Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి కోరికలు ఎక్కువ, ఏ ఉద్యోగం సరిగా చేయలేరు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, మనం పుట్టిన తేదీ ఆధారంగా చేసుకొని , మన భవిష్యత్తు మాత్రమే కాదు.. మన అలవాట్లు, బలహీనతలు కూడా తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారి అలవాట్లు ఇప్పుడు చూద్దాం..

నెంబర్ 2...
న్యూమరాలజీ ప్రకారం..ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేక లక్షణాలు, అలవాట్లు కలిగి ఉంటారు. అయితే, వారిలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. వాటి కారణంగానే.. ఎంత కష్టపడినా కూడా గుర్తింపు తెచ్చుకోలేరు.
వెంటనే విసుగు వచ్చేస్తుంది....
సంఖ్యాశాస్త్రం ప్రకారం, నెంబర్ 2 కి చెందిన వ్యక్తులు ఏ విషయంలో అయినా ఎక్కువ కాలం ఆసక్తి చూపించరు. వారి కోరుకున్నది జరగగానే.. దాని మీద ఆసక్తి పోతుంది. అంతే... వారి ఆసక్తి మరో విషయం వైపు టర్న్ తీసుకుంటుంది. ఈ అలవాటు కారణంగా... ఈ తేదీల్లో పుట్టిన వారు దేన్ని పూర్తిగా నేర్చుకోలేరు. ఏ ఉద్యోగం కూడా నిలకడగా చేయలేరు. కొద్ది రోజులు చేయగానే వారికి బోర్ కొడుతుంది. మరో ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెడతారు.
అతిగా ఆలోచిస్తారు....
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు అవసరానికి మించి.. అతిగా ఆలోచిస్తారు. ఏ విషయంలోనూ తొందర పడి నిర్ణయాలు తీసుకోరు. అత్యవసరం అయినా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకపడతారు. చివరి నిమిషం వరకు ఆలోచిస్తూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. వీరి సగం జీవితం ఆలోచనల దగ్గరే ఆగిపోతుంది.
కోపం చాలా ఎక్కువ...
ఇక, ఈ తేదీల్లో పుట్టిన వారికి కోపం కూడా చాలా ఎక్కువ. అది కూడా చాలా వెంటనే వచ్చేస్తుంది. కోపంలో ఎదుటివారిని కొట్టడానికి కూడా వెనకాడరు. వీరికి నోటికంటే ముందు చేతులే పైకి లేస్తాయి. కొట్టలేని స్థితిలో ఉన్నప్పుడు దుర్భాషలాడతారు. దారుణమైన పదజాలంతో దూషిస్తారు. వీరి కోపాన్ని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు.
ఇతరులకు సహాయం చేయడం...
ఈ నెంబర్ 2 కి చెందని వారు సొంత పని కంటే.. ఇతరుల పనులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. ఎదుటివారి కోసం తమ పనులను కూడా నిర్లక్ష్యంచేస్తూ ఉంటారు. ఇతరుల అవసరాలను తీర్చడంలో ముందుంటారు.ఈ గుణం కారణంగా, చాలా మంది తమ సొంత అవసరాల కోసం వాటిని దుర్వినియోగం చేస్తారు.
ఆత్మవిశ్వాసం తక్కువ..
ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగానే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటారు. కానీ వారు ఇతరుల ముందు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు. వివాహం తర్వాత, వారు తమ భాగస్వామి సహాయంతో సమయం గడుపుతారు. వారికి ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఒంటరిగా ఉండటం పట్ల వారు చింతిస్తారు.
ఒత్తిడి ఎక్కువ...
అంతేకాదు, ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు.. ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. వారికి చిన్న సమస్యను కూడా ఎదుర్కొనే శక్తి ఉండదు. వారు వెంటనే ఏడుస్తారు. సంక్షిప్తంగా, వారు కూడా మృదువైన హృదయులు. వారు తమ జీవితమంతా విచారంలో గడుపుతారు.