ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ఉద్యోగంలో ఒడిదుడుకులు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును.
పంచాంగం :
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీక మాసం
ఋతువు : శరదృతువు
పక్షం : శుక్లపక్షము
వారము: గురువారం
తిథి : దశమి రా . 8.50
నక్షత్రం :శతభిషం రా 22.49వరకు
వర్జ్యం: ఉ 10.54 ల 12.25 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9. 50ని నుండి 10.36ని వరుకు తిరిగి మ. 02.23 నుండి 3.09ని వరకు.
రాహుకాలం: మ. 1.30ని.నుండి మ. 3.00ని. వరకు
యమగండం: ఉ. 6.00ని. నుండి ఉ. 7.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 6: 03ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5.26
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి . సాహస ప్రయత్నాలు విరమించండి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. అనవసర ఖర్చులను పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో టి పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. అనవసర ఆలోచనతో టి సమయాన్ని వృధా చేయకండి.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను . ఇంకా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతోటి మనస్పర్ధలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును . ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు యందు జాగ్రత్తవసరం. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
కోపాన్ని అదుపులో ఉంచుకొని వలెను. వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. బంధు మిత్రుల కలయికమీకెంతో సంతృప్తి కానవస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందు లెదుర్కుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది.వ్యాపారులో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చేయ పనుల యందు సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను. ఇతరులతోటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. భూగ్రహ కరవేకర్యాలు లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది .
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి. . స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందని. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. నూతన పరిచయాలు లాభం కలిగించును.చెడు ఆలోచనలకు దూరంగా ఉండండివృత్తి వ్యాపారలయందు కష్టపడిన ధన లాభం కలుగును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చ చేస్తారు.ఉద్యోగమనందు సహోద్యోగులు నుండి మంచి సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంఘము నందు నీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంద
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.స్త్రీలకు షాపింగ్‌లో నాణ్యతను గయనించాలి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన బకాయిలను వసూలు చేసుకోవాలి. పోయిన వస్తువులు దొరకవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. భూ గృహ క్రయ విక్రయాలు అనుకూలం. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత లభించును.
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసర ప్రయాణాలు. మానసికంగా బలహీనంగా ఉంటుంది. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఇతరులతోటి వాదనకు దూరంగా ఉండండి. చేయ పనులు యందు ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్యము నందు జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారం నందు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగమునందు అధికారుల యొక్క పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులుగా ఉండును. మానసికంగా బలహీనంగా ఉంటుంది . అనవసరమైన ఖర్చులు ఏర్పడవచ్చును.వృత్తి వ్యాపారంలో ఉందో కష్టానికి ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములు లభించును. సంతానమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు . మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందించండి. సంఘమునందు చేయ వ్యవహారములు తెలివిగా వ్యవహరించవలెను .
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ఖర్చులు చేస్తారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీడియా రంగాల వారికి పనిభారం అధికం. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవును. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా జరుగును .అనవసరమైన ఆలోచనలు తోటి వృధాగా కాలాన్ని గడపకండి. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును. ఇతరులతోటి వాదనలు మానండి. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తగా తీసుకొనవలెను.
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఆదాయ మార్గాలు బాగుంటాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబం నందు శుభకార్య ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూడండి. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గూర్చి ఆలోచనలు చేస్తారు .