సూర్యగ్రహణం ఆ రోజునే.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
సూర్యగ్రహణం అక్టోబర్ 13న రాత్రి 09:50 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 14 న రాతరి 11:24 గంటలకు ముగుస్తుంది. అయితే సనాతన ధర్మంలో ఉదయించిన తేదీనే పరిగణిస్తారు. కాబట్టి అక్టోబర్ 14న సర్వపిత అమావాస్య. ఈ రోజు పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు.
సనాతన ధర్మంలో సర్వపిత అమావాస్యకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రాద్ధ పక్షం ఈ రోజునే ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 14 అమావాస్య వచ్చింది. ఈ రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అశ్విని మాసంలోని కృష్ణ పక్షం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే గ్రహణం రాత్రి సమయంలో ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే తర్పణానికి ఎలాంటి అంతరాయం కలగదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పచాంగం సూచించిన సమయంలో పూర్వీకులకు తర్పణాన్ని సమర్పించొచ్చు. అయితే గ్రహణం సమయంలో 4 రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది.
solar eclipse
శుభ క్షణం
అమావాస్య తిథి అక్టోబర్ 13 రాత్రి 09:50 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 14 రాత్రి 11:24 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయించిన తేదీనే పరిగణిస్తారు. అందుకే అక్టోబర్ 14 సర్వపిత అమావాస్య. ఈ రోజున ఎప్పుడైనా పూర్వీకులకు నివాళులు అర్పించొచ్చు.
solar eclipse
సూర్య గ్రహణ సమయం
సూర్యగ్రహణం సర్వపిత అమావాస్య రోజున.. భారత కాలమానం ప్రకారం రాత్రి 08:34 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే తెల్లవారుజామున 02:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం చెల్లదు. ఈ సమయలో ఎలాంటి ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు.
ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ సమయంలో సూర్య భగవానుడు వృశ్చిక రాశి వారి ఆదాయం, ధనుస్సు వ్యాపారం, మకర రాశి వారి సంపద, సింహరాశి సంపదను పరిశీలిస్తాడు. అందుకే సూర్యగ్రహణం రోజున సింహ రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి , మకర రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఈ రాశుల వారు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే రుణాలు కూడా ఇవ్వకూడదు. గ్రహణం సమయంలో రాహు ప్రభావం పెరుగుతుంది. అందుకే గ్రహణం రోజున ఎలాంటి శుభకార్యాలు జరిపించకూడదు.