MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం

Today Horoscope: ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

5 Min read
Author : ramya Sridhar
Published : May 31 2022, 04:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
astrology thumb

astrology thumb

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

పంచాగం

 తేది : 31, మే 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : పాడ్యమి సాయంత్రం.5.14ని.ల వరకు
నక్షత్రం : రోహిణి ఉదయం 8.40ని.ల వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 02:51 ని॥ నుంచి సాయంత్రం 04:37 ని॥ వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 08:03ని.ల నుంచి ఉదయం 08:55ని.లవరకు తిరిగి రాత్రి 10.50ని.ల నుండి 11:34 వరకు
పితృ తిథి పాడ్యమి.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 ని.ల నుంచి  సాయంత్రం 4 : 30 ని.ల వరకు
యమగండం : ఉదయం 09:00ని.ల నుంచి ఉదయం 10:30ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:28 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:26ని.ల వరకు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Aries

Aries

 
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-   

అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  నూతన గృహయోగాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. రాజకీయవర్గాలకు ఉత్సాహం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

313

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.
 

413

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సత్కారాలు. రాజకీయ నాయకులకు గౌరవ పదవులు. పారిశ్రామికవర్గాల కోరిక నెరవేరుతుంది. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు.

513

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.
 

613

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు.  ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. 
 

713

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

 ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.  వారం మధ్యలో వ్యయప్రయాసలు.మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. 

813

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు. అన్ని పనులకు అనుకూలం. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.

913

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళాకారులకు సభా మర్యాద, సత్కారాలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.

1013

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

అనవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. . మీ ఆలోచనలు ఆప్తులతో పంచుకుంటారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. వాహనయోగం.  ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.

1113

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం.  స్థిరాస్తి విషయంలో ఊహించని ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.

1213

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు.పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు.  జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
 

1313

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు.  వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved