మసాజ్ విషయంలో ఏ రాశివారు ఎలా ఫీలౌతారంటే..!
హెడ్ మసాజ్, బాడీ మసాజ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్. అయితే... ఈ మసాజ్ విషయంలో ఏ రాశివారు ఏం కోరుకుంటారో ఓసారి తెలుసుకుందాం..

శరీరం అలసిపోయినప్పుడు మనలో చాలా మంది హెడ్ మసాజ్, బాడీ మసాజ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్. అయితే... ఈ మసాజ్ విషయంలో ఏ రాశివారు ఏం కోరుకుంటారో ఓసారి తెలుసుకుందాం..
1.మేష రాశి..
మసాజ్ చేయించుకోవడం వల్ల ఫీలింగ్ బాగుందని ఈ రాశివారు ఫీలౌతారు. కానీ... మసాజ్ థెరపిస్ట్ ముందు మాత్రం ఈ రాశివారు కాస్త ఇబ్బందిగా ఫీలౌతారు. ఎవరో తెలియని వ్యక్తికి బాడీ చూపించడం వీరికి తొందరగా నచ్చదు.
2.వృషభ రాశి..
ఈ రాశివారికి మసాజ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ.. ఆ మసాజ్ ఎవరో థెరపిస్ట్ తో చేయించుకునే కంటే... తమ జీవిత భాగస్వామి తో చేయించుకుంటే బాగుండని ఈ రాశివారు భావిస్తారు.
3.మిథున రాశి...
మిథున రాశివారికి మసాజ్ చేయించుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. తమ ఇంట్లో మసాజ్ చేయించుకుంటుున్నా కూడా.. థాయిలాండ్ లో చేయించుకున్నట్లుగా ఫీలౌతారు.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు కూడా మసాజ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ మసాజ్ చేసుకోవడం వల్ల శరీరం చాలా ఉల్లాసంగా ఉందన్నట్లు వీరు ఫీలౌతారు. ప్రతి వారం కర్కాటక రాశి వారు మసాజ్ చేసుకోవాలని ఇష్టపడతారు. మసాజ్ తర్వాత.. ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటారు.
5.సింహ రాశి..
సింహ రాశివారు తాము మసాజ్ చేయించుకున్న తర్వాత... ఇది చాలా హాయిగా ఉందని... వాళ్ల అమ్మని కూడా ఇదే రకం మసాజ్ చేయించుకోవాలని సూచిస్తారు. మసాజ్ ఆగకుండా చేయించుకోవాలని వీరు అనుకుంటారు.
6.కన్య రాశి..
మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరం చాలా ఫ్రీగా ఉందని.. ఒత్తిడి మొత్తం తగ్గిపోయిందని ఈ రాశివారు ఫీలౌతారు. ఈ మసాజ్ చేస్తున్న సమయంలో ఓ చిన్న పాటి నిద్రపోవాలని ఈ రాశివారు భావిస్తారు.
7.తుల రాశి..
మసాజ్ థెరపిస్ట్ మసాజ్ చాలా బాగా చేశారు.. కానీ... ఇది చాలా ఖర్చు ఎక్కువతో కూడుకున్న విషయంగా వీరు భావిస్తారు. కానీ ఖర్చు తగినంత ఫీల్ మాత్రం వచ్చిందని భావిస్తారు.
8.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారు తమకు మసాజ్ చేయడానికి వచ్చిన వారితో ఈ రాశివారు కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటారు. ఈ టెక్నిక్స్ ని తమ జీవిత భాగస్వామి పై ఉపయోగించాలని ఈ రాశివారు అనుకుంటారు.
9.ధనస్సు రాశి..
పని ఒత్తిడి తో బాధపడుతన్న సమయంలో.... మసాజ్ చేయించుకుంటే ఈ రాశివారు వెంటనే ఇదికదా ఈ సమయంలో మాకు కావాల్సింది అనిఈ రాశి వారు భావిస్తారు.
10.మకర రాశి..
మసాజ్ చేయించుకున్న తర్వాత ఈ రాశివారు పని నుంచి బయటపడటానికి ఇదే కదా కావాల్సింది అని భావిస్తారు. కనీసం నెలకు ఒకసారి ఈ మసాజ్ చేయించుకోవాలి అని ఈ రాశివారు భావిస్తారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు మసాజ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువగా ఈ మసాజ్ ని కాలి మడమల దగ్గర స్పెషల్ గా చేయించుకోవాలని ఈ రాశివారు భావిస్తారు.
12.మీన రాశి..
మీన రాశివారు మసాజ్ ని బాగా ఫీలౌతారు. తమ పార్ట్ నర్ కూడా తమకు మసాజ్ ఎంత అవసరమో అర్థం చేసుకుంటే బాగుండని కోరుకుంటారు.