MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారికి కోపమెక్కువ.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాల్సిందే..!

ఈ రాశుల వారికి కోపమెక్కువ.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాల్సిందే..!

కోపం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ కొంతమంది ఏం చేసినా కోపాన్ని మాత్రం కంట్రోల్ చేయలేరు. కానీ కోపం తగ్గిన తర్వాత తమ తప్పును తెలుసుకుంటారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి పట్టరాని కోపం వస్తుంది. 

Shivaleela Rajamoni | Published : Dec 04 2023, 09:52 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

కొంతమందికి తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో బాగా తెలుసు. కానీ కొంతమంది తమ భావోద్వేగాలను అస్సలు నియంత్రించలేకపోతుంటారు. ఆవేశం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఇతరులపై అరుస్తూనే ఉంటారు. కానీ ఈ కోపం తగ్గిన తర్వాత తమ తప్పును తెలుసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు కూడా ఇలాగే ఉంటారు. అంటే వీరికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ సమయంలో కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేరు. ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

24
Asianet Image

మేషరాశి

ఈ రాశి వారు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. అలగే ఎప్పుడూ అజాగ్రత్తగా ఉంటారు. వీళ్లకు ప్రతిదానికి కోపం వస్తుంటుంది. ఈ కోపమే ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. కోపం కారణంగా వీరి సంబంధం ఎంతో ప్రభావితం అవుతుంది. వీళ్లకు కోపం వచ్చినప్పుడు ఎలాంటి కారణం కనిపించదు. అయినా ఇతరులపై అరుస్తూనే ఉంటారు. 
 

34
Asianet Image

వృషభం

ఈ రాశి వారు చాలా మొండి వారు. అలాగే ఎప్పుడూ కోపంగా కూడా ఉంటారు. ఈ రాశి వాళ్లు చాలా త్వరగా కోపగించుకుంటారు. అలాగే వీళ్ల కోపాన్ని తమకు ఇష్టమైన, దగ్గరగా ఉన్న వ్యక్తిపైనే ప్రదర్శిస్తారు. వీళ్లు కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. తమ భాగస్వామి తమను అర్థం చేసుకుంటారని, అలాగే సహనాన్ని కోల్పోయినందుకు వారిని క్షమిస్తారని వీళ్లు మనసులో అనుకుంటారు. కానీ అలా అస్సలు జరగదు. ఇదే వారికి ఎన్నో చిక్కులు  తెచ్చిపెడుతుంది.
 

44
Asianet Image

సింహరాశి

సింహరాశి వారు ఎంతో దయగలవారు. అలాగే వీరిది మృదువైన స్వభావం కూడా. కానీ వీళ్లకు కోపం వచ్చినప్పుడు.. అస్సలు ప్రశాంతంగా ఉండలేరు. అలాగే ఎలాంటి కారణం లేకుండా కోపగించుకుంటారు. అలాగే ఈ వ్యక్తులు ఏ చర్చలోనూ వెనుకడుగు వేయరు. ఎందుకంటే వీరికి ఆ సామర్థ్యం ఉంది. అలాగే వీరు ఇతరులపై ఆధిపత్యం చేస్తారు.

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
జ్యోతిష్యం
 
Recommended Stories
Top Stories