MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • 2023 లో వృషభ రాశివారి ఫలితాలు....!

2023 లో వృషభ రాశివారి ఫలితాలు....!

నూతన సంవత్సరం 2023 లో వృషభ రాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో  ధనవ్యయం. మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త. విచిత్ర సమస్యలు ఉంటాయి. . శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి.

10 Min read
ramya Sridhar
Published : Dec 02 2022, 10:21 AM IST| Updated : Dec 02 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
Taurus 2023

Taurus 2023

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

215
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

315
Astro

Astro

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

2023 సంవత్సరం మీకు  సర్వత్రా విజయం అందిస్తుంది.  మీ ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అవన్నీ కలిసి మీకు  గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా, ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. తమకు సంభందం లేని అనవసర విషయాల పట్ల ఆకర్షితులైనవారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా స్నేహితుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు  మిత్రులతో అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఈ సంవత్సరం అతి జాగ్రత్త, మితభాషణ కలిసొచ్చే అంశాలు. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా, మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా ఉండండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. 

2023 లో మేష రాశివారి ఫలితాలు...!

 

415

జనవరి 2023
 
ఈ నెలలో  ధనవ్యయం. మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త. విచిత్ర సమస్యలు ఉంటాయి. . శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధన లాభముంటుంది. 
 
లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్  విషయంలో గౌరవంగానూ, జాగ్రత్తగా నుండుట మంచిది. కుటుంబరీత్యా  గౌరవ, మర్యాదలు పొందు తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. కాకపోతే కొన్ని విభేధాలకు అవకాసం కనిపిస్తోంది. నోరు జాగ్రత్త..జారకండి.

ఉద్యోగం-వ్యాపారం: షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. ఉద్యోగరీత్యా చాలా కాలంగా ఎదురుచూస్తున్న విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనో విచారం తొలుగుతుంది. వ్యాపార  పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
 
 ఆరోగ్యం:  కొన్ని గ్రహాలు అశుభులైనందున  ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. మనో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. అనారోగ్యం వలన నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కానీ స్వల్ప కాలమే. ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. 

515
Taurus Zodiac

Taurus Zodiac

ఫిబ్రవరి 2023

మీ జాతకంలో ప్రస్తుతం కొన్ని  గ్రహాలు శుభులైనందున నూతన వస్తు, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ నెలాఖరు వరకు మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
 
లవ్ లైఫ్:   మీ లైఫ్ పార్టనర్ తో ...చేసే కొన్ని  ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి.  విరోధ మేర్పడే అవకాశాలుంటాయి.వారి పట్ల పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయండి.  ఈ నెలాఖరు వరకు ఇవి తప్పవు.

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగరీత్యా వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. అధికారల వద్ద గుర్తింపు.  వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు

ఆరోగ్యం:  ఈ నెలలో కొంతకాలంగా పట్టి పీడిస్తున్న మానసిక ఆందో ళన తొలగుతుంది. అయినా ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. కొద్ది జాగ్రత్తతో  దీర్ఘకాల సమస్యల్లోకి వెళ్లరు.
 

615

మార్చి 2023

 ఈ నెలలో ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానం దాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. అయితే నెల మధ్యలో బంధుమిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది.

లవ్ లైఫ్ : మీ లైఫ్  పార్టనర్ దగ్గర తెలివి, ఓర్పు ప్రదర్శించి  విజయం సాధిస్తారు.  దాంతో మనశ్సాంతి  వెంటనే దొరుకుతుంది.మీ  వృత్తి ఉద్యోగాల్లో మీ భాగస్వామి నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది.  ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల ఉద్యోగ జీవితంలో   మంచి మార్పులు కొన్ని ప్రారంభం అవుతాయి. ద్వితీయార్ధంలో గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందున వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 15వ తేదీ వరకు వ్యాపారస్దులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం.

ఆరోగ్యం: ఈ నెలలో మానసిక ఇబ్బందులు కనపడుతున్నాయి.  కోపం, ఆవేశం, మానసిక ఆందోళనలు జయించడానికి మెడిటేషన్‌ వంటి వాటిని ఆశ్రయించండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను, ఒంటరి ప్రయాణాలను విరమించుకోవడం శ్రేయస్కరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోరాదని సూచన.
 

