Zodiac signs: ఈ రాశులవారు బంగారం ధరిస్తే.. వారి అదృష్టం రెట్టింపు అవుతుంది..!
Zodiac signs: బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా స్త్రీలు బంగారం ఆభరణాలు వేసుకోవడాన్ని ఇష్టపడతారు. కానీ జోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే ఇది అదృష్టాన్ని ఇస్తుంది.

Zodiac signs
భారతీయ జోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి లోహం ఒక ప్రత్యేక గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. బంగారం బృహస్పతి గ్రహానికి సూచికగా పరిగణిస్తారు. ఇది ఆధ్యాత్మికత, సంపద, ప్రతిష్టను సూచిస్తుంది. అయితే, ప్రతి ఒక్కరికీ బంగారం శుభం ఇవ్వదు. కొందరు బంగారం ధరించడం వల్ల వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. కొందరికి మాత్రం నష్టాలను కలిగిస్తుంది. మరి, బంగారం విషయంలో అదృష్ట రాశులేంటి..? దురదృష్ట రాశులేంటో చూద్దాం...
బంగారంతో అదృష్టం పెరిగే రాశులు...
1.మేష రాశి...
మేష రాశికి అధిపతి కుజుడు. బంగారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉండడంతో, ఈ రాశివారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు బంగారం ధరించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు వస్తాయి. ఈ రాశివారు బంగారం ఉంగరం లేదా గొలుసు ఎడమ చేతికి ధరించడం శుభం.
2.కర్కాటక రాశి...
కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడు. బృహస్పతి చంద్రుడికి మిత్ర గ్రహం. కాబట్టి, బంగారం ధరించడం కర్కాటక రాశివారికి శుభప్రదం. ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఈ రాశివారు మంగళవారం లేదా గురువారం రోజున ధరించాలి.
3.సింహ రాశి..
సింహ రాశి అధిపతి సూర్యుడు. సూర్యుడు, బృహస్పతి పరస్పర మిత్రులు. కాబట్టి సింహ రాశి వారికి బంగారం ధరించడం అత్యంత శుభప్రదం. ఈ రాశివారు బంగారం ధరించడం వల్ల ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసం పెరిగి నాయకత్వ స్థానంలో నిలుస్తారు. ఈ రాశివారు ఆదివారం రోజున బంగారు ఉంగరం, గొలుసు ధరించడం మంచిది.
ఈ రాశులకు కూడా శుభమే...
4.కన్య రాశి...
కన్య రాశికి బుధుడు అధిపతి అయినప్పటికీ, బృహస్పతి ఈ రాశికి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అయితే బంగారం ధరించడం వల్ల బుధ-బృహస్పతి అనుకూలత పెరిగి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. వీరు బంగారం ధరించడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. విద్యా రంగంలో విజయాలు సాధిస్తారు. వీరు బంగారు కడియం లేదా గొలుసు శుక్రవారం ధరించాలి.
5.ధనస్సు రాశి..
ఈ రాశి అధిపతి బృహస్పతి. ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం అత్యంత శుభప్రదం. ఈ రాశివారు బంగారం ధరించడం వల్ల ధనలాభం, మానసిక శాంతి, ఆధ్యాత్మిక పురోగతి సాధించగలరు. వీరు గురువారం రోజున బంగారం ధరించడం మంచిది.
6.మీన రాశి...
మీన రాశి అధిపతి కూడా బృహస్పతి . కాబట్టి ఈ రాశి వారికి బంగారం ధరించడం అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రాశివారు బంగారం ధరించడం వల్ల కెరీర్ లో అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం కలుగుతుంది. గురువారం బంగారం ధరించడం మంచిది.
బంగారం ధరించకూడని రాశులు...
వృషభ రాశి...
వృషభ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, సుఖ సౌకర్యాల గ్రహం. కానీ శుక్రుడు, బృహస్పతి గ్రహాలు జోతిష్య శాస్త్రంలో శత్రుత్వ సంబంధం కలిగి ఉంటాయి. ఈ కారణంగా వృషభ రాశివారు బంగారం ధరించడం వల్ల శుక్రుడి శక్తి బలహీనమౌతుంది. దీని వల్ల వీరికి ఆర్థిక సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
పరిష్కారం.. ఈ రాశివారు బంగారం బదులు వెండి లేదా వజ్రం ధరించడం మంచిది. ఇవి శుక్రుడికి అనుకూలంగా ఉండి, సౌభాగ్యం, ప్రేమను పెంచుతాయి.
మిథున రాశి....
మిథున రాశి పాలకుడు బుధ గ్రహం. బుధుడు బృహస్పతితో శత్రుత్వం కలిగి ఉంటుంది. బంగారం ధరించడం బుధుడి శక్తిని దెబ్బతీసి, ఆలోచన లో గందరగోళం, నిర్ణయాల్లో తప్పులు, మానసిక ఆందోళనలు కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ రాశివారు వెండి లేదా రాగి ధరించడం మంచిది.
వీరు కూడా దూరంగా ఉండాల్సిందే...
వృశ్చిక రాశి...
వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇది శక్తి, ధైర్యం, పోరాటానికి సంకేతం. బంగారం ధరించడం వలన బృహస్పతి ప్రభావం పెరగడం ద్వారా కుజుడి ఆగ్రహం, శక్తి తారుమారవుతుంది. ఈ రాశివారి ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. ఈ రాశివారు వెండి లేదా రాగి ధరించడం శుభప్రదం. మానసిక శాంతి పెరుగుతుంది.
మకర, కుంభ రాశులు....
మకర, కుంభ రాశులను శని గ్రహం పాలిస్తుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం, శని బృహస్పతి మధ్య సంబంధం తటస్థంగా ఉన్నప్పటికీ, వారి కలయిక సంక్లిష్ట ప్రభావాలను కలిగిస్తుంది. బంగారం బృహస్పతి శక్తిని పెంచి శనిని బలహీన పరచవచ్చు. వీరు కూడా వెండి, ఐరన్, స్పటికం ధరించడం శుభప్రదం.