ఈ రాశులవారు నిత్యం తమ పార్ట్ నర్ లో తప్పులు వెతుకుతూ ఉంటారు...!
జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశుల వారు ప్రతి విషయంలో... తమ జీవిత భాగస్వామి విషయంలో తప్పులు వెతుకుతూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా...

couple fight
భార్యభర్తల మధ్య చిన్న మనస్పర్థలు, తేడాలు రావడం చాలా కామన్. కానీ... అలా తేడాలు వచ్చిన సమయంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉంటారు. కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశుల వారు ప్రతి విషయంలో... తమ జీవిత భాగస్వామి విషయంలో తప్పులు వెతుకుతూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా...
సింహ రాశి..
సింహ రాశివారికి అన్నీ తెలుసు. కాదు.. తమకు అన్నీ తెలుసు అనే భావనలో బతుకుతూ ఉంటారు. ఎదుటివారిని ఆకట్టుకునేలా కాకుండా.. తమకు నచ్చినట్లు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారికి ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదు. ఇస్తే వీరికి చాలా ఎక్కువ కోపం వస్తుంది. ఈ రాశివారు నిత్యం.. తమ జీవిత భాగస్వామిలో తప్పులను వెతుకుతూ వారిని విమర్శిస్తూ ఉంటారు. అలా చేయడం వీరికి అలవాటు.
కన్య రాశి..
కన్య రాశి పర్ఫెక్షనిస్టులు. తాము ఉన్నట్లే ఇతరులు కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇతరుల్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి విషయంలో వీరు ఎక్కువగా తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే చాలు వీరు వెంటనే పసిగట్టి.. వారిని విమర్శిస్తూ ఉంటారు.
వృశ్చిక రాశి..
తమ భాగస్వామి లేదా ప్రియమైన వారి గురించి ఆలోచించే వ్యక్తులు మృదువుగా ఉంటారు. కానీ.. తమ జీవిత భాగస్వామి ఎప్పుడైనా విసిగిస్తే మాత్రం.. కోపం తో ఊగిపోతారు. వెంటనే.. వారిలోని తప్పులను గుర్తు చేసి మరీ తిడుతూ ఉంటారు. అతని కఠినమైన మాటలు అతని భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూనే ఉంటారు. వారు కోపంతో వీరిని వదిలేసే అవకాశం కూడా ఉంది.
ధనస్సు రాశి..
వీరు ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటారు. వారు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పరిశీలిస్తారు. దీని కారణంగా, వారు ప్రతి పరిస్థితిని ఖచ్చితంగా సమీక్షించిస్తూ ఉంటారు. వారు వేరొకరి తప్పులను రిమోట్‌గా ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇది నిజానికి మంచి అలవాటే కానీ.. జీవిత భాగస్వామి విషయంలో ఇది వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వారిని బాధిస్తూ ఉంటుంది.