715
Mercury Retrograde in Taurus

Mercury Retrograde in Taurus

ఏప్రియల్  2023

ఈ నెలలో  గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ తెలివిగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. అయితే ఆదాయ వ్యయాలు, ఋణాలు సమతూకంగా వుండవు. జాగ్రత్త అవసరం. అప్పు కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.


లవ్ లైఫ్ : ఈ నెలలో దంపతులు మధ్య అనుకూలత తక్కువ. కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి.  అందువలన తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెలలో ఉద్యోగ విషయంలో ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారస్దులకు గోల్డెన్ టైమ్. జాగ్రత్తగా వినియోగించుకోవాలి.

ఆరోగ్యం:  ఎలర్జీలు, ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. . భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి.పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

815
taurus

taurus

మే  2023

ఈ నెలలో  ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసి కానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తా యి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు విం టారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర వేర్చుకుంటారు.  వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుం టుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపో తారు. 

లవ్ లైఫ్ :  కుటుంబ సౌఖ్యముంటుంది. మానసి కానందాన్ని అనుభవిస్తారు. కుటుంబ పరంగా పేరుప్రతిష్టలు లభిస్తా యి. ఆకస్మికంగా కొన్ని వివాదాలు గొడవకు దారి తీస్తాయి. కానీ అవే సమిసిపోతాయి.  మీ భాగస్వామికి చెందిన కుటుంం నుంచి  శుభవార్తలు విం టారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర వేర్చుకుంటారు.

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగాలలో  తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందు లు ఆలస్యంగా తొలగిపోతాయి.నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.  స్థిరాస్తుల విష యంలో జాగ్రత్త అవసరం. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతా రు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

ఆరోగ్యం:   ఈ నెలలో ఊహించని విధంగా మానసికాందోళన అధికమవు తుంది. మరో ప్రక్క శారీరకమైన అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వచ్చి టెన్షన్ పడతారు.  స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు చేస్తారు.అవి కొత్త సమస్యలుతెస్తాయి. 

915
Taurus

Taurus

జూన్   2023
 
ఈ నెలలో  స్థిరాస్తులకు సంబం ధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలధికమవుతాయి.   కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం తప్పదు. నెలాఖరులో ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి. 

లవ్ లైఫ్ : మీ లైఫ్ పార్టనర్ తో .. విదేశ యాన ప్రయత్నాలు సంపూర్ణంగా నేర్చుకుంటారు. ఆకస్మిక శారీరిక సౌఖ్యం. అన్నిటా విజయాన్ని సాధిస్తారు.  పట్టుదలతో కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. మీ లైఫ్ పార్టనర్ అభిమానాన్ని చూరగొంటారు.  

ఉద్యోగం-వ్యాపారం:  మీరు పనిచేసే ఆఫీస్ లో  గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి.  వృత్తి రీత్యా అభివృద్ధి సాధిస్తారు. ఆపీస్ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. కాకపోతే పదిహేను తేదీ దాటిన తర్వాత తలచిన కార్యాలకు ఆటంకాలెదుర వుతాయి. స్థిరాస్తులకు సంబంధించి మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం. వ్యాపారస్దులు నూతన వ్యక్తు లను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బందిపడతారు.

ఆరోగ్యం:  అనారోగ్య బాధలుంటాయి. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది.మీకు ద్రోహం చేసిన వారిపై  పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. దాని వలన మీ హెల్త్ పాడవటం తప్పించి వేరేగా కలిసొచ్చేదేమీ ఉండదు. 
 

1015

జూలై   2023

ఈ నెలలో  ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.  రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యం. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.

లవ్ లైఫ్ :మీ లైఫ్ పార్టనర్ తో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబ సౌఖ్యముంటుంది. కుటుంబ బాధలు దూరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ, అభిమానం ఒకరి పట్ల మరొకరికి ఉంటుంది. బాగుంటుంది. మీ జీవిత రహస్యాలకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా వుండుట మంచిది.  

ఉద్యోగం- వ్యాపారం: ఉద్యోగంలో భాగంగా నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. కొందరి వల్ల సస్పెన్షన్ , సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మిమ్మల్ని ఇరికిద్దామనే వారి ప్రయత్నాలు ఆలస్యంగా అయినా ఫలిస్తాయి. జాగ్రత్త అవసరం. అధికారులతో వైరం కలిగే అవకాశముంటుంది.  వ్యాపారస్దులకు ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.  

  ఆరోగ్యం: ప్రయాణాలెక్కువ చేస్తారు. తద్వారా అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.ఆరోగ్య విషయంలో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక అనారోగ్యం కలిగే అవకాశాలుంటాయి. మెడిసన్స్, డాక్టర్స్   విషయంలో  స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

1115

ఆగస్ట్    2023

  ఈ నెల నుంచి మీ పరిస్దితి బాగానే ఉన్నా... కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ధనవ్యయం అధికం అవుతుంది.  రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. వారితో మనస్పర్థలు ఎక్కువ అవుతాయి. ఈ నెల నుంచి ఆరోగ్యం, ఋణ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మనశ్శాంతిగా ఉండడం కోసం ప్రత్యేక సాధన అవసరం.లేకపోతే ఇబ్బందులు పడతారు. గ్రహాలు మారుతున్న సమయం ఇది. 

 లవ్ లైఫ్ :  మీరు మీ లైఫ్ పార్టనర్  తో ఆనందంగా గడుపుతారు. అయితే ఆమె మిమ్మల్ని పూర్తిగా నమ్మేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుండా కుటుంబపరంగా చిక్కులు. నమ్మక ద్రోహం చేయటానికి కొందరు సిద్దంగా ఉంటారు. జాగ్రత్త.

ఆరోగ్యం: కొద్దిగా పరీక్షా కాలం. కోపం, ఆవేశం, మానసిక ఆందోళనలు జయించడానికి మెడిటేషన్‌ వంటి వాటిని ఆశ్రయించండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను, ఒంటరి ప్రయాణాలను విరమించుకోవడం శ్రేయస్కరం.  

ఉద్యోగం- వ్యాపారం: ఉద్యోగస్దులు తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. వ్యాపారస్దులుకు ఋణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

1215

సెప్టెంబర్    2023

ఈ నెలలో  గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ తెలివిగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. అయితే తలకు సంభందించిన సమస్యలు, ఎలర్జీలు, ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. ఆదాయ వ్యయాలు, ఋణాలు సమతూకంగా వుండవు. జాగ్రత్త అవసరం. మిమ్మల్ని మీరు ఓ కంట కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది.

లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ పై తరచు కోపావేశాలు ప్రదర్శిస్తారు. వృథాగా వాళ్లను వదిలేసి బయిట సంచారం చేస్తూ ఉంటారు. రోజువారీ పనుల్లో సైతం సంతుష్టి లేకుండా కాలం గడుపుతారు. సాంఘిక కార్యకలాపాలు అగౌరవం తెచ్చే అవకాశం ఉంది.

ఉద్యోగం- వ్యాపారం:   ఉద్యోగంలో అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. అలాగని ఎవరినీ నమ్మి పనులు చేయవద్దు. మితభాషణ అవసరం. వ్యాపారస్దులకు అనుకూల కాలం. వాళ్లు లాభాలు వేటలో విజయం సాధిస్తారు.  అయితే అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం మంచిది.

ఆరోగ్యం: పొరపాటున కూడా  ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.  అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శించకుండా, ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీపని మీరు చేసుకుంటూ వెళితే ఆరోగ్య పరంగా అనుకూల ఫలితాలుసాధించే అవకాశం ఉంది. 

1315

అక్టోబర్    2023

 ఈ  నెలలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఎప్పటినుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దైనచింతన పెరుగుతుంది, దైవసంబంధింత కార్యాలపై దృష్టి సారిస్తారుతరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కోర్డు సంబంధిత వ్యవహారాల్లో చిక్కుకున్నవారు పరిష్కారం దిశగా అడుగువేస్తారు
 
లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ తో కొన్ని విభేదాలుంటాయి. వారితో అందరి ఎదురుగా, అకారణంగా మాటలు పడాల్సిన సందర్భాలు ఎదరవుతాయి. మీకు రహస్య శత్రువులున్నారు జాగ్రత్త. వారే రెచ్చగొడుతూంటారు. వారి విషయంలో జాగ్రత్తలు అవసరం.  భార్య-భర్త మధ్య అన్యోన్యత తగ్గుతుంది. కానీ ఎలోగోలా ఇద్దరూ ఒకేమాటపై అడుగేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. 

ఉద్యోగం- వ్యాపారం:ఉద్యోగస్దులు  పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్దులు నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రం ఓసారి ఆలోచించడం మంచిది. స్థిర చరాస్తుల వ్యవహారాల్లోనూ ఆచితూచి అడుగేయాలి.  వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి, హోల్ సేల్ వ్యాపారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్యం:  ఆరోగ్య మెరుగయ్యే విషయంలో దేనికీ తొందరవద్దు. ఆత్మీయుల సూచనలతో ఫలితం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండాలి. సహనంతోనే ఆరోగ్య విషయంలో  విజయం సాధిస్తారు.

1415

నవంబర్    2023

కొన్ని గ్రహాల దృష్టి వల్ల  మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తైపోతాయి.  ఉద్యోగ వ్యాపారాలలో గౌరవం పెరుగుతుంది. స్వయంకృషితో అభివృద్ధిని సాధించాలి. విశేష భూలాభం, గృహయోగం వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారం బాగా సాగుతుంది. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. సమయస్ఫూర్తి చాలా అవసరం. దేనికీ తొందరవద్దు. ఆత్మీయుల సూచనలతో ఫలితం ఉంటుంది.  ధన సౌఖ్యం, యశోవృద్ధి కలుగుతాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారులకు విశేషమైన శుభాలున్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.విఘ్నాలు తొలగుతాయి. 

లవ్ లైఫ్ :   మీ లైఫ్ పార్టనర్ వలన ఇంటా-బయటా గౌరవం పొందుతారు. మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. వారి వల్లే ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది.  ఇంకా చెప్పాలంటే మీకు  ఆపదలు తొలగుతాయి. అయితే వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. వారి కోసం చేస్తున్న పనుల్లో స్పష్టత అవసరం. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేయండి. 

ఆరోగ్యం:  ఈ నెలలో కంఠానికి సంభందంచిన సమస్యలు ఎక్కువ కాగలవు. దాంతో  ఎక్కువగా చికాకులు. పెద్ద సమస్య కాకపోయినా విసిగించే విధంగా ఉంటుందీ సమస్య. చిన్న పాటి వైద్యంతో సమస్య తగ్గిపోతుంది. కానీ టెన్షన్ ఎక్కువ పెడుతుంది.

ఉద్యోగం- వ్యాపారం:   ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు.  సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనోబలంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలను సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు.

1515

డిసెంబర్    2023

 ఈ నెలలో  ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి.ఆదాయం తక్కువ- ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ ధనం ఏదోవిధంగా చేతికందుతుంది. ఎక్కువ ఆలోచించకుండా ముందు ఖర్చులు తగ్గించండి. చేసిన అప్పులు కొంతవరకూ తీర్చగలుగుతారు. గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్నిస్తాయి. మనోధైర్యంతో ముందుకుసాగితే అంతా మంచే జరుగుతుంది. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత  పెంచుకోవాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 

లవ్ లైఫ్ :  గ్రహసంచారం అనుకూలంగా ఉండటంతో మీ లవ్ లైఫ్ అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. మీ ఇద్దరి మధ్యా   లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వైవాహిక  సౌఖ్యం ఉంటుంది.

ఆరోగ్యం:   ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి అనారోగ్య సమస్యలున్నాయి, వైద్యసేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం నెల  ప్రారంభంలో మందకొడిగా సాగినా క్రమంగా పుంజుకుంటుంది. భయపడాల్సిందేమీ లేదు. దైవ సహాయం కోసం ప్రార్దిస్తే అన్ని సర్దుకుంటాయి. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లండి.

ఉద్యోగం- వ్యాపారం: వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి . అయితే  వీరికి గ్రహబలం అస్సలు లేదు. మీ శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు పెద్దగా పనిచేయవు... మనోధైర్యంతో ముందుకు సాగండి. దైవానుగ్రహణే. ఇక ఉద్యోగ జీవితంలో ఆనందం ఉంటుంది, కొన్ని సమస్యల విషయంలో రాజీపడకపోతే అదే విరక్తిగా మారుతుంది. కొద్ది పాటి జాగ్రత్తలతో ఉద్యోగస్దులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.విఘ్నాలు తొలగుతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved