MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు  తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి

6 Min read
Author : ramya Sridhar
Published : Oct 27 2022, 04:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

పంచాంగం : 
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీక మాసం
ఋతువు : శరదృతువు
పక్షం :శుక్లపక్షము                                                                                    
వారము: గురువారం
తిథి : విదియ మ.02.03ని. వరకు 
నక్షత్రం : విశాఖ మ.02.18ని. వరకు
వర్జ్యం:సా.06.08ని.ల నుండి 07.40ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉ.09.49ని. నుండి ఉ.10.35ని. వరకు తిరిగి మ.02.28ని.ల నుండి మ.03.01ని. వరకు.
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం : ఉదయం 6.00ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05.29ని.లకు
భగిని హస్త భోజనం 
 

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలుంటాయి శుభవార్తలు వింటారు. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రదేశంలో ఉన్న మీ సంతానం రాక కోసం ఎదురుచూస్తారు. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  గృహము నందు ఆనందకరమైన వాతావరణం చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం  లభించును ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది పెద్దల యొక్క స్నేహాలు లాభించును విందు వినోదాలలో పాల్గొంటారు ప్రయాణాలు లభించును

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈరోజు మీకు సామాన్యంగా ఉంటుంది. ఇంకా బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి సంఘము నందు వాదోపవాదాలు  మనస్సునందు ఆందోళనగా ఉంటుంది దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి  అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు  తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను

514
Zodiac Sign

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రోజు మంచి శుభ ఫలితాలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. బంధువుల కోసం బాగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులకు ప్రశాంతత, నిశ్చింత నెలకొంటాయి. బంధు మిత్రుల కలయిక. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. ఆర్దికాభివృద్ధి సాధిస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పెట్టుబడులకు తగిన లాభాలు. సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈరోజు మీకు శుభ ఫలితాలు మిశ్రమం గా ఉండును. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రదేశంలో ఉన్న మీ సంతానం రాక కోసం ఎదురుచూస్తారు. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు కుటుంబం నందు ప్రతికూల వాతావరణ అనవసరమైన ఖర్చులు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును అనవసర ప్రయాణాలు తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రోజు సామాన్య ఫలితాలు.  గత తప్పిదాలు పునరావృతంకాకుండా తగు జాగ్రత్త వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనచోదకులకు జరిమానాలు కట్టవలసివస్తుంది. ముఖ్యమైన  పనులలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది.ఉద్యోగాలలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సంతానం నుండి ధన వస్తు లాభం పొందుతారు.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రోజు శుభ ఫలితాలు. రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన మిత్రుల పరిచయమై సాయం అందిస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. వాహన యోగం. కాంట్రాక్టులు పొందుతారు. ప్రయాణాలలో లాభాలు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి.  స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఒక వ్యవహారంలో సోదరుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసివస్తుంది.  శుభవార్తలు వింటారు నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అగును ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును  వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది  ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగము నందు పై అధికారుల మన్నన లభించును
 

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈరోజు మీకు సామాన్యంగా ఉండును. రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. కోపదాపాలకు దూరంగా ఉండవలెను చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు పడవచ్చును కొత్తవారితో స్నేహం కొత్త సమస్యలు ఎదురవుతాయి  ఇంటా బయట గొడవలు గా ఉండును సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడవచ్చును చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండునుమనస్సు నందు ఆందోళనగా  ఉంటుంది ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):


ఈరో .జు మీకు సామాన్యం మైన ఫలితాలు అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది.  స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి.  శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడడం అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును సంఘము నందు అవమానం అవమానాలు చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చెడు స్నేహాల వలన కొద్దిపాటి గొడవలు ఏర్పడును     

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈరోజు మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అవును ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి అగును ఇతరులకు సహాయ సహకారములు  చేస్తారు వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును శుభకార్యాలలో చనులు ఫలించును రావలసిన బాకీలు వసూలు అగును ప్రయాణాలు అనుకూలంగా ఉంది ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు  

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈరోజు మీకు సామాన్య  ఫలితాలు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట చెడు స్నేహితులను  దూరంగా పెట్టడం మంచిది చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల   సహాయ సహకారాలు తీసుకుంటారు పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు మనస్సునందు ఆందోళనగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పెద్దలు పట్ల గౌరవం గా ఉండండి సమయానుకూలంగా  తెలివిగా ముందుకు వెళ్లండి ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈరోజు మీకు శుభ ఫలితాలు కలుగును . అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ఈ రోజు ఆనందంగా గడుపుతారు సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు రావలసిన బాకీలు వసూలు అగును నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును విందు వినోదాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved