MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Vastu tips: ఇంట్లో ఆర్థిక సమస్యలా..? కారణం ఇదే కావచ్చు..!

Vastu tips: ఇంట్లో ఆర్థిక సమస్యలా..? కారణం ఇదే కావచ్చు..!

ఇంట్లో వాస్తు సరిగా లేకుంటే ఏదో ఒక సమస్య వస్తుంది. వాస్తు అంటే కేవలం ఇంటి గోడలు మార్చడం, పైకప్పు మార్చడం కాదు. దిక్కులతో పాటు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు పరిధిలోకి వస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2022, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా మంది ఆర్థిక సమస్యలతో కష్టపడుతున్నారు. తాము ఎంతో కష్టపడుతున్నామని... జీవితంలో చాలా సంపాదిస్తున్నా కూడా.. సంపద నిలవడం లేదని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. చాలా జీతం వస్తుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో ఉండదు. ఏదో ఒక కారణం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో అనేక సంక్షోభాలకు దారితీస్తుంది. కష్టపడి పనిచేసినా సుఖవంతమైన జీవితం ఉండదు. 

27

డబ్బు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. ధన సమస్యలు, చేతిలో డబ్బు లేకపోవడం, ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో గొడవలు, ప్రశాంతత కోల్పోవడం ఇవన్నీ ఇంటి వాస్తు వల్ల కలుగుతాయి. ఇంట్లో వాస్తు సరిగా లేకుంటే ఏదో ఒక సమస్య వస్తుంది. వాస్తు అంటే కేవలం ఇంటి గోడలు మార్చడం, పైకప్పు మార్చడం కాదు. దిక్కులతో పాటు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు పరిధిలోకి వస్తుంది. ధన సమస్యలకు కారణమేమిటో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని కొన్ని వస్తువులు మీ ఇంటికి డబ్బు రాకుండా నిరోధిస్తాయి.

37


ఇంట్లో డబ్బు సమస్యలను కలిగించే వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం...

ఎండిన పువ్వులు: పువ్వులు శుభ చిహ్నాలు. ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుడిని పూజించేందుకు పూలను ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సాధనం కూడా. ఇల్లు అందంగా కనిపించాలని చాలా మంది పూలను ఇంట్లో అలంకరణగా ఉపయోగిస్తారు. తాజా పువ్వు అయితేనే అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అదే పువ్వు వాడిపోతే ఇంట్లో పెట్టుకోకూడదు. ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి.. వాటికి దూరంగా ఉండాలి.
 

47

మహాభారత చిత్రం: ఇంట్లో మహాభారత చిత్రాన్ని ఉంచడం చాలా అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మహాభారత చిత్రం మీ ఇంట్లో ఉద్రిక్తత, గొడవలు  వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ చిత్రాలను మీ ఇంట్లో పెట్టుకోకండి. అలాంటి చిత్రాలను పడకగదిలో, డ్రాయింగ్ రూమ్‌లో అసతు పెట్టకూడదు. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను కూడా పెంచుతుంది.
 

57

తాజ్ మహల్ ఫోటో: చాలా మంది ఇంట్లో తాజ్ మహల్ పెయింటింగ్ కూడా వేస్తారు. కానీ వాస్తు విశ్వాసాల ప్రకారం, ఈ చిత్రాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అది బేగం ముంతాజ్ సమాధి. ఇంట్లో సమాధి లేదా పెయింటింగ్ ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

67

నిలిచిన నీరు : మీ ఇంటి చుట్టూ నీరు నిలిచినా లేదా ఎక్కడైనా నీరు నిలిచిపోయినా వెంటనే సరిచేయండి. వంటగదిలో, ఇంటి పెరట్లో, బాత్‌రూమ్‌లో నీరు నిలవడం చాలా అశుభం. ఈ ప్రదేశాలలో నీరు నిలవడం వల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు.

77

కుళాయిలో నీరు : మీ ఇంటిలోని కుళాయి నుండి నీరు కారుతున్నట్లయితే, అది చెడిపోయిన సంకేతం కూడా కావచ్చు. వంటగది, బాత్రూమ్ లేదా మరేదైనా కుళాయి నుండి నీరు రావడం చాలా అరిష్ట సంకేతం. ఆర్థిక సమస్యలు తలెత్తే సూచన.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Recommended image3
Shukra Gochar: మార్చిలో ఈ 2 రాశుల వారి జీవితం మార‌నుంది.. నాలుగు సార్లు శుక్ర గ‌హ సంచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved