ఈ రాశులవారికి పగ, ప్రతీకారాలు ఎక్కువ..!
వారు ఆ సమయంలో మౌనంగా ఉన్నారు అంటే, తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తున్నారని అర్థం. పగ తీర్చుకోకుండా మాత్రం ఉండరు. అయ్యిందేదో అయ్యింది, వదిలేద్దాం అని ఈ రాశివారు అనుకోరు. తమను బాధపెట్టిన వారిని శత్రువుల్లానే చూస్తారు. పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టరు.
జోతిష్యశాస్త్రంలో 12 రాశులు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఆ 12 రాశుల వారి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉంటాయి. ఒక్కో రాశి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. కొందరు అందరితోనూ సరదాగా ఉంటారు. కొందరు ఎప్పుడూ మూడీగా ఉంటారు. ముఖ్యంగా ఎవరితోనైనా గొడవ జరిగినప్పుడు కొందరు కాసేపటి తర్వాత వెళ్లి మాట్లాడతారు. కానీ, కొందర మౌనంగా ఉండిపోతారు. ఏమీ మాట్లాడకుండా, మౌనంగా ఉండి వారు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. వారు ఆ సమయంలో మౌనంగా ఉన్నారు అంటే, తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తున్నారని అర్థం. పగ తీర్చుకోకుండా మాత్రం ఉండరు. అయ్యిందేదో అయ్యింది, వదిలేద్దాం అని ఈ రాశివారు అనుకోరు. తమను బాధపెట్టిన వారిని శత్రువుల్లానే చూస్తారు. పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టరు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం..
telugu astrology
1. వృశ్చిక రాశి
మీరు ఎప్పుడైనా వృశ్చిక రాశిని దగ్గరగా గమనించినట్లయితే, మీరు వారి తీవ్రమైన మానసిక స్థితిని గమనించి ఉండవచ్చు. నిబద్ధతకు ఈ రాశివారు మరో పేరు. తమను ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా అంటే ఈ రాశివారు మనసులోనే పెట్టేసుకుంటారు. పగ సాధించడంలో కూడా ముందుంటారు. ఒకసారి మీరు ఏదైనా తప్పు చేస్తే, వృశ్చిక రాశి వారు దానిని మర్చిపోరు, మిమ్మల్ని క్షమించరు కూడా. వారు మీకు దూరంగా ఉంటారు. మీపై ప్రతీకారం తీర్చుకోకపోయినా, మీ తప్పును మాత్రం క్షమించరు.
telugu astrology
2.కర్కాటక రాశి..
రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఈ మనస్తత్వమే కొన్నిసార్లు శత్రుత్వానికి దారి తీస్తుంది. ఎవరైనా మోసం చేస్తే, వారిని బాధపెడితే ద్వేషిస్తారు. వాళ్లను చూస్తే వాళ్లేమీ చేయలేరు. దీంతో ఆ బాధ నుంచి వీరు బయటకు రాలేరు.
telugu astrology
3.వృషభ రాశి..
వృషభ రాశివారికి మొండి పట్టుదల ఎక్కువ. వారు నమ్ముకున్న దానికి వారు కట్టుబడి ఉంటారు. ఈ రాశివారు ఎవరైనా తప్పుగా మాట్లాడినా, పట్టించుకోకపోతే ద్వేషిస్తారు. ఆ కోపాన్ని మాత్రం ఇతరులపై పగ రూపంలో చూపించేస్తారు.
telugu astrology
4.సింహ రాశి..
సాధారణంగా స్నేహపూర్వకంగా ఉండే సింహ రాశి వ్యక్తులు తమ గురించి చాలా గర్వంగా ఉంటారు. సింహ రాశివారిని విస్మరించలేం. ఎవరిపైనా శత్రుత్వం చూపిస్తే సింహం పరువు పోతుంది. ఈ గుణం కారణంగా వారు ఎవరినైనా సులభంగా ద్వేషిస్తారు. పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టరు.
telugu astrology
5.మేష రాశి..
మేష రాశి వారికి చాలా పోటీతత్వం ఎక్కువ. ధైర్యమైన మేష రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఆ పదవిని కోల్పోతామనే భయం వారిలో ద్వేషం మొదలవుతుంది. ఎవరైనా తన ఘనతను విస్మరిస్తే, ఈ రాశివారు తట్టుకోలేరు . తీవ్రమైన పోటీ మనస్తత్వం కారణంగా, వారు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. అవసరమైతే పగ తీర్చుకుంటారు.