ఓవరాక్షన్ చేసేవారు ఈ రాశివారికి అస్సలు నచ్చదు..!
అలా డ్రామాలు చేసేవారికి కొందరు ఇట్టే ఆకర్షితులౌతూ ఉంటారు. కానీ కొందరికి అస్సలు నచ్చదు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అనవసరపు డ్రామాలు నచ్చనివారు ఎవరో చెప్పేయవచ్చట. వారెవరో ఇప్పుడు చూద్దాం..

మీరు గమనించారో లేదో.. చాలా మంది తమను అందరూ గుర్తించాలని అవసరం లేకున్నా డ్రామాలు చేస్తూ ఉంటారు. అయితే.. అలా డ్రామాలు చేసేవారికి కొందరు ఇట్టే ఆకర్షితులౌతూ ఉంటారు. కానీ కొందరికి అస్సలు నచ్చదు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. అనవసరపు డ్రామాలు నచ్చనివారు ఎవరో చెప్పేయవచ్చట. వారెవరో ఇప్పుడు చూద్దాం..
1.సింహరాశి..
సింహ రాశివారికి నాటకాలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. పనికిరాని పనులు చేస్తూ.. సమయాన్ని, శక్తి ని వృథా చేయకూడదు అని ఈ రాశివారు అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి జీవితంలో చాలా కష్టపడతారు. వీరు తమ జీవితంపైనే దృష్టిపెడతారు. కాబట్టి.. నాటకాలు ఆడేవారికి దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
2.కన్య రాశి..
కొందరు ప్రతి చిన్న విషయాన్ని నాటకాలు ఆడుతూ ఉంటారు. అయితే.. ఆ నాటకాలు కన్య రాశివారికి చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి వారిని చూస్తే నిరాశకు గురౌతూ ఉంటారు. కాబట్టి.. అలాంటివారికి దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
3.ధనస్సు రాశి..
ఈ రాశివారు నాటకాలను పెద్దగా ఇష్టపడరు. అలా నాటకాలు చేయడం వల్ల ఏమీ సాధించలేమని , ఏమీ పొందలేమని వారు భావిస్తూ ఉంటారు. తమ లక్ష్యాలను చేరుకోవడంలో వినోదాత్మకంగా ఆడే నాటకాలు అడ్డుగా ఉంటాయని వారు నమ్ముతుంటారు. అందుకే అలాంటివారికి కూడా దూరంగా ఉంటారు.
4.కుంభ రాశి..
ఈ రాశివారు జీవితంలో ఎలాంటి నాటకీయతను ఇష్టపడరు. వీరు ఇష్టపడకపోవడం మాత్రమే కాదు.. ఇతరులు చేస్తున్నా కూడా ఆపేస్తూ ఉంటారు. నార్మల్ గా ఉండాలని అడుగుతూ ఉంటారు.
5.మీన రాశి..
మీన రాశి వారు నాటకీయంగా ఉండటానికి అనుకూలంగా లేరు ఎందుకంటే నాటకాన్ని కలిగించడం వారి వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వారు భావిస్తారు.