- Home
- Astrology
- Zodiac signs: ఈ రాశులవారు కలియుగ శకుని.. మన సీక్రెట్స్ తెలుసుకొని మన మీదే ప్రయోగం చేస్తారు..!
Zodiac signs: ఈ రాశులవారు కలియుగ శకుని.. మన సీక్రెట్స్ తెలుసుకొని మన మీదే ప్రయోగం చేస్తారు..!
Zodiac signs: మనం చేసే పనుల వల్ల ఇతరులు బాధపడతారు అనే ఆలోచన వీరికి ఉండదు. ఎవరి గురించి వీరు పట్టించుకోరు. తమకు నచ్చింది.. చేయాలి అనుకున్నది మాత్రమే చేస్తారు. వీరు అన్నీ తమ సొంత ప్రయోజనాల కోసమే పనులు చేస్తారు.

Zodiac signs
మహా భారతంలో శకుని గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరుకు కౌరవుల వైపు ఉన్నాడు. కానీ.. ఆయన కోరుకున్నది కూడా కౌరవుల అంతమే. శత్రువుల పక్కనే ఉంటూ.. శత్రువులను నాశనం చేయడం శకుని నైజం. జోతిష్య శాస్త్రంలో కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న రాశులు కొన్ని ఉన్నాయి. వారు మన పక్కనే ఉంటూ.. మనల్ని ముంచేయాలని చూస్తూ ఉంటారు. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా....
1.మిథున రాశి...
మిథున రాశికి ప్రతి విషయంలోనూ భిన్న మనస్తత్వాలు ఉంటాయి. వీరిది ద్వంద్వ స్వభావం. ఈ రాశివారిని తొందరగా నమ్మడం అంత మంచిదేమీ కాదు. ఎందుకంటే... ఈ రాశివారు ఏవైనా రహస్యాలు పంచుకుంటే... దానిని మనపైనే వ్యతిరేకంగా వాడేయగలరు. మనం చేసే పనుల వల్ల ఇతరులు బాధపడతారు అనే ఆలోచన వీరికి ఉండదు. ఎవరి గురించి వీరు పట్టించుకోరు. తమకు నచ్చింది.. చేయాలి అనుకున్నది మాత్రమే చేస్తారు. వీరు అన్నీ తమ సొంత ప్రయోజనాల కోసమే పనులు చేస్తారు. మహాభారతంలో శకుని కూడా.. మిథున రాశికి చెందినవాడే. కాబట్టి... ఈ రాశివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో ఏదైనా సీక్రెట్ పంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
2.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశి వారు ఎల్లప్పుడూ ఇతరలు చేసే పనుల్లో తప్పులు వెతకడంలో ముందుంటారు. మనం ఈ రాశివారికి ఏదైనా విషయం చెబితే... ఆ విషయాన్ని బట్టి... దానిని మనకు వ్యతిరేకంగా వాడగల సత్తా ఈ రాశివారికి ఉంది. మనకు అనుకూలంగా ఉన్నట్లే ఉంటారు.. కానీ.. ఏదో ఒక రోజు సడెన్ గా ముంచేస్తారు. వారు కుటుంబంలో , కార్యాలయంలో తమకు అనుకూలంగా పనులు చేస్తారు. వృశ్చిక రాశి వారికి లోతైన భావోద్వేగ మేధస్సు , మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల, వారు ఇతరుల బలాలు, బలహీనతలను త్వరగా గుర్తిస్తారు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి ఇతరులను ప్రభావితం చేస్తారు.
మకర రాశి...
మకర రాశి వారు ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఏది ఒప్పో, ఏది తప్పో వీరికి బాగా తెలుసు. వారు ఇతరులు చెప్పే విషయాలను నిశితంగా గమనిస్తారు. ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలను మళ్లీ వారికే వ్యతిరేకంగా మార్చే సామర్థ్యాన్ని మకర రాశివారు కలిగి ఉంటారు. ఎవరినుంచి అయినా ప్రయోజనం పొందాలని భావిస్తే అనేక ఉపాయాలను వాడి మరీ సాధిస్తారు. వారు ఏ పరిస్థితిలోనూ భావోద్వేగానికి గురికాకుండా ఎవరి నుండి అయినా వారు కోరుకున్నది పొందడంలో నిష్ణాతులు. మాటలతో ఇతరుల మనసు మార్చగల శక్తి ఈ రాశివారిలో ఉంటుంది.
తుల రాశి...
తులారాశి వారు దౌత్యవేత్తలు. ఎలాంటి గొడవలు లేకుండా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు తోపులు. తమ మాటలు, చేతలతో అందరినీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు ముందుంటారు. ఎవరిమీద అయినా ఆధిపత్యం చేయగలరు. ఎవరినైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోగలరు. సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం, వారు రెండు వైపులా మాట్లాడటం ద్వారా తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. అన్నీ తారుమారు చేస్తారు.. దేనిని అయినా.. తమకు అనుకూలంగా మార్చుకోగలరు.