Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • తొలిచూపు ప్రేమను ఈ రాశుల వారు అస్సలు నమ్మరు.. దీనిలో మీ రాశి ఉందా?

తొలిచూపు ప్రేమను ఈ రాశుల వారు అస్సలు నమ్మరు.. దీనిలో మీ రాశి ఉందా?

ప్రతి ఒక్కరికీ లైఫ్ లో ఏదో ఒక సమయంలో ప్రేమ ఖచ్చితంగా పుడుతుంది. కొంతమందికి మొదటిచూపులోనే ఒక వ్యక్తిపై ప్రేమ కలుగుతుంది. మరికొందరికి వారితో స్నేహం తర్వాత కలగొచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు తొలిచూపు ప్రేమను అస్సలు నమ్మరు. మరి దీనిలో మీ రాశి ఉందేమో చూసుకోండి. 

Shivaleela Rajamoni | Published : Dec 29 2023, 03:40 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ప్రతి రాశివారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాగే ఇది వారి వ్యక్తిత్వాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. కాగా ప్రేమ అనేది ప్రతి వ్యక్తి భిన్నంగా భావించే సంక్లిష్టమైన, ఒక ప్రత్యేకమైన అనుభూతి. అయితే  కొంతమంది మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. ఇక వారితోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం ఈ మొదటిచూపు ప్రేమను అస్సలు నమ్మరు. దీనిపై నమ్మకమే ఉండదు.  జ్యోతిషశాస్త్రంలో కొన్ని రాశులవారు తొలిచూపు ప్రేమను విశ్వసించరని చెబుతారు. తొలిచూపులోనే ప్రేమను నమ్మే ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26
Virgo daily horoscope

Virgo daily horoscope

కన్యరాశి

ఖచ్చితమైన పరిపూర్ణతకు పేరుగాంచిన కన్యారాశి వారు ప్రేమను విమర్శనాత్మక దృష్టితో చూస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీళ్లు సమయం తీసుకునే, ఆలోచనాత్మక ప్రక్రియను నమ్ముతారు. వీళ్లు ఒకరితో ప్రేమలో పడేముందు వారి గురించి ప్రతి విషయాన్ని ముందే తెలుసుకుంటారు. ఏదేమైనా ఈ రాశివారికి తొలిచూపు ప్రేమపై నమ్మకం ఉండదు. ఇలా లవ్ లో పడరు.
 

36
Scorpio

Scorpio

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారు చాలా సీరియస్ గా, మిస్టీరియస్ గా ఉంటారు. మొదటి చూపు ప్రేమ వీళ్లకు ప్రతికూలంగా అనిపించొచ్చు. ఈ రాశివారు లోతైన, భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటారు. ఇది సమయం, భాగస్వామ్య అనుభవాల ద్వారా మాత్రమే కలుగుతుందని వీళ్లు నమ్ముతారు. వృశ్చిక రాశి వారు కాలక్రమేణా ప్రేమ పొరలను క్రమంగా ఛేదించాలనుకుంటారు.
 

46
Sagittarius

Sagittarius

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి వారు ఎంతో నమ్మకస్తులు. కానీ వీళ్లు ప్రేమను తక్షణ ఆకర్షణతో కాకుండా సాహస భావనతో చూస్తారు. మొదటి చూపు ప్రేమను నమ్మడానికి సంకోచిస్తారు. కాలక్రమేణా ఉద్భవించే భావోద్వేగాలు, అనుభవాలనే నమ్ముతారు. ధనుస్సు రాశి వారు తమ సాహసోపేతమైన వైఖరికి, ఆశావహ దృక్పథానికి సరిపోయే భాగస్వామినే కోరుకుంటారు.
 

56
horoscope today Capricorn

horoscope today Capricorn

మకర రాశి

మకర రాశి వారు ఆచరణాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందారు. మొదటి చూపు ప్రేమ వీళ్లను ఆకర్షించదు. ఎందుకంటే వీరు పరిస్థితులను ఆచరణాత్మక దృష్టితో అంచనా వేయాలనుకుంటున్నారు. నమ్మకం, భాగస్వామ్య విలువల ఆధారంగా సంబంధాలను నిర్మించడానికి సమయాన్ని తీసుకుంటారు.
 

66
Daily Aquarius Horoscope

Daily Aquarius Horoscope

కుంభ రాశి

కుంభ రాశి వాళ్లు స్వతంత్ర, దూరదృష్టి గల స్వభావానికి ప్రసిద్ది చెందారు. అయితే వీరికి మొదటి చూపు ప్రేమ వారి స్వేచ్ఛ, వ్యక్తిత్వానికి భంగం కలిగించినట్టుగా అనిపిస్తుంది. వీళ్లు హఠాత్తు భావోద్వేగాలకు లొంగకుండా భాగస్వామ్య ఆసక్తులు, మేధో ప్రేరణ ఆధారంగా సంబంధాలను నిర్మించాలనుకుంటారు. 
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
జ్యోతిష్యం
 
Recommended Stories
Top Stories