ఈ ఏడాదిలో ఏర్పడే సూర్య, చంద్రగ్రహనాల సమయం, తేదీ తో సహా పూర్తి వివరాలు.. ఇవిగో..
Surya Grahan, Chandra Grahan Date & Time: ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి.

Surya Grahan 2022 Date & Time: ప్రతి ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతుండటం సాధారణ విషయమే. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే దాన్ని సూర్య గ్రహనం అంటారు. హిందు పురాణాల ప్రకారం.. శుభకార్యాలు చేయడానికి ఈ సమయాలు అస్సలు మంచివి కావు. గ్రహనాల సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు కూడా.
తొలి సూర్యగ్రహనం: ఈ ఏడాదిలో ఏప్రిల్ 30 వ తారీఖున తొలి సూర్య గ్రహనం ఏర్పడనుంది. ఈ గ్రహనం మన దేశంలోనే కాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా కనిపిస్తుంది. కానీ మన దేశంలో తొలి సూర్య గ్రహనం.. పాక్షిక సూర్యగ్రహనం గా మాత్రమే ఏర్పడనుంది. మన దేశంలో ఏప్రిల్ 30న శనివారం వస్తుంది. ఈ సూర్యగ్రహం మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగింటికి ముగుస్తుంది.
రెండవ సూర్యగ్రహనం: మన దేశంలో అక్టోబర్ 25 వ తారీఖున రెండో సూర్య గ్రహనం ఏర్పడనుంది. తొలి గ్రహనం లాగే ఈ గ్రహనం కూడా పాక్షికంగానే ఏర్పడనుంది. అక్టోబర్ 25 వ తేదీన మంగళవారం అవుతుంది. ఆ రోజు గ్రహనం 4:29 మొదలై.. అదే రోజు సాయంత్రం 5:42 కే ముగిసిపోతుంది.
Chandra Grahan 2022 Date & Time: చంద్రునికి భూమికి మధ్య సూర్యుడు వస్తే చంద్రగ్రహనం ఏర్పడిందని అంటాం.
తొలి చంద్రగ్రహనం: మన దేశంలో మే 16 వ తారీఖున తొలి చంద్రగ్రహనం ఏర్పడనుంది. మన దేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఈ గ్రహనం ఏర్పడనుంది. మనదేశంలో ఈ గ్రహనం ఎఫెక్ట్ ఎక్కువే ఉండబోతోంది. క్యాలెండర్ ప్రకారం మే 16న బుధవారం వస్తుంది. ఆ రోజు గ్రహనం ఉదయం 7:02 గంటకు మొదలైతుంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహనం ఏర్పడ్డప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
రెండో చంద్ర గ్రహణం: ఇది నవంబర్ 8 తారీఖున ఏర్పడనుంది. ఈ గ్రహనాన్నిమనం చాలా స్పష్టంగా చూడొచ్చు కూడా. క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 8 వ తేదీన మంగళవారం వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 1: 32 గంటలకు మొదలైతుంది. రాత్రి ఏడు గంటల 27 నిమిషాలకు ముగుస్తుంది