MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి ఈ రోజు  ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

6 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2023, 04:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Daily Horoscope

Daily Horoscope

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:     
తేది :  31    మార్చి 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :    శుక్ల పక్షమ                                                                                     
వారము: శుక్రవారం
తిథి :   దశమి రాత్రి 1.56 ని. వరకు
నక్షత్రం : పుష్యమి రాత్రి 2.04 ని. వరకు 
 వర్జ్యం:   ఉదయం 8.22 ని ల 10.08 ని. వరకు 
అమృత ఘడియలు:. సాయంత్రం 6.59 ని ల 8.45 ని. వరకు
దుర్ముహూర్తం:ఉ.08.25ని. నుండి ఉ.09.14ని. వరకు తిరిగి మ.12.28ని. నుండి మ.1.16 ని. వరకు
రాహుకాలం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
యమగండం: మ.3.00ని. నుండి సా.4.30ని. వరకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ఖర్చులు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవును. విందులు  వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా జరుగును .అనవసరమైన ఆలోచనలు తోటి  వృధాగా కాలాన్ని గడపకండి. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి.  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును.  ఇతరులతోటి వాదనలు మానండి.  వాహన ప్రయాణాలు విషయంలో  తగు జాగ్రత్తగా తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం నవదుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి . అనవసర ఖర్చులను పెరగకుండా  తీసుకోవాలి. కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో టి పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. అనవసర ఆలోచనతో టి సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు ఈరాశి వారు ఓం చండికాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి  చికాకులుగా ఉండును. మానసికంగా బలహీనంగా ఉంటుంది . అనవసరమైన ఖర్చులు ఏర్పడవచ్చును.వృత్తి వ్యాపారంలో ఉందో కష్టానికి ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములు లభించును. సంతానమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు . మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందించండి. సంఘమునందు చేయ వ్యవహారములు తెలివిగా వ్యవహరించవలెను . ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను . ఇంకా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతోటి మనస్పర్ధలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును . ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు యందు జాగ్రత్తవసరం. ఇతరుల  విషయాలలో జోక్యం తగదు. ఈరోజు ఈ రాశివారు ఓం అర్కాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనవసర ప్రయాణాలు. మానసికంగా బలహీనంగా ఉంటుంది.  ఇతరులతోటి వాదనకు దూరంగా ఉండండి. చేయ పనులు యందు ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్యము నందు జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారం నందు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృగవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది.వ్యాపారులో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చేయ పనుల యందు సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను. ఇతరులతోటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. భూగ్రహ కరవేకర్యాలు లాభించును. వాహన‌ మూలక అశాంతి . పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది . ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. నూతన పరిచయాలు లాభం కలిగించును.చెడు ఆలోచనలకు దూరంగా ఉండండివృత్తి వ్యాపారలయందు కష్టపడిన ధన లాభం కలుగును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చ చేస్తారు.ఉద్యోగమనందు సహోద్యోగులు నుండి మంచి సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంఘము నందు నీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారు ఓం పురుషోత్తమాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

కోపాన్ని అదుపులో ఉంచుకొని వలెను. వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి.  ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనులు ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈరోజు ఈరాశి వారు ఓం కుమారాయ నమః  జపించండి శుభ ఫలితాలు పొందండి

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం  ఏర్పడుతుందని. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం పశుపతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఉద్యోగమునందు అధికారుల  పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి  అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం.  ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం. చెడు స్నేహాల వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగం నందు పై అధికారుల వలన చికాకులు. . వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. .ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నూతన వాహనాది విలాస వస్తువులపై అధికంగా ఖర్చు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కార  మార్గాలపై అన్వేషణ చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండును. రావలసిన పాత బాకీలు వసూలు అగును. ముఖ్యమైన విషయాలలో పెద్దవారు యొక్క సలహాలు తీసుకుంటారు. పట్టుదలతో చేసిన పనులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved