- Home
- Astrology
- Zodiac sign: ఈ నాలుగు రాశులవారికీ జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ, ఒక్కసారి చూసినా ఎవరి ముఖం మర్చిపోలేరు
Zodiac sign: ఈ నాలుగు రాశులవారికీ జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ, ఒక్కసారి చూసినా ఎవరి ముఖం మర్చిపోలేరు
జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిసిన వ్యక్తిని మీరు జీవితాంతం గుర్తించుకోగలరా? సాధ్యం కాదా? కానీ, జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి మాత్రం ఇది చాలా సాధ్యం. జీవితంలో ఒక్కసారి ముఖం చూసినా వీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మనలో చాలా మందికి మతిపరుపు ఉంటుంది. ఎంతలా అంటే.. ముందు రోజు విషయాన్ని ఈరోజుకి మర్చిపోతారు. కానీ కొంత మంది అలా కాదు. వారికి ప్రతి విషయం గుర్తుండిపోతుంది. ఎప్పుడో ఒక్కసారి ఒకరి ముఖం చూశారంటే వారికి జీవితాంతం గుర్తుంటుంది. వారి మెమరీ పవర్ అలా ఉంటుంది. మరి, ఆ రాశులేంటో తెలుసుకుందామా..
telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారు చాలా ఉత్సాహభరితంగా ఉంటారు. వీరి మైండ్ చాలా చురుకుగా ఉంటుంది.వీరు ఒక్కసారి ఎవరైనా వ్యక్తిని చూశారు అంటే జీవితంలో మర్చిపోలేరు. అయితే.. వారి పేర్లు వీరికి పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ, వారి చిరునవ్వు, వారు దురించిన దుస్తులు ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంచుకుంటారు.ఒకసారి కలిసిన వ్యక్తిని మళ్లీ కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడగలరు.
telugu astrology
మిథునరాశి..
మిథున రాశివారు సోషల్ బటర్ ఫ్లైస్ లాంటివారు.అంటే, వీరికి స్నేహితులు చాలా ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా ఎవరితోనైనా స్నేహం చేయగలరు. ఎంత మందితో స్నేహం చేసినా వారిని ఎప్పటికీ వీరు మర్చిపోలేరు. ఈ రాశివారు తమకు పరిచయం అయిన ప్రతి వ్యక్తి పేరు, పూర్తి వివరాలు ఈ రాశివారికి బాగా గుర్తుంటాయి. తమను కలిసిన రోజు వాళ్లు ఏ రంగు దుస్తులు ధరించారో కూడా వీరు చెప్పగలరు.
telugu astrology
కుంభ రాశి..
కుంభ రాశివారు చాలా తెలివైనవారు.వారు ఏ రంగంలో అడుగుపెట్టినా, అందులో విజయం సాధించగలరు. వీరి మైండ్ కూడా చాలా షార్ప్. వీరు తొందరగా ఏ విషయాన్నీ మర్చిపోలేరు.వీరు ప్రతి విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకుంటారు. ఎవరినైనా కలిసినప్పుడు వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారు చూపు, మాట తీరు, ప్రవర్తనా అన్నీ గుర్తుంచుకుంటారు. వాటి ఆధారంగా ఎప్పుడో చూసిన వ్యక్తిని కూడా వీరు గుర్తించుకోగలరు.చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోరు.
telugu astrology
మీన రాశి..
మీన రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు ప్రతి వ్యక్తితోనూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అందుకే వీరు తొందరగా ఎవరినీ మర్చిపోలేరు. ఒక్కసారి ఎవరితో అయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారంటే.. వారిని జీవితంలో మర్చిపోలేరు. పొరపాటున పేరు మర్చిపోవచ్చు. కానీ ఆ మనిషిని మాత్రం గుర్తుంచుకుంటారు.