ఇంట్లో ఊరికే గొడవలు అవుతున్నాయా..? ఈ వాస్తు చిట్కాలు ఫాలో అయితే చాలు..!
మన ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం వల్ల కూడా.. ఎప్పుడూ ఏదో ఒక సమస్య రావడం, ఇంట్లో గొడవలు జరగడం, సంపాదన నిలవకపోవడం లాంటివి జరుగుతాయట.
couple fight
ప్రతి ఇంట్లో చిన్న, చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్నవి అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ.. వాటి కారణంగా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు రావడం.. ఇంట్లోని సభ్యులకు మనశ్శాంతి లేకపోవడం లాంటివి జరిగినప్పుడే అసలు సమస్య. చాలా మంది.. తమ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని.. తమ పేరెంట్స్ గొడవపడుతూ ఉంటారని, ప్రశాంతంగా ఉండలేం అని చెబుతూ ఉంటారు. అలా జరగడానికి వాస్తు కూడా ఒక కారణం కావచ్చు. అందుకే కొన్ని వాస్తు చిట్కాలు ఫాలో అయితే.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
మన ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం వల్ల కూడా.. ఎప్పుడూ ఏదో ఒక సమస్య రావడం, ఇంట్లో గొడవలు జరగడం, సంపాదన నిలవకపోవడం లాంటివి జరుగుతాయట. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి దిశలో త్రిభుజాకారంలో ఏదైనా వస్తువు లేదా పెయింటింగ్ లాంటివి ఉంచకూడదట. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు రావడం మొదలౌతాయట.
ఈశాన్య మూలలో బుద్ధుడు
ఇంటి ఈశాన్య మూలలో (ఈశాన్య దిశలో) గౌతమ బుద్ధుని చిత్రం లేదా చిన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇంట్లో శాంతిని కాపాడుతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగతుంది. గొడవలు రాకుండా ఉంటాయట.
payasam
నైరుతి గదిలో ఎరుపు రంగు..
నైరుతి వైపు ఉన్న గదిలో ఎరుపు రంగును ఉపయోగిస్తే, దానిని మార్చాలి. అలాగే, ప్రతికూలతను ప్రోత్సహించే విధంగా ఇంట్లో యుద్ధం లేదా పోరాట చిత్రాలు ఉండకూడదు.
బియ్యం పాయసం..
ప్రతి నెల సోమవారం నాడు అన్నం పాయసం నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి సేవించాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు.
గంగాజలం.
ఇంటి ఈశాన్య మూలలో గంగాజలం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, సామరస్యం నెలకొంటాయి.
పడకగదిలో రాతి ఉప్పు
వైవాహిక జీవితంలో శాంతి, సంతోషం కోసం, పడకగదిలో ఒక మూలలో రాతి ఉప్పు లేదా రాయి ఉప్పు ఉంచండి. ప్రతి నెలా మార్చండి. ఈ రెమెడీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది.