Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు ఎదురౌతాయి..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు ఎదురౌతాయి..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

ramya Sridhar | Updated : Sep 13 2023, 05:16 AM
10 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
venus with Astro signs 28

venus with Astro signs 28

13 సెప్టెంబర్2023, బుధ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం
    మాస శివరాత్రి                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           
తేది :  13సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- నిజ  శ్రావణ మాసము
పక్షం :-  కృష్ణపక్షం                                                          
వారము: బుధవారం
తిథి :-  చతుర్దశి తె. 4.05 ని॥వరకు
నక్షత్రం :-  మఖ రాత్రి 2.36 ని॥వరకు
యోగం:- సిద్ధము తె. 3.48 ని॥వరకు
కరణం:- భద్ర సా॥5.03 శకుని తె. 4.05 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 11.56 ని॥ల 1.43 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:32ని॥వరకు  మ.12:20ని॥వరకు      
వర్జ్యం:- మ॥1.18 ని॥ల 3.04 ని॥వరకు
రాహుకాలం: మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం: ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :        5.51 ని॥ లకు
సూర్యాస్తమయం:     6.02ని॥ లకు

ఈరోజు తారాబలం. వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు.కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.కుటుంబం నందు ఇబ్బందులు ఎదురవుతాయి ప్రశాంతంగా  ఆలోచించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగును జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-వివాహాది శుభకార్యముల ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరికి పూర్తి చేస్తారు. సంఘమునందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అనుకోని విధంగా అధిక ఖర్చులు. ధనాధాయ మార్గాలను అన్వేషిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం రామాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడను.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-సమాజ సేవ లో పాల్గొంటారు.దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన ధనము చేతికి అందుతుంది. బంధువర్గం తోటి పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు రాగలవు. ఖర్చులు యందు నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో ఇతరుల సహకారం లభిస్తుంది.  వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం కాలభైరవాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-పనులు వాయిదా వేసుకోవడం మంచిది.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇంటా బయట  సమస్యలు రాగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన చికాకులు ఏర్పడతాయి. పనులలో అధిక శ్రమ. రుణ బాధలు ఇబ్బంది కలిగించును. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సమాజంలో  అవమానాలు రాగలవు .చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును.  ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని నామస్మరణ చేయుట మంచిది.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరానికి ధనం సమకూరుతుంది. సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలించును.ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రారంభంలో నిలిచిపోయిన పనులకు పరిష్కార మార్గాలు దొరుకును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.ఈరోజు ఈ రాశి వారు ఓం కేతువు నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ఉద్యోగమునందు సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును.గృహం నందు శుభకార్యా చరణ.సంతాన విషయంలో చేయు ప్రయత్నాలు అభివృద్ధి కనపడును. ఆకస్మిక ధన లాభం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగును. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గౌరీ దేవ్యై నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అగును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును.మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో  విజయం పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి . ఆరోగ్యంగా బాగుంటుంది . అధికారులతో స్నేహం పెంపొందించుకుంటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం సోమాయ నమఃఅని నామస్మరణ చేయుట మంచిది.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఆరోగ్య విషయాలు బాగుండను. బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాది ప్రయత్నాలు ఫలించును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా అన్ని విధాల బాగుండును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు.ఈరోజు ఈ రాశి వారు ఓంగురవే నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.
పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు.సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారుల అండ దండలు లభిస్తాయి.విద్యార్థులు చదువులో రాణిస్తారు.సంఘంలో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో అకారణంగా మనస్పర్ధలు రాగలవు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ప్రతి విషయంలో నిరుత్సాహంగా ఉంటుంది. ప పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు.
ఈరోజు ఈ రాశి వారు ఓం రామదూతాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను. వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలుఎదురైన పూర్తి చేస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి.నూతన ప్రయత్నాలు ఈరోజు  వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడిలు పెరుగును.ఖర్చులు తగ్గించు కొనవలెను. వ్యవహారాల  విషయాలలో గందరగోళంగా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం పార్వతి పుత్రాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.అవసరాలకు సరిపడా ధనం సమకూరుతుంది. వివాహ ప్రయత్నాలు ప్రతిబంధకాలు ఉండును.కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం నారసింహాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories