Zodiac signs: గురుబలం వల్ల నాలుగు రాశుల వారికి డబ్బే డబ్బు, వీరికి మంచి రోజులు మొదలు
దేవతలకు గురువైన బృహస్పతి త్వరలో నక్షత్రం మార్చుకోబోతున్నాడు. సెప్టెంబర్ 19 మధ్యాహ్నం మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలోని మూడవ పాదంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల నాలుగు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండడి.

మిథున రాశి
గురు గ్రహం సెప్టెంబరు 19న నక్షత్రం మార్చుకోబోతున్నాడు. మిథున రాశి వారికి గురువు సంచారం వివాహం ప్రభావం చూపుతుంది. వీరిలో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, వ్యక్తిత్వం ఉత్తమంగా పెరిగే సమయం ఇది. పునర్వసు నక్షత్రం గురు గ్రహానికి చెందిన సొంత నక్షత్రం. దీని వల్ల అక్కడ గురువు చాలా బలంగా ఉంటుంది. దీనివల్ల ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టుల్లో విజయం వంటి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే కాలం ఇది. చిన్న ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే, మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి,
తులారాశి
తులారాశి వారికి గురు సంచారం ఎంతో ప్రభావం చూపుతుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ధార్మిక కార్యక్రమాల్లో విజయానికి ఈ సమయం ఎంతో అనుకూలమైనది. మీరు పనిచేసే లక్ష్యం దిశగా విజయం సాధించడానికి గురువు సంచారం సహాయపడుతుంది.ఈ కాలంలో సానుకూల ఆలోచనలు, గురు మంత్ర జపం మీకు ప్రత్యేకంగా ప్రయోజనకరం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గురు గ్రహ సంచారం వివాహం విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం, సామరస్యం పెరుగుతాయి. అవివాహితులకు పెళ్లి కావచ్చు. వ్యాపార భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. న్యాయ సంబంధిత విషయాల్లో విజయం లభిస్తుంది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఈ సంచారం మీకు స్థిరత్వం, సంపన్నతకు ద్వారాలు తెరుస్తుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి గురు గ్రహం వల్ల విద్య, ప్రేమ, సృజనాత్మక పనుల్లో పురోగతి లభిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. పునర్వసు నక్షత్ర శక్తి మీ కొత్త ఆలోచనలను అమలు చేయడంలో మీకు సహాయపడుతుంది. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీ చదువులో లేదా పనిలో ఏకాగ్రతను కాపాడుకోండి.