఇబ్బందులు కలిగిన ఉత్సాహంతోటి ముందుకు సాగుతారు. క్రయ విక్రయాలు యందు ఆచితూచి అడుగు వేయవలెను లభించును. దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఉపశమనం.ఏ ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం. చేసుకొనవలెను
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
పనులు మందకొడిగా సాగుతాయి. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నూతన మిత్రుల పరిచయమై సాయం అందిస్తారు. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. వాహన యోగం. కాంట్రాక్టులు పొందుతారు. ప్రయాణాలలో లాభాలు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు.ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది.ఉద్యోగాలలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సంతానం నుండి ధన వస్తు లాభం పొందుతారు.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల కలయిక. విదేశాలు వెళ్ళాలి అనే అలోచనను క్రియారూపంలో పెట్టండి. స్నేహితులు, బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. ఆర్దికాభివృద్ధి సాధిస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పెట్టుబడులకు తగిన లాభాలు. సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నూతన వస్తు,వాహన ప్రాప్తి. వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లుతప్పవు. ఉద్యోగులకుపదోన్నతులు . కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్దిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనదంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల అభివృద్ధి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మీ మనోసిద్దికి ఇది సరైన సమయం అని గమనించగలరు. ప్రముఖుల కలయికతో మీ పనులు సానుకూలమవుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయిన తొలగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చిక్కులు. ఆకస్మిక ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. పాత వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తేగలగుతారు. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు. బంధువులను కలిసి ఆనదంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థిక లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆరోగ్యం పట్లశ్రద్ద అవసరం.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధుమిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనవసర విషయాలతో సమయం వృధా చేయకండి. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. క్రీడల పట్ల, వస్తువుల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. వృత్తి వ్యాపారమునందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించవలెను. ప్రయాణాలలో తగు జాగ్రత్త తీసుకొని వలెను