ఈ రాశివారు చిన్న విషయానికే పెద్ద డ్రామా చేసేస్తారు..!
అందరి మధ్య గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. అలా వారు చేయడానికి వ్యక్తిత్వం, స్వభావం కారణమౌతాయి. వారు చేసే ఆ డ్రామా చాలా మందికి మింగుడు పడదు. అతిగా అనిపిస్తూ ఉంటుంది.

అక్కడ ఏమీ ఉండదు. కానీ కొందరు దానికే పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు. అతిగా బిహేవ్ చేస్తుంటారు. అందరి మధ్య గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. అలా వారు చేయడానికి వ్యక్తిత్వం, స్వభావం కారణమౌతాయి. వారు చేసే ఆ డ్రామా చాలా మందికి మింగుడు పడదు. అతిగా అనిపిస్తూ ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అలాంటి రాశులవారేంటో చూద్దాం..
మేషరాశి..
ఈ రాశివారు ప్రతి విషయాన్ని నాటకీయంగా మార్చాలని చూస్తుంటారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేయడానికి నాటకీయత ప్రదర్శిస్తూ ఉంటారు. దానిని వారు ఒక విజయంగా భావిస్తూ ఉంటారు.
వృషభరాశి..
ఈ రాశివారు తాము కోరుకున్న విషయాలపై పట్టు సాధించేలని సమయంలో.. విజయం సాధించలేము అనుకున్నప్పుడు డ్రామా చేయడం మొదలుపెడుతుంటారు.
కర్కాటక రాశి..
ఎదుటి వారిని తమ గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి వీరు నాటకాలు ఆడటం మొదలుపెడతారు. వారి నుంచి సపోర్ట్ కోసం వీరు ఏదైనా చేస్తారు.
మకర రాశి..
ఈ రాశివారికి నాటకాలు ఆడటం అంటే చాలా ఇష్టం. నాటకాలు ఆడి తమ పనిని పూర్తి చేసుకుంటారు. ఎదుటివారితో పని చేయించుకోవడానికి వారు ఎన్ని వేషాలైనా వేస్తారు.
వృశ్చిక రాశి..
వారు జీవితంలో కోరుకునే విషయాల చుట్టూ చాలా డ్రామా సృష్టిస్తారు. వృశ్చిక రాశి చాలా డ్రామా సృష్టించడం ద్వారా వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడే అనేక పరిచయాలను పొందగలుగుతారు.