MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి శుభం జరుగుతుంది...!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి శుభం జరుగుతుంది...!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈరోజు  ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం కలుగుతుంది.

6 Min read
Author : ramya Sridhar
Published : Feb 14 2023, 05:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

పంచాంగం                                                                                                                                                                                                                                             
 తేది :  14ఫ్రిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . మాఘం
ఋతువు : శిశిరం
పక్షం :       కృష్ణపక్షము                                                                                  
వారము: మంగళవారం
తిథి :   నవమి రాత్రి 2:42 ని వరకు
నక్షత్రం :.   అనురాధ రాత్రి 9:38 ని  వరకు
వర్జ్యం:  రాత్రి 2:59 నుండి 4:31ని వరకు
దుర్ముహూర్తం:ఉ.08.48ని. నుండి ఉ.09.34వరకు తిరిగి రా.10.59ని. నుండి రా.11.49ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.12.ని. నుండి ఉ.01.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.32ని.లకు
సూర్యాస్తమయం: సా.05.57ని.లకు                     

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
   
 

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు జరిగే అవకాశం ఉంది. సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం కలుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాలలో అధికారుల పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మనస్సులో ఆందోళన ఉంటుంది. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  ఈ రాశి వారు ఓంమంగళ ప్రదాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఇంట్లో  ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రుల నుంచి సహాయ సహకారములు లభించును. సంఘము నందు మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి .ఈ రాశి వారు ఓంనిశాకరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అవుతాయి . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగాల్లో పెద్దల సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .  ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

శుభవార్తలు వింటారు . నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు . బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం విషయంలో మనసు ప్రశాంతత లభించును . సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది . అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . పెద్దల సహాయ సహకారములు  లభించును . ఈరోజు చాలా ప్రశాంతంగా గడుస్తుంది .  ప్రయాణాలు  చేసే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు ఓం జగన్నాధాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. ధనాదాయం పెంచే ఆలోచనలు చేస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈ రాశి వారు ఓం భార్గవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
పనులకు దూరంగా ఉండటం మంచిది. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పని విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాల్లో  ధన నష్టం ఏర్పడుతుంది.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. సంఘంలో  అవమానాలు ఎదురౌతాయి. ప్రయాణాల్లో  జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును.ఈ రాశి వారు  ఓం ఛాయ పుత్రాయ నమః అనేజపించండి  శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అధికారులతో కొద్దిపాటి విరోధాలు ఏర్పడతాయి. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు చేస్తారు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి ధన నష్టం కలుగుతుంది . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనుకోని కలహాల కారణంగా మనసు చికాకు గా  ఉంటుంది. చెడు స్నేహాలకు  దూరంగా ఉండాలి .  వ్యాపారాల్లో అభివృద్ధి  సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తో చేసే  పనులలో విజయం సాధిస్తారు . మనస్సులో ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమ. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది . పెద్దలు పట్ల గౌరవం గా ఉండాలి . సమయానుకూలంగా  తెలివిగా ముందుకు సాగాలి . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం . ఓం అర్థ శరీరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

 చేసే పనుల్లో కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగులు  ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.  వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త వహించవలెను. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వలెను . ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు. విద్యార్థులు  అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలెను. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతోటి వాదోపవాదములు చేయకండి. ఇంటా బయట మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలలో  పని వత్తడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి   వ్యాపారములు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది.కార్యాలయంలో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగండి. ఈ రాశి వారు ఓంవీరభద్రాయనమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. ఇతరుల  విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల  కొత్త సమస్యలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ  సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఉద్యోగం లో కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి. కొన్ని కీలక మైన సమస్యలను జీవిత భాగస్వామి  సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved