ఈ రాశులవారు ఎప్పుడూ బాధలోనే ఉంటారు..!
ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని కూడా వీరు భావిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దామా...
మీరు గమనించారో లేదో మనలో చాలా మంది ఎప్పుడూ బాధలోనే ఉంటారు. ప్రపంచంలోని కష్టాలన్నీ వారికే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని కూడా వీరు భావిస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దామా...
telugu astrology
1.మకర రాశి..
కొన్ని రాశుల వారు చాలా దిగులుగా ఉంటారు వారిలో మకరం ఒకటి. వారు సన్నిహిత మనస్సు గల వ్యక్తులు. వారికి వారి భావోద్వేగాలను వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. అలా చేయడంలో విఫలమైనప్పుడు, వారు డిప్రెషన్‌కు గురవుతారు. వారు తమ భావోద్వేగాలతో ఎంతగానో పోరాడుతారు. ఒంటరిగా బాధపడుతూ ఉంటారు.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభం అంతర్ముఖులు. మనసులో మాటను బయటపెట్టరు. వారు తమ కంఫర్ట్ జోన్‌ను కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. వారు మార్పులను అసహ్యించుకుంటారు. ఒక్క పరిస్థితి కూడా మారినప్పుడు, వారు ఉద్రేకానికి గురవుతారు. వారి జీవితంలో ప్రతిదీ గందరగోళంగా ఉన్నట్లుగా తెగ ఫీలౌతారు.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభం అంతర్ముఖులు. మనసులో మాటను బయటపెట్టరు. వారు తమ కంఫర్ట్ జోన్‌ను కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. వారు మార్పులను అసహ్యించుకుంటారు. ఒక్క పరిస్థితి కూడా మారినప్పుడు, వారు ఉద్రేకానికి గురవుతారు. వారి జీవితంలో ప్రతిదీ గందరగోళంగా ఉన్నట్లుగా తెగ ఫీలౌతారు.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా ప్రేమగల వ్యక్తులు. వారు చాలా శ్రద్ధగా ఉంటారు. అందరి ముందు చాలా ధైర్యవంతుల్లా నటిస్తారు. కానీ... లోపల మాత్రం ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. జీవితంలోని కష్టాలన్నీ తమకే ఉన్నాయని తెగ ఫీలౌతూ.. లోలోపలే బాధడుతుంటారు. ఆ బాధను మళ్లీ ఎవరికీ చెప్పరు కూడా.
telugu astrology
5.మీనరాశి
మీన రాశి సాధారణంగా చాలా దయ, ప్రేమగలవారు. తమకు ఇష్టమైన వారి కోసం జీవితాన్ని బలి చేసుకోవడానికి కూడా వెనకాడరు. ఈ క్రమంలో వీరు లేని పోని.. కష్టాలను కొని తెచ్చుకుంటారు. తమకు అవసరంలేని తలనొప్పులు అంటించుకొని బాధపడుతూ ఉంటారు.