ప్రేమ విషయంలో ఈ రాశులకు అదృష్టం లేదు..!
అలాంటి అద్భుతమైన ప్రేమ అందరికీ దొరకదు. కొందరికి దొరికినట్లే దొరికి దూరమౌతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారికి ప్రేమ విషయంలో పెద్దగా అదృష్టం లేదనే చెప్పాలి.
Love horoscopege 01
ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ప్రతి నిమిషం మన కోసం, మన గురించి ఆలోచించే ఓ వ్యక్తి ఉండటం అనేది ఓ గొప్ప వరమనే చెప్పాలి. కానీ.... అలాంటి అద్భుతమైన ప్రేమ అందరికీ దొరకదు. కొందరికి దొరికినట్లే దొరికి దూరమౌతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారికి ప్రేమ విషయంలో పెద్దగా అదృష్టం లేదనే చెప్పాలి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
telugu astrology
1.మేషరాశి
మేష రాశివారు ఇతరుల పట్ల చాలా విశ్వాసంగా ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువ. చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. అయితే... వీరికి కాస్త కంగారు ఎక్కువ. ఈ కారణంగానే వీరికి తొందరగా బ్రేకప్ లు అవుతూ ఉంటాయి. ఈ రాశివారికి దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం సవాలుగా ఉండవచ్చు. ప్రేమను కనుగొనే అవకాశాలను మెరుగుపరచుకోవడం చాలా అవసరం. ఈ రాశివారు సరైన పార్ట్ నర్ దొరకాలి అంటే... చాలా సమయం వెచ్చించాలి. అలా చేయకపోతే వెంటనే బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభం వారి విధేయత, స్థిరత్వం , ఆచరణాత్మకతకు ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ, వారి మొండితనం, మార్పుకు ప్రతిఘటన కొన్నిసార్లు కొత్త సంబంధాలను ఏర్పరుచుకునే వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో కూడా కష్టపడవచ్చు, వారి భాగస్వాములతో లోతైన స్థాయిలో కనెక్ట్ అవ్వడం వారికి కష్టమవుతుంది. ప్రేమను కనుగొనే అవకాశాలను మెరుగుపరచడానికి, వృషభరాశి వ్యక్తులు కొత్త విషయాలను ప్రయత్నించడానికి, వారి కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి సిద్ధంగా ఉండాలి. వారు మరింత కమ్యూనికేటివ్‌గా ఉండటానికి , వారి భావోద్వేగాలను మరింత స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి కూడా పని చేయాలి.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశి వారికి లవ్ పెద్దగా సక్సెస్ కాదు. ఈ రాశివారు చాలా తెలివిగలవారు. చాలా అనుకూలంగా కూడా ఉంటారు. కానీ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా పరధ్యానంలో ఉంటారు. ఈ కారణం చేతనే వీరికి లవ్ లైఫ్ సెట్ అవ్వదు. ఒకవేళ రిలేషన్ ప్రారంభించినా.. తమ విశ్వసనీయతను నిత్యం నిరూపించుకోవాల్సి రావచ్చు. ఈ రాశివారు ముందు లవ్ లో పడాలంటే... లక్ష్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. వీరు తమ జీవితంలోకి వచ్చే వ్యక్తికి నమ్మకం కలిపిస్తే తప్ప వారి బంధం కొనసాగదు.
telugu astrology
4.కర్కాటక రాశి..
ప్రేమలో దురదృష్టకరమని భావించే మరో రాశిచక్రం కర్కాటక రాశి. ఈ రాశివారు ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇస్తారు. అయినప్పటికీ.. అతిగా ఎమోషనల్ అవ్వడం, పార్ట్ నర్ ని అసలు వదిలపెట్టకపోవడం వల్ల వీరు ఆ బంధానికి దూరమయ్యే అవకాశం ఉంది. వీరి అతి ప్రేమను భరించలేరు. వీరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే తప్ప.. వారి లవ్ లైఫ్ లైన్ లో పడదు.
telugu astrology
5.సింహ రాశి..
ప్రేమను కనుగొనడంలో కష్టపడే మరొక రాశిచక్రం సింహం. సింహరాశి వ్యక్తులు వారి విశ్వాసం, తేజస్సు , సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందారు. అయినప్పటికీ.. ఈ రాశివారి స్వభావం అందరికీ నచ్చదు. వీరు అందరిలోనూ తామే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఈ స్వభావం చాలా మందికి గొంతుదిగదు. అంతేకాదు సింహ రాశివారికి అసూయ కూడా చాలా ఎక్కువ. ఇది వారి సంబంధానికి సమస్యగా మారుతుంది. అందుకే వీరి లవ్ లైఫ్ పెద్దగా వర్కౌట్ అవ్వదు.
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశి ప్రేమను కనుగొనడంలో కష్టపడే మరొక రాశిచక్రం. కన్య రాశి వారు చాలా తెలివిగలవారు.చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అయితే.. వీరు ఎవరినైనా ఇట్టే విమర్శిస్తారు. ఈ విమర్శించే వ్యక్తిత్వం అందరికీ పెద్దగా నచ్చదు. దాని వల్ల లాంగ్ లవ్ లైఫ్ ని వెతక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాశివారు అన్నింట్లోనూ పరిపూర్ణత కోరుకుంటారు. అదేవారికి సమస్య. వీరు లవ్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే... అసంపూర్ణతను కూడా యాక్సెప్ట్ చేయగలగాలి.