Zodiac signs: ఈ రాశుల వారు తమ శత్రువులను అంత మొందిస్తారు..!
జోతిష్యశాస్త్రం ప్రకారం మాత్రం కొన్ని రాశులవారు తమ శత్రువులను వదిలిపెట్టరు. తమ శత్రువులను అంతమొందించడమూ, లేక నాశనం చేసే దాకా వీరికి నిద్ర పట్టదు.

రాశి ఫలాలు
మన జీవితంలో స్నేహితులు ఉండటం అనేది ఎంత కామనో... శత్రువులు కూడా ఉంటారు. చాలా మంది తమ శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ.. జోతిష్యశాస్త్రం ప్రకారం మాత్రం కొన్ని రాశులవారు తమ శత్రువులను వదిలిపెట్టరు. తమ శత్రువులను అంతమొందించడమూ, లేక నాశనం చేసే దాకా వీరికి నిద్ర పట్టదు.వారి అంతం చూసే దాకా వీరికి నిద్రపట్టదు. మరి.. ఆ రాశులేంటో చూద్దామా...
1.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి తెలివితేటలు చాలా ఎక్కువ.వీరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. స్వభావరీత్యా ఈ రాశివారి ఆలోచనలు మాత్రం సూపర్ గా ఉంటాయి.వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు.కానీ.. వీరి మనసులో ఉన్న విషయాలను మాత్రం బయటపెట్టరు. వీరు ఏం ప్లాన్ చే్స్తారో ఎవరూ ఊహించలేరు. వీరికి ఎవరు అయినా శత్రువులు ఉంటే... వారిని ఓడించే వరకు నిద్రపోరు. నిశ్శబద్దంగా ఉంటూనే అదును చూసి.. శత్రువుల మీద పగతీర్చుకుంటారు.
2.సింహ రాశి..
సింహ రాశివారికి సాధారణంగా శత్రువులు అనేవాళ్లు ఉండరు. ఈ రాశివారికి సహజంగా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. వీరిని వ్యతిరేకించి ఎదురు నిలపడటానికి ఎవరూ ధైర్యం చేయలేరు. ఎవరైనా వీరిని సవాలు చేస్తే.. వాళ్ల అంతం చూసేవరకు వీరు నిద్రపోరు. వీరు చాలా ప్రమాదకరం. ఈ రాశివారు తమ కుటుంబం, గౌరవం, స్నేహితుల కోసం..ఎవరితో అయినా పోరాటం చేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గరు. అసలు.. వీరి గొంతుకి ఎలాంటివారైనా పారిపోవాల్సిందే.
3.మకర రాశి..
సాధారణంగా మకర రాశివారు ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ ఎవరైనా వారితో శత్రుత్వం పెట్టుకుంటే.. వారిని దెబ్బ తీసేవరకు నిద్రపోరు. అయితే.. అన్నింటికీ ఆవేశపడరు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతారు. ఓపికగా వేచి ఉంటారు. సరైన సమయంలో దాడి చేస్తారు. వారి బలమైన మనస్తత్వం , నిర్ణయం తీసుకునే సామర్థ్యం వారి శత్రువులను పూర్తిగా నాశనం చేస్తుంది.