Zodiac Signs: ఈ ఐదు రాశుల వారు కచ్చితంగా సొంత ఇంటిని కొని తీరుతారు
కొన్ని రాశుల (Zodiac Signs) వారికి సొంత ఇంటి యోగం ఉంటుంది. కొంతమందికి మాత్రం అద్దె ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సొంత ఇల్లు కచ్చితంగా కొనే ఐదు రాశుల గురించి ఇక్కడిచ్చాము. మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

సొంత ఇల్లు... ఒక కల
ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్న కోరిక ఉంటుంది. అయితే అది జాతకంలో రాసిపెట్టి ఉండాలి. సొంత ఇల్లు కొనుక్కునే యోగం అందరికీ ఉండదు. మీ జాతకాన్ని బట్టి అది సిద్ధిస్తుంది. కొన్ని రాశి చక్రంలోని మార్పులు సొంత ఇల్లు కొనడానికి ప్రత్యేక యోగాలను అందిస్తాయి. అలాంటి యోగాలు కావాలంటే గ్రహాల మద్దతు చాలా అవసరం. 12 రాశుల్లో సొంత ఇల్లు కొనే యోగం ఐదు రాశుల వారికి ఉంది. ఆ ఐదు రాశులు ఏవో ఇక్కడ ఇచ్చామో తెలుసుకోండి. మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారు కచ్చితంగా ఇంటిని కొంటారు. ఎందుకంటే వృషభ రాశిని పాలించేది శుక్రుడు. శుక్రుడు అందానికి, సంపదకు, విలాసవంతమైన జీవితానికి అధిపతి. వృషభ రాశి వారు సహజంగానే ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్లకి పొదుపు చేసే అలవాటు కూడా కచ్చితంగా ఉంటుంది. డబ్బు ఆదా చేయడంలో వీరికి ఆసక్తి ఎక్కువ. వృషభ రాశి వారికి నాలుగవ ఇల్లు బలంగా ఉంటుంది. ఒకరి జాతకంలో నాలుగవ ఇల్లు సొంత ఇల్లు, ఆస్తిని సూచిస్తుంది. కాబట్టి వీరు సొంత ఇల్లును కచ్చితంగా కొనుక్కుంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిని పాలించేది చంద్రుడు. చంద్రుడు భావోద్వేగాలకు, భద్రతకు అధిపతి. అలాగే ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల సంబంధాలతో కూడా ముడిపడి ఉంటాడు. అందుకే కర్కాటక రాశి వారు తమ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. చంద్రుని ప్రభావం కర్కాటక రాశి వారి నాలుగవ ఇంటిపై నేరుగా పడుతుంది. రాశి చక్రంలో నాలుగవ ఇల్లు...సొంత ఇంటిని, భూమిని సూచిస్తుంది. కాబట్టి బి కర్కాటక రాశి వారు కచ్చితంగా సొంత ఇల్లు కొనాలన్న లక్ష్యాన్ని కలిగి ఉంటారు. అలాగే అన్నీ అనుకూలించినప్పుడు, తగిన యోగం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సొంత ఇంటిని కొంటారు.
సింహ రాశి
సింహ రాశి వారికి విలాసవంతమైన జీవితం అంటే ఎంతో ఇష్టం. సింహరాశిని పాలించేది సూర్యుడు. సూర్యుడు నాయకత్వానికి, నమ్మకానికి అధిపతి. సింహరాశి వారికి సొంత ఇంటిని పొందే యోగాలు కచ్చితంగా ఏర్పడతాయి. సూర్యుడు సింహరాశి వారికి ఆర్థికంగా విజయాలను అందిస్తాడు. కాబట్టి సొంత ఇంటిని కొనే స్తోమతను కూడా ఇస్తాడు. సొంత ఇంటికి అవసరమైన ఆర్థిక అవసరాలను సులభంగానే పొందుతారు. కాబట్టి వీరికి సొంత ఇంటి యోగం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారిని పాలించేది కుజుడు. కుజుడు వృశ్చిక రాశి వారికి కృషి చేసే తత్వాన్ని, దృఢ సంకల్పాన్ని, శక్తిని అందిస్తాడు. వృశ్చిక రాశి వారు తమ అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. వారు ఇల్లు కొనాలని అనుకుంటే కచ్చితంగా కొని తీరుతారు. కుజుడు వృశ్చిక రాశి వారి నాలుగవ ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి వీరికి ఇల్లు సిద్ధించే అవకాశం ఎక్కువ. వీరు ఇల్లు కొనాలని ఒక్కసారి అనుకుంటే కచ్చితంగా కొని తీరుతారు.
మకర రాశి
మకర రాశి వారిని పాలించేది శని. అందుకే వీరు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే క్రమశిక్షణగా ఉంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకుంటారు. శని వల్ల వీరికి ఆర్థిక అవసరాల నిర్వహణ, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. మీరు వీరికి కష్టపడి పనిచేసి సంపదను కూడబెట్టే అలవాటు ఉంటుంది. కాబట్టి ఆ డబ్బుతో తాము కోరుకున్న ఇంటిని కొనుక్కుంటారు. అయితే శని దేవుని మద్దతు వీరికి ఎంతో అవసరం. శని దేవుడు పూర్వీకులు ఆస్తిని కూడా వీరికి అందేలా చూస్తాడు.